Gold Seized: అస్సాం టూ హైదరాబాద్‌.. గోల్డ్‌ స్మగ్లర్ల గుట్టురట్టు.. 12 కోట్ల విలువైన బంగారం స్వాధీనం

Gold Smuggling: గోల్డ్‌ స్మగ్లర్ల గుట్టురట్టయింది. పక్కా సమాచారంతో డీఆర్‌ఐ అధికారులు 12కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 26 కేజీల బంగారంతో

Gold Seized: అస్సాం టూ హైదరాబాద్‌.. గోల్డ్‌ స్మగ్లర్ల గుట్టురట్టు.. 12 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
Gold Smuggling
Follow us

|

Updated on: Mar 24, 2021 | 6:42 PM

Gold Smuggling: గోల్డ్‌ స్మగ్లర్ల గుట్టురట్టయింది. పక్కా సమాచారంతో డీఆర్‌ఐ అధికారులు 12కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 26 కేజీల బంగారంతో రాష్ట్రాలు.. రాష్ట్రాలు దాటుకుంటూ వస్తున్న స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ పరిధిలోని పంతంగి టోల్‌ ప్లాజా వద్ద మంగళవారం భారీగా బంగారం పట్టుబడింది. దాదాపు 26 కిలోల బంగారాన్ని డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారం బిస్కెట్ల విలువ రూ. 11.63 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు.

అస్సాంలోని గువహటి నుంచి హైదరాబాద్‌కు కారులో తరలిస్తుండగా బంగారాన్ని పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లోని పలు దుకాణాలకు తరలించేందుకు భారీగా బంగారాన్ని తీసుకెళ్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు డీఆర్‌ఐ అధికారులు హైవేపై తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అస్సాం రిజిస్ట్రేషన్‌ కారును ఆపి తనిఖీలు చేపట్టారు. కారు ఎయిర్‌బ్యాగ్‌లో బంగారం బిస్కెట్లను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. కారును, బంగారాన్ని సీజ్‌ చేసి, ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేసినట్లు అధికారులు తెలిపారు.

నిందితులను హైదరాబాద్‌లోని డీఆర్‌ఐ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నట్లు తెలిపారు. విదేశాల నుంచి బంగారం ఎలా వచ్చింది.. హైదరాబాద్‌లో ఎవరికి ఇచ్చేందుకు తీసుకువస్తున్నారు.. దీని వెనుక ఉన్న సూత్రదారులు ఎవరనే విషయంపై దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

Also Read:

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు