HAL Recruitment 2021: హిందుస్తాన్ ఏరోనాటికల్‌లో భారీగా ఉద్యోగాలు.. ప్రారంభ జీతమే రూ. 40 వేలు.. మీరు దరఖాస్తు చేసుకున్నారా?
HAL Recruitment 2021: ఆసియాలోనే అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఏరోనాటికల్ కాంప్లెక్స్ అయిన హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్..
HAL Recruitment 2021: ఆసియాలోనే అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఏరోనాటికల్ కాంప్లెక్స్ అయిన హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) డిజైన్ అండ్ మేనేజ్‌మెంట్ ట్రైనీల నియామకం కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు HAL వెబ్‌సైట్- www.hal-india.co.in (కెరీర్స్ విభాగం) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. వెబ్‌సైట్ రిజిస్ట్రేషన్ కోసం మార్చి 20 నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు.
హిందూస్తాన్ ఏరోనాటిక్స్ శాఖలైన హైదరాబాద్ (తెలంగాణ) బెంగళూరు (కర్ణాటక), నాసిక్ (మహారాష్ట్ర), కోరాపుట్ (ఒరిస్సా), లక్నో, కాన్పూర్, కొర్వా (ఉత్తర ప్రదేశ్), బరాక్‌పూర్ (పశ్చిమ బెంగాల్), కాసరగోడ్ (కేరళ) లలో వివిధ ప్రొడక్షన్, ఓవర్‌హాల్ & సర్వీస్ డివిజన్లు / రీసెర్చ్ & డిజైన్ సెంటర్స్ / కార్యాలయాల్లో.. డిజైన్ ట్రైనీ / మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థులను ఆహ్వానిస్తోంది.
అర్హతలు.. హిందూస్తాన్ ఏరోనాటిక్స్ డిజైన్ ట్రైనీలు/మేనేజ్‌మెంట్ ట్రైనీస్ (టెక్నికల్) విభాగాల్లోని వివిధ పోస్టులకు అర్హతలు ఇలా ఉన్నాయి. ఇంజనీరింగ్ / టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ లేదా దానికి సమానంగా దేశంలో గుర్తింపు పొందిన ఏదేనీ ఇంజనీరింగ్ ఇన్‌స్టిట్యూషన్స్/విశ్వవిద్యాలయాల నుంచి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
మార్కుల శాతం.. డిజైన్ ట్రైనీ / మేనేజ్‌మెంట్ ట్రైనీ (టెక్నికల్) పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత సాధించడానికి అభ్యర్థులు కనీస శాతం మార్కులను కలిగి ఉండాలి. అలాగే అభ్యర్థులు ఇంజనీరింగ్ / టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ లేదా ఫైనల్ ఇయర్ / ఫైనల్ సెమిస్టర్‌లో ఉన్న వారు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, సదరు అభ్యర్థుల ఎంపిక.. డిగ్రీలో కనీసం అంటే నిర్దేశించిన మొత్తం మార్కుల శాతానికి లోబడే ఉంటుంది. ఇంటర్వ్యూ సమంలో అభ్యర్థులు తాము పొందిన మార్కుల శాతానికి సంబంధించి ధ్రువపత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.
పోస్టింగ్, జీతభత్యాలు.. పరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు కంపెనీ అవసరాలకు అనుగుణంగా ఎక్కడైనా పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉంది. వీరికి 52 వారాల పాటు శిక్షణ కూడా ఇస్తారు. శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం వారికి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక శిక్షణా కాలంలో ట్రైనీలకు ప్రాథమిక వేతనంతో కూడిన స్టైఫండ్‌ను రూ. 40,000 వరకు ఇస్తారు. అలాగే డీఏ, క్యాంటీన్ అలవెన్స్, కంపెనీ నిబంధనల ప్రకారం శిక్షణ సమయంలో బ్యాచిలర్ వసతి కూడా కల్పిస్తారు. ఇక శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న అభ్యర్థులకు గ్రేడ్-2 స్కేల్ ఆఫ్ పే లో భాగంగా ఇంజనీర్లుగా వారిగా పరిగణిస్తారు. ఆ సమయంలో వారికి శాలరీ రూ. 40,000 నుంచి రూ. 1,40,000 వరకు ఉంటుంది. ఇంకా టీఏ, డీఏ, హెచ్ఆర్, వంటి ఇతర సదుపాయాలు కూడా ఇస్తారు.
గమనిక: ఈ నియామకాలకు సంబంధించి ఇతర వివరాల కోసం HAL అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Also read: