KL Rahul’s Celebration: కేఆల్ రాహుల్ సూపర్ సెంచరీ.. ఈ అభివాదం వెనుక కారణమిదే..!

సెంచరీ చేసినప్పుడు ఒక్కో ఆటగాడు ఒక్కో విధంగా అభివాదం చేస్తాడు. కానీ, టీమిండియా బ్యాట్స్​మెన్​ కేఎల్​ రాహుల్​ మాత్రం మిగతా వారికి భిన్నం. మూడంకెల స్కోరు అనంతరం రెండు చేతులతో చెవులు మూసుకుని..

KL Rahul's Celebration: కేఆల్ రాహుల్ సూపర్ సెంచరీ.. ఈ అభివాదం వెనుక కారణమిదే..!
Rahul Kl
Follow us
Sanjay Kasula

|

Updated on: Mar 27, 2021 | 1:59 AM

బ్యాట్స్​మెన్​ తన “హాఫ్ సెంచరీ.. సెంచరీ” ప్రత్యేక సందర్భమే. సెంచరీ చేసినప్పుడు ఒక్కో ఆటగాడు ఒక్కో విధంగా అభివాదం చేస్తాడు. చాలామంది బ్యాటును పైకి లేపి వందనం చేస్తారు. కొందరు పైకి ఎగిరి పంచ్‌ ఇస్తారు. టీమిండియా ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ వీరందరికీ కొంత డిఫరెంట్‌గా వేడుకలు చేసుకుంటాడు. మూడంకెల స్కోరు అనంతరం హెల్మెట్‌ తీసి బ్యాటు కిందపెట్టి రెండు చేతులతో చెవులను మూసుకుంటాడు. అయితే అతడిలా చేయడం వెనుక గల కారణాన్ని చెప్పేశాడు. అయితే ఇంగ్లాండ్‌తో రెండో వన్డేలో రాహుల్‌ సెంచరీతో చెలరేగిపోయాడు.

114 బంతుల్లో 108 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ ముందు 337 పరుగుల భారీ టార్గెట్ పెట్టడంలో పూర్తి స్థాయిలో కీలక పాత్ర పోషించాడు రాహుల్. ఫోర్లు, సిక్సర్లతో అలరించాడు. టీమిండియా ఇన్నింగ్స్‌ ముగిశాక ఆ సెంచరీ సంబరాల వెనుక అర్థమేంటని క్రికెట్‌ ప్రజెంటర్  మురళీ కార్తీక్ అడిగిన  ప్రశ్నకు రాహుల్ వివరించాడు.

బయటి రణగొణ ధ్వనులను ఆపేందుకే ఈ సంబరాలు. ఎవరినీ అవమానించేందుకు మాత్రం కాదు. మనల్ని వెనక్కి లాగే చాలామంది బయట ఉంటారు. అన్నిసార్లూ వారిని పట్టించుకోకూడదంటూ చెప్పుకొచ్చాడు రాహుల్. నా సంబరాల సందేశం అదే అని రాహుల్‌ తెలిపాడు. టీ20 సిరీస్‌ తర్వాత నేను నిరాశపడ్డాను. కానీ ఆట అలాగే సాగుతుందని చెప్పాడు. కొన్ని నాణ్యమైన షాట్లు నా ఆందోళనను తొలగించాయి. విరాట్‌, రిషభ్‌తో మంచి భాగస్వామ్యాలు నెలకొల్పినందుకు సంతోషంగా ఉంది అని అన్నాడు. నేను, విరాట్‌ బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు 300 పరుగులు చేయాలనుకున్నాం. అయితే భారీ స్కోరు చేయడం సంతోషాన్నిచ్చింది. ఈ రోజు వాతావరణం చాలా వేడిగా ఉంది. కానీ మేం భాగస్వామ్యాలు నిర్మించడం ముఖ్యం. అందుకే ఈ స్కోరు నాకు ఆనందం కలిగిస్తోంది. పరుగులు చేస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మనం చేయాల్సిందీ అదే అంటూ రాహుల్‌ వివరించాడు.

విమర్శలు ఎదురైనప్పుడు ఆటగాళ్లు సరికొత్తగా స్పందిస్తుంటారు. 2018లో అడిలైడ్‌లో విఫలమైనప్పుడు విరాట్‌పై విమర్శల వర్షం కురిసింది. పెర్త్‌లో సెంచరీ కొట్టగానే.. తనదైన తరహాలో వారి విమర్శలను తిప్పికొట్టాడు. విరాట్ బ్యాటు ‘స్వీట్‌ స్పాట్‌’లో పంచ్‌ ఇచ్చి తన బ్యాటే మాట్లాడుతుందని చెప్పాడు. 2001లో ఆస్ట్రేలియా సిరీస్‌ సందర్భంగానూ రాహుల్‌ ద్రవిడ్‌ ఇలాగే చేశాడు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ద్రావిడ్… ఈడెన్‌ గార్డెన్‌ ప్రెస్‌బాక్స్‌ వైపు తన హెల్మెట్‌ను ఆవేశంతో చూపించాడు.

IPL 2021: ఈ నలుగురు ఆటగాళ్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టులో చోటు దక్కదట.. వారెవరంటే?