Virat Kohli New Record: రన్ మెషీన్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డ్.. విరాట్ పరుగులు దాహం అలాంటిది మరి..
భారత కెప్టెన్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ వన్డేల్లో మరో క్రేజీ రికార్డు సొంతం చేసుకున్నాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో హాఫ్ సెంచరీతో అదరగొట్టిన విరాట్..
భారత కెప్టెన్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ వన్డేల్లో మరో క్రేజీ రికార్డు సొంతం చేసుకున్నాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో హాఫ్ సెంచరీతో అదరగొట్టిన విరాట్.. మూడో స్థానంలో పది వేల పరుగులు పూర్తి చేసిన జాబితాలో సెకండ్ ప్లేసులో నిలిచాడు. 190 ఇన్నింగ్స్‌ల్లో కోహ్లీ ఈ ఫీట్ అందుకున్నాడు.
ఈ లిస్ట్‌లో ఫస్ట్ ప్లేసులో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఉన్నాడు. 330 ఇన్నింగ్స్‌ల్లో 12,662 రన్స్‌తో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు పాంటింగ్. శ్రీలంక బ్యాట్స్‌మెన్ కుమార సంగక్కర 238 ఇన్నింగ్స్‌ల్లో 9,747 పరుగులతో కోహ్లీ తర్వాతి స్థానంలో ఉన్నాడు. దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ జాక్వెస్ కలిస్ 7,774 పరుగులతో నాలుగో స్థానంలో నిలిచాడు.
పుణె వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత టీమ్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 336 రన్స్ చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇండియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. గత మ్యాచ్‌లో రాణించిన ఓపెనర్ ధావన్.. స్కోరు బోర్డులో 9 పరుగుల వద్దే పెవిలియన్ చేరాడు. మరికాసేపటికే హిట్ మ్యాన్ రోహిత్ శర్మ(25 బంతుల్లో 25) అవుటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రాహుల్(108).. కెప్టెన్ విరాట్ కోహ్లీ(66)కి జాగ్రత్తగా ఆడుతూ.. చెత్త బంతుల్ని పెవిలియన్‌కు పంపారు. మూడో వికెట్‌కు ఈ జోడీ 121 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ చేసిన విరాట్.. ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. విరాట్ ఔటయ్యాక బ్యాటింగ్‌కు దిగిన రిషభ్ పంత్.. అప్పటికే దంచికొడుతున్న రాహుల్‌కు చేయి అందించాడు. ఈ క్రమంలో నాలుగో వికెట్‌కు ఈ జంట 77 బంతుల్లోనే 113 పరుగులు జోడించింది. ఈ క్రమంలో కెరీర్లో 5వ వన్డే సెంచరీ చేశాడు రాహుల్. కొద్ది సేపటికే టామ్ కరన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. రిషభ్ పంత్ మెరుపులు మెరిపించాడు. హాఫ్ సెంచరీ చేసేందుకు కేవలం 28 బంతులే తీసుకున్న పంత్.. మొత్తంగా 40 బంతుల్లో 77 రన్స్ చేశాడు. తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్య(35; 16 బంతుల్లో) కూడా తన మార్క్ ఎండింగ్ ఇచ్చాడు.
Also Read: చేపను కొనుగోలు చేసిన వ్యక్తి.. దాన్ని కటింగ్ చేయిస్తుండగా కడుపులో షాకింగ్ దృశ్యం
నిరుద్యోగ భృతిపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్ క్లారిటీ.. సూటిగా తేల్చి చెప్పేశారు