Online Shopping: తక్కువ ధరకే యాపిల్ ఐఫోన్ కొన్నానని సంబరపడిపోయాడు.. అంతలోనే వచ్చిన అర్డర్‌ను చూసి కస్టమర్ ఫ్యూజుల్ ఔట్..
Online Shopping: కస్టమర్లను ఆన్‌లైన్ షాపింగ్ సైట్లు ఆకట్టుకునేందుకు రకరకాల ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. వినియోగదారుల అభిరుచులకు..
Online Shopping: కస్టమర్లను ఆన్‌లైన్ షాపింగ్ సైట్లు ఆకట్టుకునేందుకు రకరకాల ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. వినియోగదారుల అభిరుచులకు తగ్గట్లుగా.. కొత్త కొత్త బ్రాండ్ల వస్తువులను ఎప్పటికప్పుడు విడుదల చేస్తూనే ఉంటారు. ఇక ఇదే సమయంలో కస్టమర్లు సైతం కొత్తగా ఏదైనా కనిపిస్తే చాలు కొనేసేందుకు సిద్ధమైపోతుంటారు. తాజాగా దీనికి నిరద్శనమైన ఘటనే థాయిలాండ్‌లో చోటు చేసుకుంది. ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లో ‘ఐఫోన్’ ఆకారంలో వస్తువు కనిపించడం.. అతి తక్కువ ధర ఉండటంతో ఓ యువకుడు ముందూ, వెనుక ఏమీ ఆలోచించలేదు. కనీసం ఆ ప్రోడక్ట్ ఏంటి? దాని ఫీచర్లు ఏంటి? అనేది కూడా చూడకుండానే చక చకా దాన్ని బుక్ చేసేశాడు. అంతేనా.. అతి తక్కువ ధరకే ఐఫోన్ రావడం తన అదృష్టంగా భావించి తెగ సంబరపడిపోయాడు. అయితే, అతని సంబరం ఎంతోసేపు నిలవలేదు. అతను బుక్ చేసిన ఆర్డర్ చివరికి రానే వచ్చింది. అది ఓపెన్ చూసిన కస్టమర్‌కు ఫ్యూజ్‌లు ఎగరిపోయాయి. ఆ కస్టమర్ ఆన్‌లైన్‌లో ఆపిల్ స్మార్ట్‌ఫోన్ ఆకారంలో ఉన్న కాఫీ టేబుల్‌ను కొనుగోలు చేశాడు. అయితే, ఇది ఈ -కామర్స్ లోపం వల్ల జరిగిందేం కాదని, కస్టమర్ తప్పు అని చివరికి తేలింది.
థాయ్‌లాండ్‌కు చెందిన యువకుడు.. సోషల్ మీడియాను చూస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఆన్‌లైన్ బిజినెస్ సైట్లు కొన్ని ఆఫర్లతో కూడిన అడ్వర్టైజ్‌మెంట్లు కనిపించాయి. యాపిల్ ఐఫోన్ బొమ్మ, దాని కింద అత్యంత చౌక ధర కనిపించాయి. ఇంకేముంది.. అందివచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోవద్దని భావించి.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా, కనీసం ప్రోడక్ట్ వివరాలు చూడకుండానే కొనుగోలు చేశాడు. అలా తాను బుక్ చేసుకున్న ప్రోడక్ట్ కోసం థాయ్‌లాండ్ యువకుడు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. ఆ సమయంలో ఇంటి ముందుకు పార్సెల్ వచ్చింది. చాలా పెద్ద బాక్స్ వచ్చింది. ఇదేంటి అనుకున్నాడు. తీరా బాక్స్ ఓపెన్ చేసి చూస్తే షాక్ అవడం అతని వంతు అయ్యింది. తాను ఆర్డర్ చేసిన బాక్స్‌లో ఐఫోన్ ఉందనుకుంటే.. ఐఫోన్ ఆకారంలో ఉన్న కాఫీ టేబుల్ వచ్చింది. అసలేం జరిగిందని ఆరా తీస్తే.. దీనిని కొనుగోలు చేసిన వ్యక్తే తప్పు చేశాడని తేలింది. కనీసం ప్రోడక్ట్ వివరాలు తెలుసుకోకుండా కాఫీ టేబుల్‌ను బుక్ చేశాడని నిర్ధారించారు. చివరికి ఆ యువకుడు షాక్ తిన్నాడు. కాగా, ఈ వ్యవహారానికి సంబంధించిన ఫోటోలను సదరు యువకుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాంతో అది కాస్తా వైరల్ అయ్యింది.
Also read: