India Coronavirus: దేశంలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.. నిన్న రికార్డు స్థాయిలో కేసుల నమోదు
Coronavirus India Updates: భారత్‌లో కరోనా మహమ్మారి కొరలు చాస్తోంది. గతంలో తగ్గినట్టే తగ్గిన కరోనా కేసులు నిత్యం వేలల్లో పెరుగుతుండటంతో అంతటా ఆందోళన నెలకొంది. బుధవారం కరోనా
Covid-19 India Updates: భారత్‌లో కరోనా మహమ్మారి కొరలు చాస్తోంది. గతంలో తగ్గినట్టే తగ్గిన కరోనా కేసులు నిత్యం వేలల్లో పెరుగుతుండటంతో అంతటా ఆందోళన నెలకొంది. బుధవారం కరోనా కేసుల సంఖ్య అరలక్ష మార్క్ దాటింది. ఐదు నెలల అనంతరం గరిష్ట స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 53,476 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 251 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ గురువారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. ఇప్పటివరకు 1,17,87,534 కరోనా కేసులు నమోదు కాగా.. 1,60,692 మంది ఈ మహమ్మారి కారణంగా మరణించారు.
కాగా గడిచిన 24గంటల్లో ఈ మహమ్మారి నుంచి 26,490 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి మొత్తం రికవరీల సంఖ్య 1,12,31,650 కి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,95,192 యాక్టివ్ కేసులున్నట్లు వైద్యశాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 95.28శాతం ఉండగా.. మరణాల రేటు 1.36శాతం ఉంది. గత 24గంటల్లో దేశవ్యాప్తంతగా 10,65,021 కరోనా నిర్థారణ పరీక్షలు చేశారు. వీటితో కలిపి ఇప్పటివరు 23,75,03,882 పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్స్ వెల్లడించింది. ఇదిలాఉంటే.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 5,31,45,709 మందికి టీకా అందించినట్లు భారత ప్రభుత్వం వెల్లడించింది.
కాగా, దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మరింత అప్రమత్తమవుతోంది. మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, పంజాబ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలో పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దీంతో పలు పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధించడంతోపాటు.. ఆంక్షలు అమలు చేస్తున్నారు.
Also Read: