Corona Mask: కరోనా వైరస్ ఎఫెక్ట్… మాస్క్ లేకుండా బయట తిరుగుతున్నారా..? రూ. 250 జరిమానా కట్టాల్సిందే
Corona Mask: కరోనా మహమ్మారి మళ్లీ దేశ వ్యాప్తంగా విజృంభిస్తోంది. కేసుల సంఖ్య తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతుండటంతో ఆందోళన కలిగిస్తోంది. ఇక దేశవ్యాప్తంగా కరోనా కేసుల జాబితాలో
Corona Mask: కరోనా మహమ్మారి మళ్లీ దేశ వ్యాప్తంగా విజృంభిస్తోంది. కేసుల సంఖ్య తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతుండటంతో ఆందోళన కలిగిస్తోంది. ఇక దేశవ్యాప్తంగా కరోనా కేసుల జాబితాలో మొదటి స్థానం మహారాష్ట్ర ఉంది. అక్కడ తీవ్ర స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇక కర్ణాటకలో కూడా బాగానే వ్యాప్తి చెందుతోంది. దీంతో కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు కరోనా ఆంక్షలను కఠినతరం చేస్తోంది. నిత్యం కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరిన్ని ఆంక్షలు అమలు చేస్తోంది. మార్చి 24 నుంచి అక్కడ ఎవరైనా మాస్క్ లేకుండా బయటకు వస్తే రూ.250 జరిమానా విధిస్తున్నట్లు బెంగళూరు మహానగర పాలిక హెచ్చరించింది. అదే ఇతర మున్సిపల్ కార్పొరేషన్లలో రూ.100 జరిమానా విధించనున్నారు. అలాగే ఏసీ, నాన్ ఏసీ పంక్షన్ హాల్స్, డిపార్ట్‌మెంట్ స్టోర్స్‌లో మాస్క్ ధరించకుండా, సామాజిక దూరం పాటించకపోతే దాని యజమానిని బాధ్యుడిని చేస్తూ రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు జరిమానా విధించనున్నారు. పెళ్లిళ్లకు 200 మంది, పుట్టిన రోజు వేడుకకు 100 మంది, అంత్యక్రియలకు 100 మందికి మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
కాగా, ముంబైలో కూడా కరోనా ఆంక్షలు కఠినతరం చేస్తున్నారు. ముంబైలో మాస్క్ లేకుండా బయట తిరిగితే పోలీసులు జరిమానాలు విధిస్తున్నారు. అలా గత నెల రోజుల్లో 2 లక్షల మందికి జరిమానా విధించగా, రూ.4 కోట్లు వసూలైనట్లు అధికార వర్గాలు తెలిపాయి. ముంబైలో వివిధ ప్రాంతాల్లో మాస్క్ లేకుండా తిరిగే వ్యక్తుల నుంచి గత నెల రోజులుగా జరిమానా విధిస్తున్నామని, అలా 2 లక్షల మందికిపైగా జరిమానా విధించగా, రూ.4 కోట్ల వరకు వసూలైనట్లు ముంబై పోలీసు అధికారి డీసీసీఎస్ చైతన్య తెలిపారు. జరిమానా ద్వారా వసూలైన మొత్తం 50 శాతం బృహన్ ముంబాయి మున్సిపల్ కార్పొరేషన్‌కు వెళ్లనుంది. మిగిలిన మొత్తాన్ని పోలీసు సంక్షేమ నిధికి జమ చేయనున్నట్లు తెలిపారు.
ఇవీ చదవండి: Corona Vaccine: విదేశాలకు కోవిషీల్డ్ టీకాల పంపిణీ నిలిపివేసిన భారత ప్రభుత్వం.. కారణం ఏంటంటే..
India Coronavirus: దేశంలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.. నిన్న రికార్డు స్థాయిలో కేసుల నమోదు