SSC GD Notification 2021: ఎస్ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభం.. ఎలా అప్లయ్‌ చేసుకోవాలంటే..

SSC GD Notification 2021: స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC) కానిస్టేబుల్‌ (జనరల్‌ డ్యూటీ) దరఖాస్తు ప్రక్రియను గురువారం ప్రారంభించింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్స్‌, నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ, సెక్రటేరియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌,..

SSC GD Notification 2021: ఎస్ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభం.. ఎలా అప్లయ్‌ చేసుకోవాలంటే..
Ssc Gd
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 25, 2021 | 10:33 AM

SSC GD Notification 2021: స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC) కానిస్టేబుల్‌ (జనరల్‌ డ్యూటీ) దరఖాస్తు ప్రక్రియను గురువారం ప్రారంభించనున్నారు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్స్‌, నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ, సెక్రటేరియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌, రైఫిల్‌మెన్‌ ఇన్‌ అసోం రైఫిల్స్‌లో కానిస్టేబుళ్ల నియామకాలు చేపట్టనున్నారు. పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఈ పరీక్ష రాసేందుకు అర్హులు. ఆసక్తి, అర్హతలున్న అభ్యర్థులు ssc.nic.in అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులను సమర్పించడానికి మే 10ని చివరి తేదీగా నిర్ణయించారు. గతంలో నిర్వహించిన ఈ పరీక్షల్లో 60,000 ఖాళీలకు గాను 52,50,335 మంది దరఖాస్తు చేసుకోవడం విశేషం. కంప్యూటర్‌ ఆధారంగా జరిగే ఈ పరీక్షలను ఆగస్టు 2 నుంచి 25 వరకు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఎస్‌ఎస్‌సీ మాక్‌ టెస్ట్‌ను త్వరలోనే విడుదల చేయనుంది. ఈ కంప్యూటర్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారు తర్వాతి సెలక్షన్‌ ప్రక్రియకు ఎంపికవుతారు. అనంతరం వివిధ సెంటర్లలో భౌతిక పరీక్షలు నిర్వహిస్తారు. పదో తరగతి అర్హతతో నిర్వహించే ఈ పరీక్షకు 18 నుంచి 23 ఏళ్ల వయసు వారు అప్లయ్‌ చేసుకోవచ్చు. ఇక ఈ కంప్యూటర్‌ పరీక్షలో మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహించనున్నారు. జనరల్‌ ఇంటలిజెన్స్‌, రీజనింగ్‌, జనరల్‌ నాలెడ్జ్‌, జనరల్‌ అవర్‌నెస్‌, ఎలిమెంటరీ మాథమెటిక్స్‌, ఇంగ్లీష్‌ లేదా హిందీపై ప్రశ్నలు ఉంటాయి. ఈ పోస్టులకు అభ్యర్థులను.. కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌, వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జాబితాను ప్రకటిస్తారు.

Also Read: JEE Main 2021 Result: విడుదలైన జేఈఈ పరీక్షా ఫలితాలు.. ఆ ఘనత సాధించిన తొలి మహిళా అభ్యర్థిగా ఢిల్లీ యువతి..

HAL Recruitment 2021: హిందుస్తాన్ ఏరోనాటికల్‌లో భారీగా ఉద్యోగాలు.. ప్రారంభ జీతమే రూ. 40 వేలు.. మీరు దరఖాస్తు చేసుకున్నారా?

Bank of Maharashtra Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌… బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 150 ఉద్యోగాలు