చేనుకి నీరు పెడుతుండగా.. ఇద్దరు రైతులపై విరుచుకుపడిన చిరుత.. అన్నదాతలు ఏం చేశారంటే..?
ఈ మధ్య చిరుత పులులు, పెద్ద పులుల దాడులు ఎక్కువైపోతున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో కూడా చిరుతలు జనావాసాల్లోకి వచ్చి దాడులకు పాల్పడుతున్నాయి...
ఈ మధ్య చిరుత పులులు, పెద్ద పులుల దాడులు ఎక్కువైపోతున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో కూడా చిరుతలు జనావాసాల్లోకి వచ్చి దాడులకు పాల్పడుతున్నాయి. దీంతో అటవీ ప్రాంతాలకు సమీపాన ఉన్న పొలాలకు వెళ్లాలంటే రైతులు, కూలీలు తెగ భయపడుతున్నారు. తాజాగా కర్ణాటకలోని హవేరి జిల్లా బులపురలో ఇద్దరు రైతులపై చిరుత పులి అటాక్ చేసింది. దీంతో ప్రాణాలను రక్షించుకునే క్రమంలో దాని అంతమొందించారు.
వివరాల్లోకి వెళ్తే.. గాడిగెప్ప, క్రిష్ణప్ప అనే ఇద్దరు రైతులు బుధవారం ఉదయం 3 గంటలకు పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లగా ఓ చిరుత పులి వారిపై ఆకస్మాత్తుగా అటాక్ చేసింది. తమ ప్రాణాలను రక్షించుకునేందుకు చిరుతపై ఎదురుదాడి చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. అక్కడ నుంచి పారిపోయే అవకాశం లేదు. దీంతో పక్కనే ఉన్న ఓ బండ రాయితో ఆ వన్యమృగాన్ని కొట్టారు. దీంతో తీవ్రగాయాలతో అది అక్కడే మృతి చెందింది. ఈ ఘటనలో గాడిగెప్పకు తీవ్రంగా గాయాలయ్యాయి. అతడిని చిత్రదుర్గ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. క్రిష్ణగప్పకు స్వల్పగాయాలైనట్లు పేర్కొన్నారు.
కాగా ఇప్పడు వన్యప్రాణాలు దాడులు మరింత పెరిగే అవకాశం ఉంది. ఎండాకాలం కావడంతో తాగునీటి కోసం అవి ఊర్ల వైపు వచ్చే అవకాశం ఉంది. దీంతో అధికారులు కట్టదిట్టమైన చర్యలు తీసుకోవాలని అటవీ ప్రాంతాలకు సమీపాన ఉన్న ఊర్ల ప్రజలు కోరుతున్నారు. అటవీ ప్రాంతాలలో జంతువుల కోసం త్రాగునీటి ఏర్పాట్లు చేయాలని పలువురు సూచిస్తున్నారు.
Also Read: క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో కుర్రాళ్ళ మతిపోగొడుతున్న ‘ఆర్ఎక్స్100’ భామ.. ఆకట్టుకుంటున్న వీడియో