DSC Notification: టీచర్ ఉద్యోగార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. త్వరలోనే డీఎస్సీ..

టీచర్ల భర్తీపై తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు డీఎస్సీపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని విద్యా శాఖ మంత్రి సభితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.

DSC Notification: టీచర్ ఉద్యోగార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. త్వరలోనే డీఎస్సీ..
Sabitha Indra Reddy
Follow us
Sanjay Kasula

|

Updated on: Mar 24, 2021 | 9:25 PM

టీచర్ల భర్తీపై తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు డీఎస్సీపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని విద్యా శాఖ మంత్రి సభితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. డీఎస్సీపై అసెంబ్లీలో ఓ ప్రకటన చేశారు. అయితే డీఎస్సీ అభ్యర్థుల్లో ఉన్న సందేహాన్ని కూడా తీర్చారు. డీఎస్సీని పాత పద్దతిలోనే నిర్వహిస్తామని మాత్రం క్లారిటీ ఇచ్చారు. టీచర్ పోస్టుల భర్తీ చేసే యోచనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నట్టు సభలో పేర్కొన్నారు. దేశంలోనే మొదటిసారి వర్క్ షీట్స్ పెట్టిన ఘనత తెలంగాణాకే దక్కుతుందని ఆమె అన్నారు.

కరోనాతో మళ్లీ స్కూళ్లకు సెలవులు ఇచ్చారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. అంతే ఆమో సోషల్‌ మీడియా అకౌంట్‌కు మేసేజీల మీద మేసేజ్‌లు వచ్చాయి. ఇంతకీ వాటిలో ఏముంది.  కరోనా వల్ల ఇంటర్ క్లాసులు డిజిటల్ ద్వారా అందించి.. 80 శాతం సిలబస్ పూర్తి చేశారు. రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీలకు, డిగ్రీ కాలేజీలకు కావాల్సినన్ని నిధులు ప్రభుత్వం ఇస్తోంది. యూనివర్సిటీ వైస్ ఛాన్సిలర్స్ నియామకం త్వరలోనే ఉంటుంది. విద్యాలయాల యజ్ఞానికి ప్రభుత్వం స్వీకారం చుట్టింది. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు బడ్జెట్‌లో 4 వేల కోట్లు ప్రత్యేక నిధులను కేటాయించారు.

దేశంలో మొదటిసారి వర్క్‌షీట్స్‌ పెట్టిన ఘనత తెలంగాణకె దక్కుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సభలో తెలిపారు. బుధవారం అసెంబ్లీ బడ్జె్‌ట్‌ సమావేశాల సందర్భంగా ఆమె సభలో ప్రసంగించారు. ఇప్పటికే టీ-సట్‌ యాప్‌ను 12లక్షల మంది విద్యార్థులు డౌలోడ్‌ చేసుకున్నారని.. 85శాతం డిజిటిల్‌ స్టడీ తెలంగాణలో విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తోందని అన్నారు. డిజిటల్‌ పాఠాలు పిల్లలకు అందించిన రాష్ట్రం దేశంలోనే మొట్టమొదటిదిగా పేర్కొన్నారు మంత్రి. హైదరాబాద్‌ నగరంలో వరదల్లో సర్టిఫికెట్స్‌ నష్టపోయిన విద్యార్థులకు మళ్ళీ కొత్త సర్టిఫికెట్లు జారీ చేసేవిధంగా కూడా చూశామన్నారు.

కరోనా ప్రభావం ఇంకా రాష్ట్రంలో కొనసాగుతుందని.. కరోనా వల్ల విద్యార్థుల చదువుకు ఇబ్బందులు కాకుండా డిజిటిల్‌ తరగలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. తెలంగాణ రాష్ట్రం వచ్చాక కస్తూర్బా గురుకురాల్లో కోర్సులు పెంచి, ఆపై ఇంటర్ వరకు చదువుకునే తరగతులు పెంచామని అన్నారు. ఇక రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీలకు, డిగ్రీ కాలేజీలకు నిధులు కావాల్సినన్ని ప్రభుత్వం ఇస్తోందని పేర్కొన్నారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సిలర్స్ నియామకం త్వరలోనే ఉంటుందని కూడా చెప్పుకొచ్చారు.

ఇక విద్యాలయాల యజ్ఞానికి ప్రభుత్వం స్వీకారం చుట్టిందని.. రాబోవు రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల రూపులేకలు మారిపోతాయని అన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఇందు కోసమే బడ్జెట్ లో 4వేల కోట్లు ప్రత్యేక నిధి కేటాయింపులు చేశామని.. నేను(సబితా ఇంద్రారెడ్డి), కేటీఆర్, హరీష్ రావు, ఎర్రబెల్లి ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు ప్రభుత్వం చేసిందని అన్నారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో కొత్త విధివిధానాలు- ప్రణాళికలు కమిటీ తీసుకుంటుందని అన్నారు సబితా ఇంద్రారెడ్డి. అంతర్ జిల్లా బదిలీలు, మహిళలు ప్రత్యేక సెలవులు ప్రభుత్వం ప్రకటించిందని అన్నారు.

ఇవి కూడా చదవండి: Corona: ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. గత 24 గంటల్లో ఎన్ని నమోదయ్యాయంటే?

Alert! LIC: ఎల్ఐసీ ఖాతాదారులకు ముఖ్య సూచన..ఈ ఫారం నింపకపోతే మీ డబ్బులు ఇరుక్కుపోతాయి..

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.