AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sridevi: టీమిండియా క్రికెటర్‌తో కోర్టు హీరోయిన్ ప్రేమాయణం! అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు

గతేడాది వచ్చిన కోర్ట్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది శ్రీదేవి అప్పాల. అంతుకు ముందు సోషల్ మీడియా రీల్స్ తో బాగా ఫేమస్ అయిన ఆమె ఈ సినిమాలో తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో యూత్ ను కట్టిపడేసింది.

Sridevi: టీమిండియా క్రికెటర్‌తో కోర్టు హీరోయిన్ ప్రేమాయణం! అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు
Actress Sridevi Appala
Basha Shek
|

Updated on: May 19, 2026 | 5:07 PM

Share

కోర్టు సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది యంగ్ హీరోయిన్ శ్రీదేవి అప్పాల. ఇందులో జాబిలి పాత్రలో ఆమె అందం, అభినయానికి అందరూ ఫిదా అయ్యారు. ముఖ్యంగా శ్రీదేవి క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ కు యూత్ పడిపోయారు. సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఏకంగా రూ. 50 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టడంతో శ్రీదేవి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అందుకు తగ్గట్టుగానే ఇటీవలే బ్యాండ్ మేళం అంటూ మరో యూత్ ఫుల్ లవ్ స్టోరీతో మన ముందుకొచ్చిందీ అందాల తార. ఇందులోనూ కోర్టు మూవీ హీరో హర్ష్ రోషన్ తోనే కలిసి స్క్రీన్‌ షేర్ చేసుకుందీ అందాల తార. అయితే ఈ సినిమా పెద్దగా ఆడలేదు. కానీ శ్రీదేవికి మాత్రం మంచి పేరు తీసుకొచ్చింది. ఇప్పుడీ అందాల తార తెలుగుతో పాటు తమిళ, మలయాళ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది. అందులో ‘హైకు’అనే ఓ క్రేజీ ప్రాజెక్టు కూడా ఉంది. తమిళ, మలయాళ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో హీరోగా ఏగన్ నటిస్తున్నాడు. అలాగే , ‘మిన్నల్ మురళి’ ఫేమ్ ఫెమినా జార్జ్ మరో కీలక పాత్రలో కనిపించనుంది. . విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై డాక్టర్ అరుళనందు, మాథ్యో అరుళనందు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి

సినిమాల సంగతి పక్కన పెడితే తన వ్యక్తిగత జీవితంతోనూ వార్తల్లో నిలుస్తోంది శ్రీదేవి. గతంలో తనతో కలిసి నటించిన హర్ష్ రోషన్ తో ప్రేమలో ఉందని ప్రచారం జరిగింది. అయితే అవన్నీ పుకార్లనని కొట్టి పారేసింది శ్రీదేవి. ఇప్పుడు ఓ టీమిండియా యంగ్ క్రికెటర్ తో శ్రీదేవి ప్రేమలో ఉందంటూ కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఐపీఎల్ లో అదరగొడుతోన్న ఓ యంగ్ సెన్సేషన్ తో శ్రీదేవి పేరును ముడిపెడుతూ కొన్ని పోస్టులు నెట్టింట వైరలవుతున్నాయి.  అయితే ఇవన్నీ వట్టి రూమర్లేనని తెలుస్తోంది. కొందరు నెటిజన్లు కావాలని ఈ రూమర్స్ ను క్రియేట్ చేశారని తెలుస్తోంది.

కోర్ట్ హీరోయిన్ శ్రీదేవి అప్పాల లేటెస్ట్ ఫొటోస్..

View this post on Instagram

A post shared by Jabili 🌝 (@srideviactor)

ట్రెడిషినల్ లుక్ లో శ్రీదేవి..

View this post on Instagram

A post shared by Jabili 🌝 (@srideviactor)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!