రోడ్డుపై వెళ్తున్న ట్రక్‌పై పడిన పిడుగు.. పేలిన 450 సిలిండర్లు.. సమీప గ్రామాలకు దూసుకెళ్లిన ముక్కలు

రాజస్థాన్ లోని భిల్వారా జిల్లాలోని జైపూర్-కోటా హైవేపై మంగళవారం 450 ఎల్పిజి గ్యాస్ సిలిండర్లతో ప్రయాణిస్తున్న ట్రక్కులో మంటలు చెలరేగాయి.

రోడ్డుపై వెళ్తున్న ట్రక్‌పై పడిన పిడుగు.. పేలిన 450 సిలిండర్లు.. సమీప గ్రామాలకు దూసుకెళ్లిన ముక్కలు
Truckstruck By Lightning
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 24, 2021 | 4:50 PM

రాజస్థాన్ లోని భిల్వారా జిల్లాలోని జైపూర్-కోటా హైవేపై మంగళవారం 450 ఎల్పిజి గ్యాస్ సిలిండర్లతో ప్రయాణిస్తున్న ట్రక్కులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ట్రక్ డ్రైవర్ సంత్రామ్ మీనా గాయపడ్డారు. భారీ అగ్నిప్రమాదం సమీప ప్రాంతాల్లో భయాందోళనలకు దారితీసింది.  కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గాయపడిన ట్రక్ డ్రైవర్‌ను చికిత్స కోసం డియోలి ఆసుపత్రికి తరలించారు. ఈ ట్రక్ నాసిరాబాద్ నుంచి కోట భవానిమండి వైపు వెళుతోంది. అగ్నిప్రమాదానికి కారణాన్ని నిర్ధారించడానికి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మంటలు చెలరేగడానికి కారణమేమిటో ఇంకా స్పష్టంగా తెలియలేదు. మంటలు చెలరేగిన తరువాత సిలిండర్లలో పేలుడు జరిగిందని జహాజ్‌పూర్ సిఐ మహావీర్ శర్మ తెలిపారు. 

అయితే స్థానికుల మాత్రం పిడుగు పడటం వల్లే ట్రక్కులో మంటలు చెలరేగాయని చెబుతున్నారు. ఆ తర్వాత సిలిండర్లు పేలాయని పేర్కొన్నారు. సుమారు 3 గంటలపాటు సిలిండర్ల పేలుడు కొనసాగింది. ప్రమాదం నేపథ్యంలో జాతీయ రహదారి-52 పై భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో… పోలీసు అధికారులు ప్రయాణికులను ఇతర మార్గాలకు మళ్లించారు.

కనీసం 5-7 కిలోమీటర్ల దూరం నుంచి మంటలు కనిపించాయని, ఎల్‌పిజి సిలిండర్ల పేలుళ్ల కారణంగా అగ్నిమాపక దళం అధికారులు కాలిపోతున్న ట్రక్కు దగ్గరికి వెంటనే చేరుకోలేకపోయినట్లు తెలుస్తోంది. స్పాట్ నుంచి 5-7 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమీప గ్రామాల నుండి సిలిండర్ల ముక్కలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అప్పుడున్న మంటల తీవ్రతకు 150 మీటర్ల దూరంలో ఉండటం కూడా కష్టమనిపించిందని ఒక అగ్నిమాపకశాఖ అధికారి తెలిపారు. ఘటనకు సంబంధించిన వీడియో కూడా ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

Also Read:  చేనుకి నీరు పెడుతుండగా.. ఇద్దరు రైతులపై విరుచుకుపడిన చిరుత.. అన్నదాతలు ఏం చేశారంటే..?