AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PAN Card: పాన్ కార్డులో వివరాలు తప్పుగా నమోదు అయ్యాయి.. మరేం పర్వాలేదు.. ఇలా సులువుగా మార్చేసుకోండి..

PAN Card: ఒక్కోసారి పలు ధ్రువ పత్రాలు సహా గుర్తింపు కార్డుల్లో వ్యక్తుల చిరునామా, పేర్లు, ఇతర వివరాలు తప్పుగా రికార్డ్ అవుతాయి. సరిగ్గా..

PAN Card: పాన్ కార్డులో వివరాలు తప్పుగా నమోదు అయ్యాయి.. మరేం పర్వాలేదు.. ఇలా సులువుగా మార్చేసుకోండి..
Pan Card
Shiva Prajapati
| Edited By: Anil kumar poka|

Updated on: Jun 16, 2022 | 1:25 PM

Share

PAN Card: ఒక్కోసారి పలు ధ్రువ పత్రాలు సహా గుర్తింపు కార్డుల్లో వ్యక్తుల చిరునామా, పేర్లు, ఇతర వివరాలు తప్పుగా రికార్డ్ అవుతాయి. సరిగ్గా ఏదైనా అత్యవసర పని ఉన్నప్పుడు ఆ తప్పుడు వివరాలు అడ్డంకిగా మారుతుంటాయి. ఇక ప్రస్తుతం కాలంలో ఆధార్ కార్డ్, పాన్ కార్డులకు ఎంతటి ప్రాధాన్యత ఉందో అందరికీ తెలిసిందే. ప్రభుత్వం పథకం మొదలు.. బ్యాంకు ఖాతాలు తెరవడం, లావాదేవీలు నిర్వహించడం అన్నింటికీ ఈ కార్డులు చాలా అవసరం. అయితే ఒక్కోసారి ఈ కార్డుల్లో తప్పుడు వివరాలు నమోదు అవుతాయి. మరికొన్ని సార్లు వ్యక్తులు అద్దె ఇళ్లలో ఉండటం కారణంగా నిరంతరం ఇళ్లు మారుతుండటంతో అడ్రస్ కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. దాంతో వాటిని సవరించుకునేందుకు కార్డు దారులు చాలా అవస్థలు పడాల్సి వచ్చేది. ఇప్పుడు అలాంటి ఇబ్బందులు లేకుండా ఇంట్లో కూర్చునే సులువుగా ఛేంజ్ చేసుకునే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. అదెలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

పాన్ కార్డు వివ‌రాలు ఆ‌న్‌లైన్‌లో మార్చుకోవ‌డం ఎలాగో ఇప్పుడు చూద్దాం: ముందుగా ఎన్ఎస్‌డీఎల్ అధికారిక వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి. ఆ తరువాత ఆన్‌లైన్ పాన్ అప్లికేష‌న్ పేజిలో ‘‘Application Type’’ పై క్లిక్ చేయాలి. అక్కడ ‘‘Changes or Correction in existing PANS Data/Reprint of PAN Card’’ అనే ఆప్షన్ కనిపిస్తుంటుంది. వినియోగదారులు ఆ ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. అక్కడ ‘‘Individual’’ పై క్లిక్ చేసి వ్యక్తిగత వివ‌రాలు నమోదు చేయాలి. దాని కందనే క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలని అడుగుతుంది. ఆ క్యాప్చా కోడ్ ఎంట‌ర్ చేయాలి. అనంతరం స‌బ్‌మిట్‌పై క్లిక్ చేయాలి. అలా సబ్మిట్ చేయగానే కొత్త పేజీ ఓపెన్‌ అవుతుంది. దాంట్లో టోకెన్ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్‌ను వినియోగదారుడు భద్రపరుచుకోవాలి. అనంతరం ‘‘Submit digitally through e-KYC & e-sign(paperless)’’ ఆప్షన్‌ని కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయాలి. మరో పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ వ్యక్తిగత వివరాలు నింపాల్సి వుంటుంది. అక్కడ వివరాలు నింపడం పూర్తయ్యాక ‘‘నెక్ట్స్’’ క్లిక్ చేయాలి. ఆ తరువాత ఓపెన్ అయిన పేజీలో మీరు మార్చాలనుకుంటున్న అడ్రస్, ఇతర వివరాలను తప్పులు లేకుండా నింపాలి. అన్ని వివరాలు నమోదు చేయడం అయిపోయాక ‘‘నెక్ట్స్’’ బటన్ క్లిక్ చేయాలి. ఆ తరువాత ఓపెన్ అయ్యే పేజీలో వినయోగదారుడి ఐడెంటిటీ, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఫోటో, సంతకం కూడా స్కాన్ చేసి ఆ ఫోటోలను అప్‌లోడ్ చేయాలి. అంతా పూర్తయ్యాక ‘Submit’పై క్లిక్ చేయాలి. ఆ వెంటనే అక్నాలెడ్జ్‌మెంట్ స్లిప్ వస్తుంది. ఆ స్లిప్‌ను ప్రింటౌట్ తీసుకోవాలి. దాన్ని ఎన్ఎస్‌డీఎల్ ఆఫీసుకు పోస్ట్ చేయాలి.

పాన్ కార్డు వివ‌రాలు ఆఫ్‌లైన్‌లో ఎలా మార్చుకోవాలో ఇప్పుడు చూద్దాం: వివరాలు సరి చేసేందుకు పాన్ కరెక్షన్ అనే ఫారం ఉంటుంది. దాన్ని నింపాల్సి ఉంటుంది. ఏమిమి వివరాలు అప్‌డేట్ చేయాలని అనుకుంటున్నామో అన్నింటినీ తప్పులు లేకుండా నింపాలి. తాజాగా పొందుపరిచిన అడ్రస్ వివరాలకు సంబంధించి అడ్రస్ ప్రూఫ్‌ను ఆఫారంతో జత చేయాలి. ఆ తరువాత దరఖాస్తు ఫారాన్ని దగ్గరలోని పాన్ కేంద్రంలో సమర్పించాలి. లేదా పోస్ట్ చేయాలి.

Also read:

Online Shopping: తక్కువ ధరకే యాపిల్ ఐఫోన్ కొన్నానని సంబరపడిపోయాడు.. అంతలోనే వచ్చిన అర్డర్‌ను చూసి కస్టమర్ ఫ్యూజుల్ ఔట్..

Yuvraj Singh: ఇన్‌స్టాగ్రామ్‌లో యువరాజ్‌ సింగ్ హల్‌చల్.. సరికొత్త గెటప్‌లో ఫోటో పోస్ట్.. కామెంట్స్‌తో రఫ్పాడుకున్న ప్రముఖులు..