AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏనుగును వెంబడించిన టూరిస్ట్‌లకు షాక్.. ఒక్కసారిగా హడలిపోయారు.. నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో..

Angry Elephant Viral Video : శ్రీలంకలోని ఓ జాతీయ ఉద్యానవనంలో పర్యటకులకు చేదు అనుభవం ఎదురైంది. కోపంగా ఉన్న ఏనుగు వారి వాహనాన్ని వెంబడించి

ఏనుగును వెంబడించిన టూరిస్ట్‌లకు షాక్.. ఒక్కసారిగా హడలిపోయారు.. నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో..
Couples Five Things5
uppula Raju
|

Updated on: Mar 26, 2021 | 1:28 PM

Share

Angry Elephant Viral Video : శ్రీలంకలోని ఓ జాతీయ ఉద్యానవనంలో టూరిస్ట్‌లకు చేదు అనుభవం ఎదురైంది. కోపంగా ఉన్న ఏనుగు వారి వాహనాన్ని వెంబడించి హడలెత్తించింది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్‌కు చెందిన సురేందర్ మెహ్రా ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను ట్వీట్ చేయగా ప్రస్తుతం ఇది నెట్టి్ంట్లో వైరల్ అవుతోంది. ఉద్యానవనంలో తమ వాహనంలో తిరగుతున్న టూరిస్ట్‌లు నడుచుకుంటు వెళుతున్న ఏనుగును వెంబడించారు. అయితే కొద్ది దూరం బాగానే వెళ్లినప్పటికీ ఒక్కసారిగా ఏనుగు వెనక్కి తిరిగింది. అంతేకాకుండా కోపంగా వాహనంవైపు దూసుకొచ్చింది.

దీంతో డ్రైవర్ వాహనాన్ని కొద్దిసేపటి వరకు రివర్స్ గేర్‌ వెనక్కి నడిపాడు. అలా నడుపుతూ దారి మళ్లించడంతో ఏనుగు మరోవైపునకు వెళ్లింది. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. వాహనంలో ఉన్న టూరిస్ట్‌లు ఊహించని ఘటనతో భయ బ్రాంతులకు గురయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరలో అవుతోంది. వీడియో చూసిన కొంతమంది జంతు ప్రేమికులు భిన్నంగా స్పందిస్తున్నారు. తన దారిన తను వెళుతుంటే వీళ్లే కావాలని దానిని రెచ్చగొట్టారని కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఇకనైనా జంతువుల దగ్గరికి వెళ్లే ముందు జాగ్రత్తగా ఉండాలని హెచ్చిరిస్తున్నారు.

Bharat Bandh Today Live: రైతుల ఆందోళనకు దేశవ్యాప్త మద్దతు.. కొనసాగుతోన్న భారత్ బంద్.. వాటికే అనుమతి.!

Viral Video: మొసలి, సొరచేపల పరుగు పందెం.. చివరికి ఎవరు గెలిచారో తెలుసా.?

Lasya Manjunath: కామెడీ టైమింగ్ తో నవ్వులు పూయించిన యాంకర్ లాస్య.. రవితో కలిసి స్టేజ్ పై..