Indian Ambassador: కువైట్‌లో భారత రాయబారి కీలక ప్రకటన.. పది రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేత
Indian Ambassador: కువైట్‌లోని భారత రాయబారి సిబి జార్జి కీలక ప్రకటన చేశారు. కరోనా నేపథ్యంలో ఎంబసీలో ప్రజా సేవలను పది రోజుల పాటు తాత్కాలికంగా...
Indian Ambassador: కువైట్‌లోని భారత రాయబారి సిబి జార్జి కీలక ప్రకటన చేశారు. కరోనా నేపథ్యంలో ఎంబసీలో ప్రజా సేవలను పది రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపారు. అత్యవసర సర్వీసులు మాత్రం అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. ఇండియన్ ఎంబసీలో ఏర్పాటు చేసిన వర్చువల్ ఓపెన్ హౌస్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కువైట్‌లోని భారతీయులందరూ కోవిడ్ వ్యాక్సిన్ కోసం తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోలని వారి కోసం ఎంబసీ ప్రాంగణంలో రెండు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కువైట్‌లోని భారతీయులందరూ కోవిడ్ వ్యాక్సిన్ కోసం తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలని ఆయన కోరారు.
స్వచ్చంద సంస్థలు, వలంటరీ బృందాలు దీనికి తోడ్పాటు అందించాలని కోరారు. తమ సంస్థలోని సభ్యులు వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకునే విధంగా ప్రోత్సహించాలని పేర్కొన్నారు. అంతేకాదు కువైట్‌లోని భారతీయ విద్యార్థుల పరీక్షలకు సంబంధించి కూడా ఆయన పలు అంశాలను వెల్లడించారు. జేఈఈతో పాటు నీట్, నాటా ఎంట్రన్స్ పరీక్షల కోసం కువైట్‌లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.10-12వ తరగతి విద్యార్థుల వార్షిక పరీక్ష నిర్వహణపై త్వరలో ఓ ప్రకటన చేసినట్లు చెప్పారు. విద్యార్థులు విద్యాసంవత్సరాన్ని కోల్పోకుండా చూస్తామని అన్నారు. సీబీఎస్‌ఈ, కువైట్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు.