దౌర్భాగ్యం.. అన్నం పెట్టే రైతన్నలపైనా మీ ప్రతాపం.. కోట్లు కొల్లగొట్టి పారిపోతే మాత్రం నో యాక్షన్
అంతేలే, అనేక కష్టనష్టాలకు ఓర్చి.. ఎన్ని బాధలు వచ్చినా మునిపంటి కింద భరిస్తూ... దేశానికే అన్నం పెడుతున్న రైతుకు మీరు ఈ మాత్రం శాస్తి చేయ్యకపోతే ఎలా..?.
అంతేలే, అనేక కష్టనష్టాలకు ఓర్చి.. ఎన్ని బాధలు వచ్చినా మునిపంటి కింద భరిస్తూ… దేశానికే అన్నం పెడుతున్న రైతుకు మీరు ఈ మాత్రం శాస్తి చేయ్యకపోతే ఎలా..?. నిజంగా ఇది సభ్యసమాజం తలదించుకునే ఘటన. దేశానికే అన్నం పెట్టే రైతన్నల పరువు తీశారు మెదక్ జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ అధికారులు. సాగు కోసం తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించలేదన్న కారణంగా వారి ఫోటోలు, పేర్లతో కూడి ఫ్లెక్సీని నడిబజారులో ఏర్పాటు చేశారు. ఈ ఘటన జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
పాపన్నపేట మండలంలో వ్యవసాయ పైపులైన్లు, గేదెలు, కోళ్ల ఫారాల ఏర్పాటు కోసం కొందరు రైతులు లాంగ్ టర్మ్ రుణాలు తీసుకున్నారు. ఇటీవల రుణ బకాయిలు తీర్చాలంటూ కోఆపరేటివ్ బ్యాంక్ అధికారులు రైతులపై ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే కరోనా కాలంలో అప్పు పుట్టక, పంటలు చేతికి రాక ఇబ్బందుల్లో ఉన్నామని, కొంత సమయం ఇవ్వాలని కోరారు రైతులు. ఏ మాత్రం కనికరించని అధికారులు…రుణాలు తీర్చని రైతుల ఫోటోలు, వివరాలతో కూడిన ఫ్లెక్సీలను ఇలా పలుచోట్ల ఏర్పాటు చేశారు.
గతేడాది కరోనా, భారీ వర్షాల కారణంగా పంటలు నష్టపోయి చేతిలో చిల్లిగవ్వ లేకుండా పోయిందని, ఈ పరిస్థితుల్లో తమ పరువు తీయటం సమంజసం కాదంటూ…రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. పంట డబ్బులు వచ్చిన తర్వాత అప్పులు కడతామని వేడుకుంటున్నారు. రుణాలు వెంటనే తీర్చకపోతే భూములు వేలం వేస్తామని, ఎర్రజెండాలు పాతుతామని అధికారులు బెదిరించినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తాము రైతుల ఫోటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినట్లు డీసీసీబీ పాపన్నపేట మేనేజర్ ప్రవీణ చెబుతున్నారు. కోటానుకోట్లు దోచుకుని డిఫాల్టర్ల మారినవాళ్ల జోలికి మాత్రం వెళ్లరు కానీ.. కరోనా కాలంలో కన్నీళ్లు దిగమింగి బ్రతుకుతున్న రైతుల జీవితాలంటే మీకు చిన్నచూపేలే అంటున్నారు పలువురు నెటిజన్లు.
Also Read: చేనుకి నీరు పెడుతుండగా.. ఇద్దరు రైతులపై విరుచుకుపడిన చిరుత.. అన్నదాతలు ఏం చేశారంటే..?
తెలంగాణలో డిగ్రీ, పీజీ పరీక్షలు వాయిదా.. ప్రకటించిన ఉన్నత విద్యామండలి