Ram Charan-RRR Update: రామరాజు లుక్ ని రిలీజ్ చేసిన చిత్ర యూనిట్.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్

RRR New Poster: మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా రామ్ చరణ్ చిరుత సినిమాతో అడుగు పెట్టాడు.. రెండో సినిమా మగధీర తో తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు...

Ram Charan-RRR Update: రామరాజు లుక్ ని రిలీజ్ చేసిన చిత్ర యూనిట్.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్
మెగా పవర్​స్టార్ రామ్​ చరణ్​కు మొదటి సినిమా నుంచి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా వెండితెర అరంగేట్రం చేసినా.. మొదటి చిత్రం 'చిరుత'తోనే తానేంటో నిరూపించుకున్నారు.
Follow us
Surya Kala

| Edited By: Team Veegam

Updated on: Mar 26, 2021 | 5:12 PM

Ram Charan RRR New Look: మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా రామ్ చరణ్ చిరుత సినిమాతో అడుగు పెట్టాడు.. రెండో సినిమా మగధీర తో తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు. ధృవ, రంగస్థలం, ఎవడు వంటి డిఫరెంట్ సినిమాలతో చరణ్ తనకంటూ ఓ ఫేమ్ ను సృష్టించుకున్నాడు. ఈ నేపథ్యంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు సెలబ్రేషన్స్ ను మెగా ఫ్యాన్స్ ఓ రేంజ్ లో సెలబ్రేట్ చేస్తున్నారు. ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు చెప్పట్టారు. ఇక సోషల్ మీడియా లో కూడా చెర్రీ పోస్టులు సునామీ సృష్టిస్తున్నాయి. కాగా చరణ్ కొత్త సినిమా ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ ట్రీట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్ ట్విట్టర్ వేదికగా చెర్రీ లుక్ ను రిలీజ్ చేసింది. చరణ్ పుట్టిన రోజు కానుకగా మార్చి 26వ తేదీ శుక్రవారం సాయంత్రం 4 గంటలకు రామ రాజు లుక్ ని రిలీజ్ చేసింది. చరణ్ లుక్ ని చూసి అభిమానులు సంబర పడిపోతున్నారు.

దక్షిణాది మెగా మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ మూవీలో ఎన్టీఆర్ కొమరం భీం గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే కంప్లీట్ చేసుకుని ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ఫుల్ బిజీగా ఉంది. ప్రెస్టీజియస్ పాన్ ఇండియా అండ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘RRR- రౌద్రం రణం రుధిరం’..అజయ్ దేవ్‌గణ్, సముద్రఖని, ఒలీవియా మోరీస్, రే స్టీవెన్ సన్, అలిసన్ డూడీ తదితరులు నటిస్తున్నారు. దసరా కనుకాగా అక్టోబర్ 13న రిలీజ్ కానుంది.

మరో వైపు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. నిప్పుల మధ్య నుంచి దూకుతున్నట్లు కనిపించాడు. RRR ఆర్ఆర్ ఆర్ మూవీలో నిప్పుకు ప్రతీకగా చెర్రీని చూపించడంతో…మోషన్ పోస్టర్ లో కూడా…నిప్పునే మెయిన్ గా ఎంచుకున్నారు.

Also Read: మహేష్ బాబు రిజెక్ట్ చేస్తే.. ఆ సినిమా సూపర్ హిట్టేనా..? ఇప్పటి వరకూ ప్రిన్స్ వదులుకున్న హిట్ మూవీస్ ఏమిటో తెలుసా.?

కువైట్‌లో భారత రాయబారి కీలక ప్రకటన.. పది రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేత