AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jayaprada : 35 ఏళ్లు ఆ హీరోతో మాట్లాడలేదు.. కారణం ఇదే.. హీరోయిన్ జయప్రద కామెంట్స్..

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒకప్పుడు టాప్ హీరోయిన్ జయప్రద. సీనియర్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుని తనదైన ముద్ర వేసింది. తక్కువ సమయంలోనే ఎంతో మంది అభిమానుల హృదయాలను గెలుచుకుంది. కథానాయికగా, సహాయ నటిగా ఓ వెలుగు వెలిగిన ఆమె ఇప్పుడు రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Jayaprada : 35 ఏళ్లు ఆ హీరోతో మాట్లాడలేదు.. కారణం ఇదే.. హీరోయిన్ జయప్రద కామెంట్స్..
Jaya Prada
Rajitha Chanti
|

Updated on: May 19, 2026 | 5:24 PM

Share

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన సీనియర్ నటి జయప్రద. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘నటకిరీటి’ రాజేంద్ర ప్రసాద్‌తో తనకున్న అనుబంధం, వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇంటర్వ్యూలో జయప్రద మాట్లాడుతూ, సినిమా సెట్స్‌లో దర్శకుడి పాత్ర ఎంత కీలకమో వివరించారు. దర్శకుడు సీనియర్ అయినా, జూనియర్ అయినా సరే.. ఒక నటిగా వారి సూచనలను పాటించడం తన బాధ్యతని పేర్కొన్నారు. కథను నమ్మి, దర్శకుడు చెప్పిన ఇన్‌స్ట్రక్షన్స్‌ని సమయానికి ఫాలో అవ్వడమే ఒక మంచి నటుడి లక్షణమని ఆమె స్పష్టం చేశారు. రాజేంద్ర ప్రసాద్‌తో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ గురించి అడిగినప్పుడు ఆమె ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఆయనతో కలిసి నటించడం ఎప్పుడూ ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుందని చెప్పారు. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. కాగా, దాదాపు 36 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత వీరిద్దరి కలిసి నటించారు. దర్శకుడు వి.ఎన్. ఆదిత్య తెరకెక్కించిన ‘లవ్ ఎట్ 65’ (Love at 65) చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, జయప్రద ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు.

ఎక్కువ మంది చదివినవి : Murali Mohan: ఆరోజు బాలకృష్ణ చేసిన పని ఇప్పటికీ మర్చిపోలేను.. ఉదయాన్నే 5 గంటల వరకే.. మురళిమోహన్ కామెంట్స్..

మారిన ట్రెండ్‌కు అనుగుణంగా వైవిధ్యమైన కథాంశాలతో వచ్చే సినిమాల్లో నటించడం తనకు ఎనర్జీని ఇస్తుందని జయప్రద తెలిపారు. సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది లెజెండరీ నటులు, దర్శకులతో పనిచేసిన అనుభవం తన జీవితకాల జ్ఞాపకమని, ప్రతి సినిమా సెట్ నుండి ఏదోకటి నేర్చుకుంటూనే ఉంటానని ఆమె ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. జయప్రద అసలు పేరు లలితా రాణి. ఆమె పుట్టింది ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో. క్లాసికల్ డాన్సర్‌గా ఉన్న ఆమె ప్రతిభను చూసి, దర్శకుడు కె. ప్రత్యగాత్మ ‘భూమి కోసం’ (1974) సినిమాలో కేవలం మూడు నిమిషాల డాన్స్ బిట్ కోసం ఆమెను ఎంపిక చేశారు. ఆ పాత్రకు ఆమెకు లభించిన పారితోషికం కేవలం 10 రూపాయలు.

ఎక్కువ మంది చదివినవి : Trisha : ఆ హీరోను చూసి చాలా గిల్టీగా ఫీలయ్యా.. అతడంటే చాలా ఇష్టం.. హీరోయిన్ త్రిష కామెంట్స్..

కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘సిరి సిరి మువ్వ’ (1976) సినిమా ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. ఇందులో మూగపిల్లగా ఆమె పండించిన హావభావాలు, నృత్యం అద్భుతం. ఆ తర్వాత వచ్చిన ‘శంకరాభరణం’ (1980), ‘సాగరసంగమం’ (1983) చిత్రాలు ఆమెను తెలుగు సినిమా చరిత్రలో అజరామరంగా నిలిపాయి. ‘సర్గమ్’ (సిరి సిరి మువ్వ హిందీ రీమేక్) సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఆమె, అక్కడ కూడా టాప్ హీరోయిన్‌గా ఎదిగారు. అమితాబ్ బచ్చన్, జితేంద్ర, రాజేష్ ఖన్నా, శతృఘ్న సిన్హా వంటి స్టార్ హీరోల సరసన నటించి ‘నెంబర్ వన్’ స్థానాన్ని దక్కించుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Kajal : నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు.. హీరోయిన్ కాజల్..

Follow Us