JEE Main 2021 Result: విడుదలైన జేఈఈ పరీక్షా ఫలితాలు.. ఆ ఘనత సాధించిన తొలి మహిళా అభ్యర్థిగా ఢిల్లీ యువతి..

JEE Main 2021 Result: జేఈఈ మెయిన్స్‌ రెండో విడత ఫలితాలను బుధవారం విడుదల చేశారు. ఈ నెల 16,17,18 తేదీల్లో జేఈఈ మెయిన్స్ పేపర్‌-1 పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ నిర్వహించిన ఈ పరీక్షకు..

JEE Main 2021 Result: విడుదలైన జేఈఈ పరీక్షా ఫలితాలు.. ఆ ఘనత సాధించిన తొలి మహిళా అభ్యర్థిగా ఢిల్లీ యువతి..
Jee Main
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 25, 2021 | 9:42 AM

JEE Main 2021 Result: జేఈఈ మెయిన్స్‌ రెండో విడత ఫలితాలను బుధవారం విడుదల చేశారు. ఈ నెల 16,17,18 తేదీల్లో జేఈఈ మెయిన్స్ పేపర్‌-1 పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ నిర్వహించిన ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 6,19,000 మంది రిజిస్టర్‌ చేసుకోగా 5,90,000 మంది హాజరయ్యారు. 300 మార్కులకు పరీక్ష నిర్వహించగా 13 మంది 100 పర్సెంటైల్‌ స్కోర్‌ సాధించారు. ఇదిలా ఉంటే దేశంలో తొలిసారిగా ఒక ఏడాదిలో నాలుగుసార్లు ఈ పరీక్ష నిర్వహించాలని ఎన్‌టీఏ నిర్ణయించింది. ఏప్రిల్‌, మే నెలల్లో జరగబోయే పరీక్షల రిజిస్ర్టేషన్‌కు ఎన్‌టీఏ గురువారం నుంచి అవకాశం కల్పించనుంది.

Kavya Chopra

Kavya Chopra

తొలి మహిళా అభ్యర్థిగా రికార్డు..

తాజాగా విడుదల చేసిన జేఈఈ పరీక్షా ఫలితాల్లో ఢిల్లీకి చెందిన కావ్య చోప్రా రికార్డు సృష్టించింది. జేఈఈ మెయిన్స్‌ 2021లో 300 మార్కులకు 300 మార్కులు సాధించిన కావ్య.. వంద శాతం మార్కులు సాధించిన తొలి మహిళా అభ్యర్థిగా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇక కావ్య.. ఫిబ్రవరిలో జరిగిన పరీక్షలో 99.9 శాతం మార్కులు సాధించగా ఇప్పుడు ఏకంగా 100 శాతం దక్కించుకుంది. 100 శాతం సాధించడమే తన లక్ష్యమని చెప్పుకొచ్చిన కావ్య.. ఐఐటీ ఢిల్లీ లేదా ఐఐటీ ముంబయిలో కంప్యూటర్‌ సైన్స్‌ డిగ్రీ చేయాలనేది తన కోరిక అని చెబుతోంది. అంతేకాకుండా తనకు గణితం, కంప్యూటర్స్‌ సైన్స్‌ అంటే ఇష్టమని చెప్పుకొచ్చింది. వందశాతం మార్కులు సాధించడం పట్ల ఆనందం వ్యక్తం చేసిన కావ్య మాట్లాడుతూ.. ‘మా తల్లిదండ్రులు నన్ను, నా సోదరుడిని ఎప్పుడూ సమానంగానే చూశారు. అమ్మాయి అనే కారణంగా నేనెప్పుడూ వివక్షతను ఎదుర్కోలేదు. కానీ మన దేశంలో చాలా మంది అమ్మాయిలు సమాన అవకాశాలు పొందలేకపోతున్నారని నాకు తెలుసు’ అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇక కావ్య ఈ రికార్డును అంత సులభంగా సాధించలేదు. ఇందుకోసం రోజుకి ఏకంగా 7 నుంచి 8 గంటలు కష్టపడింది.

Also Read: HAL Recruitment 2021: హిందుస్తాన్ ఏరోనాటికల్‌లో భారీగా ఉద్యోగాలు.. ప్రారంభ జీతమే రూ. 40 వేలు.. మీరు దరఖాస్తు చేసుకున్నారా?

Bank of Maharashtra Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌… బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 150 ఉద్యోగాలు

Supernumerary Posts : పోలీస్ శాఖలో సూపర్ న్యూమరీ పోస్టులు.. ఎవరు అర్హులో తెలుసుకోండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే