AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sonu Sood: బిడ్డకు సోనూసూద్ పేరు పెట్టుకున్న ఖమ్మం దంపతులు.. నేరుగా కలిసిన రియల్ హీరో..

Sonu Sood: లాక్‏డౌన్ సమయంలో వేలాది మంది వలస కార్మికులకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు సాయం చేసి రియల్ హీరోగా మారాడు సోనూసూద్. అంతేకాదు లాక్‏డౌన్ అనంతరం కూడా సోనూ..

Sonu Sood: బిడ్డకు సోనూసూద్ పేరు పెట్టుకున్న ఖమ్మం దంపతులు.. నేరుగా కలిసిన రియల్ హీరో..
కష్టం అన్నవారికి లేదనుకుండా సాయం అందిస్తూ అంతులేని అభిమానాన్ని సొంతం చేసుసుకున్నాడు సోనూసూద్ 
Rajitha Chanti
|

Updated on: Mar 24, 2021 | 4:56 PM

Share

Sonu Sood: లాక్‏డౌన్ సమయంలో వేలాది మంది వలస కార్మికులకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు సాయం చేసి రియల్ హీరోగా మారాడు సోనూసూద్. అంతేకాదు లాక్‏డౌన్ అనంతరం కూడా సోనూ..సహాయం చేయడం మాత్రం ఆపలేదు. సాయం కావాలంటూ.. ఎవరు అడిగిన లేదనకుండా సహాయం చేశాడు. తన సంపాదన కరిగిపోయినా కానీ.. వలస కార్మికులకు సాయాన్ని అందించాడు. దీంతో చాలా మంది సోనూసూద్‏ను రియల్ హీరోగా.. తమ ఆరాధ్య దేవుడిగా కొలిచారు.  మరికొంతమంది వలస  కార్మికులు తమ దుకాణాలకు ఆయన పేరు పెట్టుకొని కృతజ్ఞత చాటుకున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల ఖమ్మం జిల్లాకు చెందిన ఓ జంట తమ కూతురికి సోనూ సూద్ పేరు వచ్చేలా.. సోనాలి సూద్ అని పేరు పెట్టుకున్న విషయం తెలిసిందే.  తాజాగా వారిని కలిసాడు రియల్ హీరో.

Sonu Sood 1

Sonu Sood 1

బోనకల్ మండలం ముష్టికుంట్ల గ్రామానికి చెందిన పండగ నవీన్ ఆర్ఎంపీగా పనిచేస్తుంటారు. నవీన్, త్రివేణి దంపతులకు ఇటీవల కూతురికి జన్మించింది. ఆ చిన్నారికి సోనాలి సూద్ అని పేరు పెట్టారు. ఫిబ్రవరి 2న పాపకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకకు రావాలంటూ.. సోనూసూద్‏ను ఆహ్వానిస్తూ.. ఆహ్వాన పత్రికను ముద్రించారు. ఇక ఆ పత్రిక సోషల్ మీడియాలో హాల్ చల్ చేసిన సంగతి తెలిసిందే… ఇదిలా ఉంటే.. రియల్ హీరో ఆ జంటను కలిశాడు. ఆ కుటుంబాన్ని కలిసి.. వారితో సెల్ఫీ తీసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

Sonu Sood 2

Sonu Sood 2

సోనూసూద్ చివరిసారిగా అల్లుడు అదుర్స్ సినిమాలో కనిపించాడు. ప్రస్తుతం సోనూ.. కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో నటిస్తున్నారు. ఇందులో రామ్, పూజా హెగ్డే కీలక పాత్రలలో నటిస్తున్నారు. చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ హీరోయిన్‏గా నటిస్తుంది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్లపై మెగా పవర్ స్టార్ రాంచరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ మూవీని మే 13న దేశ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లుగా ఇప్పటికే చిత్రయూనిట్ ప్రకటించింది.

ట్వీట్..

Also Read:

కిడ్నీ ఫెయిల్యూర్.. గుండె సమస్యలతో ఉన్న నన్ను సినిమాలే హీరోగా మార్చాయి.. ఆసక్తికర విషయాలను చెప్పిన రానా..

Tollywood Actresses in Sarees : నల్లటి చీరలో మెరిసిన టాలీవుడ్ ముద్దుగుమ్మలు.. ఎంత సొగసో.. సుమీ

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్