Viral News: చేపను కొనుగోలు చేసిన వ్యక్తి.. దాన్ని కటింగ్ చేయిస్తుండగా కడుపులో షాకింగ్ దృశ్యం
చేపను కొనుగోలు చేసిన వ్యక్తి.. దాన్ని కొనుగోలు చేసి.. కటింగ్ చేయిస్తుండగా కడుపులో షాకింగ్ దృశ్యం కనిపించింది.
ప్లాస్టిక్‌ను వినియోగించకండి. అటు ప్రభుత్వాలతో పాటు పర్యావరణవేత్తలు పదే, పదే చెబుతున్న మాట. ఈ ధోరణి ఇలానే కొనసాగిస్తే భవిష్యత్ తరాలు ప్రమాదంలో పడతాయి. ఇప్పుడు కొంతవరకు నయమే కానీ పూర్తిగా ప్లాస్టిక్‌ను పక్కకుపెట్టలేకపోతున్నారు జనాలు. ఇప్పటికే ఈ ప్లాస్టిక్ జీవజాతుల పాలిట మృత్యుశకటంగా మారింది. తాజాగా కర్ణాటకలోని ఫిష్ మార్కెట్లో చేపను కొనుగోలు చేసిన వ్యక్తి.. దాన్ని కోయిస్తుండగా విచిత్ర అనుభవాన్ని ఫేస్ చేశాడు. చేప కడుపు లోపల భారీ ప్లాస్టిక్ కవర్లు దర్శనమిచ్చాయి. అంత భారీ మొత్తంలో ప్లాస్టిక్ కనిపించడంతో అందరూ షాకయ్యారు.. అత్తావర్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన తాలుకా వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతుంది. చేప కడుపులో ప్లాస్టిక్ కవరును చూసి కంగుతిన్న స్థానికులు దాన్ని వీడియో తీశారు.
“మేము దీనిని మొదటిసారిగా గమనిస్తున్నాము. ప్రజలు ఈ స్థాయిలో ప్లాస్టిక్‌ను సముద్రంలోకి పోయడం కొనసాగిస్తే, చేపల పెంపకం తీవ్రంగా ప్రభావితమవుతుంది” అని పేరు చెప్పడానికి ఇష్టపడని చేపల షాపు యజమాని ఒకరు చెప్పారు. “ప్లాస్టిక్ తినకూడదని మనం చేపలకు చెప్పలేం, కాని వ్యర్థాలను సముద్ర జలాల్లోకి డంప్ చేయకుండా ఆపగలం” అని ఓషన్ ప్లాస్టిక్ రీసైక్లింగ్ సమన్వయకర్త నాజీరాజ్ రాఘవ్ అంచన్ పేర్కొన్నారు.
చెరువులు, సముద్రాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను పడేయడం వల్ల వాటిని ఆహారంగా భావించి చేపలు తినేస్తున్నాయని పర్యావరణవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల చేపలకే కాకుండా.. వాటిని తినే మనుషులకు కూడా ప్రమాదమేనని వార్నింగ్ ఇస్తున్నారు.
Also Read: ఆంధ్రప్రదేశ్‌లో ఒంటి పూట బడులు, వేసవి సెలవులు… పూర్తి షెడ్యూల్ ఇదే…
Ram Charan-RRR Update: రామరాజు లుక్ ని రిలీజ్ చేసిన చిత్ర యూనిట్.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్
ఎక్కడా కనని కొట్లాట, సాక్షాత్తూ పంచాయతీలోనే, ‘సర్పంచ్ – ఉప సర్పంచ్’ పిడిగుద్దులు, ముష్టి ఘాతాలు