AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BIG BREAKING: తెలంగాణలో డిగ్రీ, పీజీ పరీక్షలు వాయిదా.. ప్రకటించిన ఉన్నత విద్యామండలి

తెలంగాణలో డిగ్రీ, పీజీ పరీక్షలు వాయిదా వేస్తూ ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. త్వరలో రీ షెడ్యూల్ ప్రకటిస్తామని ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు.

BIG BREAKING:   తెలంగాణలో డిగ్రీ, పీజీ పరీక్షలు వాయిదా.. ప్రకటించిన ఉన్నత విద్యామండలి
Telangana Degree Exams
Ram Naramaneni
|

Updated on: Mar 24, 2021 | 4:47 PM

Share

తెలంగాణలో డిగ్రీ, పీజీ పరీక్షలు వాయిదా వేస్తూ ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. త్వరలో రీ షెడ్యూల్ ప్రకటిస్తామని ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఉధృతంగా ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా ఇప్పటికే రాష్ట్రంలో బుధవారం నుంచి విద్యాసంస్థలు అన్నీ తాత్కాలికంగా బంద్ చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో తాజాగా డిగ్రీ, పీజీ ఎగ్జామ్స్ కూడా పోస్ట్ పోన్ చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ విద్యా శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.

తెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తుంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ముఖ్యంగా విద్యాసంస్థలు కరోనా విస్పోటక కేంద్రాలుగా మారుతున్నాయి. దీంతో అలర్టైన ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది.

తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా…

తెలంగాణలో నేడు ఈ ఏడాదిలోనే అత్యధిక కరోనా కేసులు నమోదవ్వడం పరిస్థితి తీవ్రతకు అర్థం పడుతుంది. రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంటల వరకు 70,280 కరోనా నిర్ధారణ టెస్టులు చేయగా.. 431 పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం పాజటివ్ కేసుల సంఖ్య 3,04,298కి చేరింది. నిన్న కొవిడ్‌తో ఇద్దరు మృతిచెందినట్లు..  వైద్య ఆరోగ్య శాఖ బుధవారం ఉదయం బులిటెన్‌‌లో తెలిపింది. దీంతో ఇప్పటి వరకు ప్రాణాలువిడిచిన వారి సంఖ్య 1676కి చేరింది. కరోనా బారి నుంచి మంగళవారం 228 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 2,99,270కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 3,352 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఈ పేషెంట్లలో 1,395 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 111 కేసులు వెలుగుచూశాయి. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 97,89,113కి చేరింది.

Also Read: చేనుకి నీరు పెడుతుండగా.. ఇద్దరు రైతులపై విరుచుకుపడిన చిరుత.. అన్నదాతలు ఏం చేశారంటే..?

రోడ్డుపై వెళ్తున్న ట్రక్‌పై పడిన పిడుగు.. పేలిన 450 సిలిండర్లు.. సమీప గ్రామాలకు దూసుకెళ్లిన ముక్కలు

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్