Coronavirus: వామ్మో.. అక్కడ ఒక్క రోజే లక్ష కరోనా పాజిటివ్‌ కేసులు.. 2,777 మరణాలు.. వణికిపోతున్న జనాలు

Coronavirus: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని మళ్లీ కుదిపేస్తోంది. గతంలో కేసుల సంఖ్య తగ్గిందనుకునే లోపే మళ్లీ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. కరోనా కట్టడికి ప్రపంచ

Coronavirus: వామ్మో.. అక్కడ ఒక్క రోజే లక్ష కరోనా పాజిటివ్‌ కేసులు.. 2,777 మరణాలు.. వణికిపోతున్న జనాలు
Coronavirus India
Follow us

|

Updated on: Mar 26, 2021 | 8:35 PM

Coronavirus: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని మళ్లీ కుదిపేస్తోంది. గతంలో కేసుల సంఖ్య తగ్గిందనుకునే లోపే మళ్లీ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. కరోనా కట్టడికి ప్రపంచ దేశాలు తీవ్రంగా శ్రమించి వ్యాక్సిన్‌లను అందుబాటులోకి తెచ్చినా.. ఇంకా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఒక వైపు కరోనా వ్యాక్సినేషన్‌.. మరోవైపు పాజిటివ్‌ కేసులు పెరుగుదల మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇక కరోనా వైరస్‌ బ్రెజల్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రతి రోజు అక్కడ రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదు అవుతుండటంతో అక్కడి అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది. గడిచిన 24 గంటల్లో 1,00,158 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 2,777 మంది మృతి చెందినట్లు బ్రెజిల్‌ ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఇక గత మంగళవారం రికార్డు స్థాయిలో3251 మంది కరోనాతో మృతి చెందగా, అక్కడ మరణాలు 3 లక్షల మార్కును దాటేసింది. కేవలం గత 75 రోజుల్లోనే లక్ష మంది కరోనా ధాటికి బలైనట్లు ఆ దేశ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి.

తాజా గణాంకాల ప్రకారం.. బ్రెజిల్‌లో ఇప్పటి వరకు 1,23,24,769 మంది కరోనా బారిన పడగా, వీరిలో 1,07,72,549 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. కొత్త కేసుల నేపథ్యంలో ఆ దేశాధ్యక్షుడు జైరో బోల్సొనారోపై ఒత్తిడి మరింత పెరిగింది. కోవిడ్‌తో ఒక్కరోజులో 3వేల మంది వరకు మరణిస్తున్నారు. ఇప్పటి వరకు 3 లక్షల మందికిపైగా మృత్యువాత పడ్డారు. కరోనా కేసులు, మరణాలు తీవ్ర స్థాయిలో పెరుగుతుండటంతో ఆ దేశ మాజీ అధ్యక్షుడు లూయిజ్‌ ఇనాసియో లులా డా సిల్వా ప్రస్తుతం అధ్యక్షుడు జైర్‌ బొల్సొనారోపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కోవిడ్‌ 19 నుంచి బ్రెజిల్‌ను కాపాడాలి. ఇంకా ఆ వ్యక్తి చేతిలోనే అధికారం ఉంటే బ్రెజిల్‌ ఏ మాత్రం తట్టుకోలేదు అంటూ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లులా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

బాధితుల కుటుంబాలకు అధ్యక్షుడు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. కాగా, బ్రెజిల్‌లో ఇప్పటి వరకు 1.23 మంది కరోనా బారిన పడ్డారు. 3,03,726 మంది మరణించారు. ఐదు లక్షలపైగా మరణాలతో అమెరికా మొదటి స్థానంలో ఉండగా, బ్రెజిల్‌ రెండో స్థానంలో ఉండటం మరింత ఆందోళనకు గురి చేస్తోంది. కాగా, కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ఇప్పటికే పలు రకాల కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఒక వైపు వ్యాక్సినేషన్‌ కొనసాగుతుండగా, మరోవైపు పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా సెకండ్‌వేవ్‌ కొనసాగుతోంది. దీంతో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని, లేకపోతే మరింత ముప్పువాటిల్లే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇవీ చదవండి: Corona Vaccine: విదేశాలకు కోవిషీల్డ్ టీకాల పంపిణీ నిలిపివేసిన భారత ప్రభుత్వం.. కారణం ఏంటంటే..

Corona Mask: కరోనా వైరస్‌ ఎఫెక్ట్‌… మాస్క్‌ లేకుండా బయట తిరుగుతున్నారా..? రూ. 250 జరిమానా కట్టాల్సిందే

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..