AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG 2nd ODI : 6 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ విజయం.. టీమిండియా భారీ స్కోర్‌ను చిత్తు చేసిన బెయిర్​స్టో, స్టోక్స్

Sanjay Kasula

|

Updated on: Mar 26, 2021 | 9:51 PM

India vs England live score updates: పుణె వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో ఇంగ్లాండ్ విజయం సాధించింది. రెండో వన్డేలో నిరాశపరిచింది. 337 పరుగుల భారీ టార్గెట్‌ను ఇంగ్లాండ్‌ 43.3 ఓవర్లకే ఈజీగా కొట్టేసింది.

IND vs ENG 2nd ODI : 6 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ విజయం.. టీమిండియా భారీ స్కోర్‌ను చిత్తు చేసిన బెయిర్​స్టో, స్టోక్స్
England Wins By 6 Wkts

India vs England live score updates: అయితే అప్పుడే ఎండ్ కార్డ్ పడలేదు.. శుభం కార్డ్ పడాలంటే మరో అవకాశం ఉంది టీమింయాకు… మొదటి వన్డేలో గెలిచిన టీమిండియా.. రెండో వన్డేలో నిరాశపరిచింది. 337 పరుగుల భారీ టార్గెట్‌ను ఇంగ్లాండ్‌ 43.3 ఓవర్లకే ఈజీగా కొట్టేసింది. జానీ బెయిర్‌స్టో (124/ 112 బంతుల్లో 11-బౌండరీలు , 7సిక్సర్లు) సెంచరీకి తోడు బెన్‌స్టోక్స్‌ (99/ 52 బంతుల్లో 4 ఫోర్లు 10సిక్సర్లు), జేసన్‌ రాయ్‌ (55) చెలరేగడంతో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అంతకు ముందు కేఎల్‌ రాహుల్‌ (108/114 బంతుల్లో 7-4, 2-6) శతకానికి తోడుగా విరాట్‌ కోహ్లీ (66/79), రిషభ్ పంత్‌ (77; 40 బంతుల్లో 3ఫోర్లు, 7సిక్సర్లు) మెరుపులతో టీమిండియా 336/6తో నిలిచింది.

అంతకు ముందు.. ఇంగ్లాండ్ ముందు టీమిండియా మరోసారి భారీ టార్గెట్‌ను ఉంచింది.పుణేలో జ‌రుగుతున్న రెండ‌వ వ‌న్డేలో భార‌త్‌.. నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్ల న‌ష్టానికి 336 ర‌న్స్ చేసింది. మిడిల్ ఆర్డ‌ర్‌లో కేఎల్ రాహుల్ మ‌రోసారి స‌త్తా చాటాడు. వ‌న్డేల్లో 5వ సెంచ‌రీ న‌మోదు చేసుకున్నాడు. ఏడు ఫోర్లు, రెండు సిక్స‌ర్ల‌తో రాహుల్ 108 చేసి ఔట‌య్యాడు. శ్రేయ‌ర్ స్థానంలో వ‌చ్చిన రిష‌బ్ పంత్ కూడు తుఫాన్ వేగంతో బ్యాటింగ్ చేశాడు. అతడి  దూకుడు బ్యాటింగ్‌తో ఇంగ్లాండ్ బౌలర్ల కు చుక్కలు చూపించాడు. కేవ‌లం 40 బంతుల్లో 77 పరుగులు చేశాడు. పంత్ ఇన్నింగ్స్‌లో ఏడు సిక్స‌ర్లు, మూడు ఫోర్లు ఉన్నాయి. ఇక చివ‌ర్లో హార్దిక్ పాండ్యా కూడా ర‌ఫాడించాడు. 16 బంతుల్లో 35 ర‌న్స్ చేసి ఔట‌య్యాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ 66 ర‌న్స్ చేశాడు. తొలి వ‌న్డేలో భార‌త్ 66 ర‌న్స్ తేడాతో ఘ‌న విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే.

టీమిండియా జట్టు : ధావన్, రోహిత్, కోహ్లీ(కెప్టెన్), కేఎల్ రాహుల్, రిషబ్ పంత్​ (వికెట్​ కీపర్​), హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య, శార్దుల్ ఠాకుర్, భువనేశ్వర్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్

ఇంగ్లాండ్ జట్టు : జేసన్ రాయ్, బెయిర్​స్టో, బట్లర్(కెప్టెన్), స్టోక్స్, మొయిన్ అలీ, సామ్ కరన్, టామ్ కరన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, లివింగ్​స్టోన్, రీసి టోప్లే

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 26 Mar 2021 09:29 PM (IST)

    6 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ విజయం

    ఇంగ్లాండ్ 4.3 ఓవర్లకే‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.  మలన్‌ (16), లివింగ్‌స్టన్‌ (27) నాటౌట్‌గా నిలిచారు.

  • 26 Mar 2021 08:18 PM (IST)

    బెయిర్​స్టో సెంచరీ..

    బెయిర్‌స్టో  సెంచరీని పూర్తి చేసుకున్నాడు. కుల్దీప్ ఓవర్  మొదటి బంతిని మిడ్ వికెట్ మీదుగా సిక్సర్‌ కొట్టాడు. ఈ సిక్సర్‌తో బెయిర్‌స్టో తన 11 వ సెంచరీని నమోదు చేసుకున్నాడు. 8 ఫోర్లు, 6 సిక్సర్ల సహాయంతో బెయిర్‌స్టో కేవలం 95 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు.

  • 26 Mar 2021 05:29 PM (IST)

    336 పరుగులు చేసిన టీమిండియా

    చివరి ఓవర్లో భారత జట్టుకు ఎక్కువ పరుగులు రాలేదు. రీస్ టోప్లీ భారత బ్యాట్స్‌మెన్‌లను తమ చివరి 2 ఓవర్లలలో కట్టడి చేశారు.  భారత్ 50 వ ఓవర్లో 9 పరుగులు మాత్రమే చేసి 5 వికెట్లు కోల్పోయి 336 పరుగులు చేసింది.

  • 26 Mar 2021 05:27 PM (IST)

    చివరి ఓవర్లో  టీమిండియా ఐదవ వికెట్

    చివరి ఓవర్లో  టీమిండియా ఐదవ వికెట్ కోల్పోయింది. హార్దిక్ పాండ్యా, రీస్ టోప్లీకి నాలుగు పరుగులు చేసిన తరువాత.. తదుపరి బంతిని స్ట్రెయిట్ బౌండరీ వైపుకు తీసుకున్నాడు. కాని జాసన్ రాయ్ మంచి క్యాచ్ తీసుకున్నాడు. పాండ్యా కేవలం 16 బంతుల్లో 4 సిక్సర్లు, ఒక ఫోర్ల సహాయంతో 35 పరుగులు చేశాడు.

  • 26 Mar 2021 05:18 PM (IST)

    హార్దిక్ పాండ్యా సిక్సర్

    హార్దిక్ పాండ్యా 49 వ ఓవర్లో రెండో బంతిని సిక్సర్ పంపాడు. దీని తరువాత, క్రునాల్ పాండ్యా ఐదవ బంతికి తన మొదటి నాలుగు పరుగులు చేశాడు.

  • 26 Mar 2021 05:08 PM (IST)

    పంత్ తుఫాన్ వేగానికి బ్రేక్ పడింది…

    రిషబ్ పంత్ తుఫాను వేగానికి ఇంగ్లాండ్‌కు బ్రేక్ పడింది. టామ్ కరణ్ వేసిన బౌలింగ్‌లో దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. భారీ షాట్ కోసం ప్రయత్నించి బౌండరీలో ఉన్న జాసన్ రాయ్ క్యాచ్ ఇచ్చాడు. పంత్ కేవలం 40 బంతుల్లో 7 సిక్సర్లు, 3 ఫోర్ల సహాయంతో 77 పరుగులు చేశాడు. ఇది వన్డే ఫార్మాట్‌లో పంత్‌కు అతిపెద్ద స్కోరు.

  • 26 Mar 2021 05:02 PM (IST)

    హార్దిక్ మరో సిక్సర్

    సామ్ కరణ్ ఓవర్లో హార్దిక్ తన మూడవ సిక్స్ చేశాడు. కరణ్ యార్కర్ బంతిని ప్రయత్నించాడు, కాని హార్దిక్ దానిని పూర్తి టాస్ గా మార్చి 6 పరుగుల కోసం మిడ్ వికెట్ బౌండరీ వెలుపల నడిపాడు.

  • 26 Mar 2021 04:59 PM (IST)

    రిషబ్ పంత్ మరోసారి సిక్సర్

    రిషబ్ పంత్ మరోసారి సిక్సర్ కొట్టడంతో దూకుడు మీదున్నాడు. స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. రిషబ్… కరణ్ యొక్క స్లో బంతిని సిక్సర్ కోసం లాంగ్ ఆన్ వైపుకు పంపాడు.

  • 26 Mar 2021 04:57 PM (IST)

    హార్దిక్ పాండ్యా మొదటి సిక్సర్

     క్రీజుకు రాగానే హార్దిక్ పాండ్యా ఒక సిక్సర్‌తో ప్రారంభించాడు. 

  • 26 Mar 2021 04:56 PM (IST)

    కేఎల్‌ రాహుల్ ఔట్..

    కేఎల్‌ రాహుల్‌(108/114 బంతుల్లో 7×4, 2×6)  సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత ఔటయ్యాడు. ధాటిగా ఆడే క్రమంలో టామ్‌కరన్‌ వేసిన 44.5 బంతికి భారీ షాట్‌ ఆడి బౌండరీ వద్ద టాప్లీ చేతికి చిక్కాడు. దీంతో టీమిండియా 271 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ కోల్పోయింది. మరోవైపు పంత్‌(63) పరుగులతో బ్యాటింగ్‌ చేస్తుండగా, హార్దిక్‌ పాండ్య క్రీజులోకి వచ్చాడు.

  • 26 Mar 2021 04:49 PM (IST)

    రాహుల్ బౌండరీ

    సెంచరీ పూర్తి చేసుకున్న రాహుల్ వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. టామ్ కరణ్ అతనికి ఆ అవకాశాన్ని ఇచ్చాడు. కరణ్ ఫుల్ టాస్ బంతిపై రాహుల్ బలమైన స్ట్రెయిట్ డ్రైవ్ చేసి  బౌండరీగా మార్చాడు

    భారత్ 44 వ ఓవర్ నుండి 10 పరుగులు, స్కోరు- 267/3

  • 26 Mar 2021 04:43 PM (IST)

    కేఎల్‌ రాహుల్‌ సెంచరీ..

    టీమిండియా బ్యాట్స్‌మన్‌ కేఎల్‌ రాహుల్‌  సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో అతడికిది ఐదో సెంచరీ కావడం విశేషం. టీ20ల్లో పూర్తిగా విఫలమైన అతడు తొలి వన్డేలోనూ అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో తొలుత కోహ్లీ(66)తో కలిసి మూడో వికెట్‌కు 121 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన అతడు తర్వాత పంత్‌(57) తోనూ మరో శతక భాగస్వామ్యం జోడించాడు.

  • 26 Mar 2021 04:38 PM (IST)

    ఫోర్లు… సిక్సులతో విరుచుకుపడుతున్న పంత్, రాహుల్

    పవర్ ప్లేలో టీమిండియా దూకుడు ప్రదర్శిస్తోంది.  రాహుల్ ఫోర్లు, సిక్సర్ల మొత మోగిస్తున్నాడు. టామ్ కరణ్ వేసిన తొలి బంతి రాహుల్‌ను అదనపు కవర్‌ వైపు కొట్టాడు. దీంతో ఇది  సిక్సర్ గా మారింది.  అతను రెండవ బంతిని కట్టిపడేశాడు మరియు స్క్వేర్ లెగ్ వద్ద బౌండరీగా  చేశాడు. రాహుల్ ఒక శతాబ్దానికి చాలా దగ్గరగా ఉన్నాడు.

  • 26 Mar 2021 04:20 PM (IST)

    రిషబ్ పంత్ బౌండరీ

    రిషబ్ పంత్ దూకుడు మొదలు పెట్టాడు. 40 వ ఓవర్ రెండో బంతి బౌండరీగా మార్చాడు రిషబ్ పంత్ . రిషబ్ కవర్ డ్రైవ్ చేసేందుకు కష్టపడుతున్నాడు..దీంతో  ఒక ఫోర్ వచ్చింది. దీంతో రాహుల్, పంత్ మధ్య 44 బంతుల్లో అర్ధ సెంచరీ భాగస్వామ్యం అయ్యింది

  • 26 Mar 2021 04:09 PM (IST)

    సెంచరీ దిశగా కెఎల్ రాహుల్..

    రెండో వన్డేలో కెఎల్ రాహుల్ సెంచరీ కోసం ఎదురు చూస్తున్నాడు. 37 వ ఓవర్లో అతను అద్భుతమైన ఫోర్ కొట్టాడు. ఈ ఓవర్ తర్వాత భారత స్కోరు 3 వికెట్లకు 187 పరుగులు. కెఎల్ రాహుల్ ప్రస్తుతం 90 బంతుల్లో 77 పరుగులు చేసి క్రీజ్‌లో ఉన్నాడు.

  • 26 Mar 2021 03:49 PM (IST)

    టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఔట్

    టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (66/79) ఔటయ్యాడు. అదిల్‌ రషీద్‌ వేసిన 32వ ఓవర్‌ చివరి బంతికి కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో టీమిండియా 158 పరుగుల వద్ద మూడో వికెట్‌ కోల్పోయింది. క్రీజులోకి రిషభ్‌ పంత్‌ వచ్చాడు.

  • 26 Mar 2021 03:39 PM (IST)

    రాహుల్ హాఫ్ సెంచరీ

    కేఎల్ రాహుల్‌ కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు .

  • 26 Mar 2021 03:36 PM (IST)

    విరాట్ మరో హాఫ్ సెంచరీ..

    టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ 62 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు.  మోయిన్‌ అలీ వేసిన 27వ ఓవర్‌లో కోహ్లీ మూడు సింగిల్స్‌ తీయగా రాహుల్‌(44) రెండు పరుగులు చేశాడు. దీంతో కోహ్లీ తన ఖాతాలో మరో హాఫ్‌ సెంచరీ నమోదు చేసుకున్నాడు.

  • 26 Mar 2021 03:33 PM (IST)

    రాహుల్ బౌండరీ

    అదిల్‌ రషీద్‌ వేసిన ఈ ఓవర్‌లో టీమిండియా 9 పరుగులు సాధించింది. తొలి ఐదు బంతులకు సింగిల్స్‌ రాగా చివరి బంతిని రాహుల్‌ (42) బౌండరీగా మార్చాడు. మరోవైపు కోహ్లీ(47) అర్ధశతకానికి దగ్గరగా ఉన్నాడు.

  • 26 Mar 2021 02:59 PM (IST)

    18 ఓవర్లకు భారత్ స్కోరు‌ 77/2 పరుగులు

    18 ఓవర్లకు భారత్ స్కోరు‌ 77/2..  టామ్‌కరన్‌ వేసిన 18వ ఓవర్‌లో  టీమిండియా రెండు పరుగులే చేసింది. కెప్టెన్‌ కోహ్లీ(28), రాహుల్‌(17) చెరో సింగిల్‌ తీశారు. వీరిద్దరూ 40 పరుగుల భాగస్వామ్యంతో  ఉన్నారు.

  • 26 Mar 2021 02:47 PM (IST)

    రోహిత్‌ శర్మ ఔట్..

    టీమిండియా రెండో వికెట్‌ కోల్పోయింది. సామ్‌కరన్‌ వేసిన తొమ్మిదో ఓవర్‌ నాలుగో బంతికి రోహిత్‌ శర్మ(25) ఔటయ్యాడు. షార్ట్‌బ్యాక్‌వర్డ్‌ స్క్వేర్‌ లెగ్‌లో అదిల్‌ రషీద్‌ చేతికి దొరికిపోయాడు. దీంతో టీమిండియా  37 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది. మరోవైపు కోహ్లీ(7) పరుగులతో బ్యాటింగ్‌ చేస్తున్నాడు. క్రీజులోకి కేఎల్‌ రాహుల్‌ కొనసాగుతున్నాడు.

Published On - Mar 26,2021 9:29 PM

Follow us