CRPF Recruitment 2021: సీఆర్‌పీఎఫ్‌లో ఉద్యోగాలు.. ప్రారంభ జీతం రూ. 85 వేలు.. మీరు అప్లయ్ చేశారా?..
CRPF Recruitment 2021: అస్సాంలోని సిఆర్‌పిఎఫ్ హాస్పిటల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్లను నియామకానికి..
CRPF Recruitment 2021: అస్సాంలోని సిఆర్‌పిఎఫ్ హాస్పిటల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్లను నియామకానికి సంబంధించి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు సీఆర్‌పీఎఫ్ అధికారిక వెబ్‌సైట్‌లో crpf.gov.in లో లాగిన్ అయి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ నియామక ప్రక్రియ 2021, ఏప్రిల్ 14వ తేదీన ఉదయం 9 గంటల నుంచి వాక్-ఇన్-ఇంటర్వ్యూ ఆధారంగా జరగనుందని నిర్వాహకులు తెలిపారు. కాంపోజిట్ హాస్పిటల్, సిఆర్పిఎఫ్, జిసి క్యాంపస్, ఉదర్‌బ్యాండ్, దయాపూర్, సిల్చార్ (అస్సాం) పైన పేర్కొన్న ఇంటర్వ్యూకు వేదిక.
మొత్తం ఖాళీలు: అనస్థీషియా, పాథాలజీ, మెడిసిన్, రేడియాలజీ, కళ్ల సంబంధిత విభాగంలో మొత్తం ఐదు పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు వేతం రూ. 85,000 ల నుంచి ప్రారంభం అవుతుంది. ఆసక్తిగల అభ్యర్థు వాక్-ఇన్-ఇంటర్వ్యూకు హాజరవ్వాల్సి ఉంటుంది. ఇంకా 70 ఏళ్ల లోపు అయినవారు ఉండాలి.
అర్హతలు: 1) సంబంధిత స్పెషలైజేషన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ / డిప్లొమా 2) డిగ్రీ పొందినవారికి ఒకటిన్నర సంవత్సరాల అనుభవం, పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత సంబంధిత స్పెషలైజేషన్‌లో డిప్లొమా హోల్డర్‌కు రెండున్నర సంవత్సరాల అనుభవం.
ముఖ్యగమనిక: వాక్-ఇన్-ఇంటర్వ్యూకి హాజరయ్యే అభ్యర్థులు ముందుగా ఈ విషయం తెలుసుకోవాలి. ఈ నియామక ప్రక్రియ పూర్తిగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన చేపడుతున్నారు. మూడు సంవత్సరాల పాటు ఈ ఒప్పందం ఉండనుంది. ఇది సంవత్సరం గానీ, రెండు సంవత్సరాల వరకు పొడిగించబడుతుంది. ఇక వాక్-ఇన్-ఇంటర్వ్యూ కోసం హాజరయ్యే అభ్యర్థులు.. డిగ్రీ సర్టిఫికేట్, ఏజ్ ప్రూఫ్, ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్, ఇతర సంబంధిత పత్రాల యొక్క అసలు, ఫోటోకాపీలతో పాటు సాదా కాగితంలో దరఖాస్తుతో పాటు దరఖాస్తు చేసిన పోస్ట్ పేరును మెన్షన్ చేయాలి. ఇంకా అభ్యర్థి ఐదు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలను కూడా తీసుకురాలి. ఇంటర్వ్యూ తరువాత వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.
Also read: