AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎవర్రా మీరంతా.. మీరు, మీ ఆట తగలెయ్యా.. ఏరికోరి తెస్తే.. ఫ్రాంచైజీలకే వెన్నుపోటు పోడిచిన నలుగురు..

IPL 2026 Captains Poor Performance: ఐపీఎల్ లాంటి హై-ప్రెజర్ టోర్నమెంట్‌లో కెప్టెన్ అనేవాడు ముందుండి జట్టును నడిపించాలి. కానీ ఈ నలుగురు ఆటగాళ్లు అటు బ్యాటింగ్‌లో రాణించలేక, ఇటు సరైన వ్యూహాలు రచించలేక జట్టుకు భారంగా మారారు. రాబోయే 2027 మెగా వేలానికి ముందే ఈ ఫ్రాంచైజీలన్నీ తమ నాయకత్వ మార్పులపై కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

ఎవర్రా మీరంతా.. మీరు, మీ ఆట తగలెయ్యా.. ఏరికోరి తెస్తే.. ఫ్రాంచైజీలకే వెన్నుపోటు పోడిచిన నలుగురు..
Csk Ipl 2026 Playoff Scenarios
Venkata Chari
|

Updated on: May 19, 2026 | 4:39 PM

Share

IPL 2026 Captains Poor Performance: క్రికెట్ ప్రపంచంలో ఐపీఎల్ ఇచ్చే మజానే వేరు. ఇక్కడ గెలిస్తే బ్రహ్మరథం పడతారు, ఓడితే అంతే వేగంగా పాతాళానికి నెట్టేస్తారు. ప్రస్తుత ఐపీఎల్ 2026 సీజన్‌లో కొందరు కెప్టెన్లు తమ వ్యూహాలతో, పేలవమైన ఆటతీరుతో సొంత జట్లకే పెద్ద శాపంగా మారారు. ఆ ఫ్రాంచైజీల కొంపముంచిన ఆ నలుగురు కెప్టెన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.

రూ.27 కోట్ల భారంగా మారిన రిషభ్ పంత్..!

లక్నో సూపర్ జయంట్స్ జట్టు మెగా వేలంలో రికార్డు స్థాయిలో దాదాపు రూ.27 కోట్లు వెచ్చించి రిషభ్ పంత్‌ను దక్కించుకోవడమే కాకుండా సారథ్య బాధ్యతలు కూడా అప్పగించింది. అయితే, పంత్ ఆ నమ్మకాన్ని పూర్తిగా వమ్ము చేశాడు. ఈ సీజన్‌లో లక్నో జట్టు ప్లేఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా తప్పుకున్న మొదటి జట్టుగా నిలిచింది. పంత్ బ్యాటింగ్‌లోనూ ఘోరంగా విఫలమయ్యాడు. 11 మ్యాచ్‌ల్లో కేవలం 251 పరుగులు మాత్రమే చేశాడు, అది కూడా 138 స్వల్ప స్ట్రైక్ రేట్‌తో. మైదానంలో పంత్ తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, విచిత్రమైన బ్యాటింగ్ ఆర్డర్ మార్పులు లక్నో యాజమాన్యాన్ని, యజమాని సంజీవ్ గోయెంకాను తీవ్ర అసంతృప్తికి గురిచేశాయి. వచ్చే ఏడాది అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.

ఇది కూడా చదవండి: CSK vs SRH IPL 2026 Result: కీలక పోరులో ఓడిన చెన్నై.. ప్లేఆఫ్స్ చేరిన హైదరాబాద్, గుజరాత్

ఇవి కూడా చదవండి

ఢిల్లీ క్యాపిటల్స్ కొంపముంచిన అక్షర్ పటేల్ నిర్ణయాలు..

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు నాయకత్వం వహించిన అక్షర్ పటేల్, అటు ఆటగాడిగా ఇటు కెప్టెన్‌గా పూర్తిగా చేతులెత్తేశాడు. టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు వస్తున్నప్పటికీ, 9 ఇన్నింగ్స్‌లలో కేవలం 100 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇక బౌలింగ్‌లోనూ కెప్టెన్‌గా తనను తాను తక్కువగా వాడుకుంటూ, 12 మ్యాచ్‌ల్లో కేవలం 36 ఓవర్లు మాత్రమే వేశాడు. అభిషేక్ పోరెల్ లాంటి ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లను పక్కన పెట్టడం, కీలక సమయాల్లో ఒత్తిడిని అధిగమించలేకపోవడంతో ఢిల్లీ ప్లేఆఫ్స్ ఆశలు దాదాపు గల్లంతయ్యాయి. వచ్చే సీజన్ నుంచి ఢిల్లీ జట్టు యాజమాన్య బాధ్యతలు మారనుండటంతో అక్షర్‌ను సారథిగా తొలగించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి.

కేకేఆర్ ‘తాత్కాలిక’ తలనొప్పి.. అజింక్య రహానే..

కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టుకు సరైన ప్రత్యామ్నాయం లేకపోవడంతో 37 ఏళ్ల వెటరన్ ఆటగాడు అజింక్య రహానేకు కెప్టెన్సీ అప్పగించారు. అయితే ఆధునిక టీ20 క్రికెట్ వేగాన్ని అందుకోవడంలో రహానే పూర్తిగా విఫలమయ్యాడు. కేవలం 133 స్ట్రైక్ రేట్‌తో 237 పరుగులు మాత్రమే చేసిన రహానే, పవర్‌ప్లే ఓవర్లలో జట్టుపై తీవ్ర ఒత్తిడి పెంచాడు. తన నెమ్మదైన ఆటతీరును విమర్శించిన వారిని ‘అసూయపరులు’ అంటూ రహానే కొట్టిపారేసినప్పటికీ, అతడి ఫామ్ కేకేఆర్ జట్టుకు పెద్ద మైనస్‌గా మారింది. రాబోయే మినీ వేలంలో అతడిని కెప్టెన్సీ నుంచే కాకుండా, అసలు జట్టు నుండి కూడా కేకేఆర్ విడుదల చేసే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: MS Dhoni: ఫైనల్ మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి ధోని.. వీడ్కోలుకు సిద్ధమైన ఫ్యాన్స్..?

ముంబైని ముంచేసిన హార్దిక్ పాండ్యా ప్లాప్ షో..

ఐదుసార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా తప్పుకోవడానికి హార్దిక్ పాండ్యా పేలవ ఫామ్ ఒక ముఖ్య కారణం. గతేడాది లాగే ఈసారి కూడా హార్దిక్ అటు బ్యాట్‌తో, ఇటు బాల్‌తో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. ముంబై ప్రధాన కోచ్ మహేల జయవర్ధనే సైతం హార్దిక్, సూర్యకుమార్ లాంటి సీనియర్ల వైఫల్యం జట్టును తీవ్రంగా దెబ్బతీసిందని బహిరంగంగానే అంగీకరించాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లకు, కెప్టెన్‌కు మధ్య విభేదాలు ఉన్నాయనే వార్తలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us