బెంగుళూరు వెళ్లాలనుకుంటే ఇక కోవిడ్ టెస్ట్ నెగెటివ్ రిపోర్ట్ తప్పనిసరి, ఏప్రిల్ 1 నుంచే

బెంగుళూరు వెళ్లాలనుకుంటే ఇక కోవిడ్ టెస్ట్ నెగెటివ్ రిపోర్ట్ తప్పనిసరి, ఏప్రిల్ 1 నుంచే
delhi lockdown news

బెంగుళూరు నగరానికి వెళ్లాలనుకుంటే ఇక కోవిడ్ టెస్ట్  నెగెటివ్ రిపోర్టు తప్పనిసరిగా ఉండాలి. ఏప్రిల్ 1 నుంచి ఈ ఉత్తర్వులు అమలు లోకి  వస్తాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి డా.కె.సుధాకర్ తెలిపారు.

Umakanth Rao

| Edited By: Phani CH

Mar 25, 2021 | 8:20 PM

బెంగుళూరు నగరానికి వెళ్లాలనుకుంటే ఇక కోవిడ్ టెస్ట్  నెగెటివ్ రిపోర్టు తప్పనిసరిగా ఉండాలి. ఏప్రిల్ 1 నుంచి ఈ ఉత్తర్వులు అమలు లోకి  వస్తాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి డా.కె.సుధాకర్ తెలిపారు.  ఈ వైరస్ పాజిటివ్ సోకినవారి చేతులమీద స్టాంప్ వేస్తామని కూడా ఆయన చెప్పారు. నగరంలో  గురువారం ఒక్క రోజే 1400 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి.  గత 4 నెలల తరువాత ఇంత అత్యధికంగా నమోదు కావడం ఇదే మొదటి సారి . వచ్చే రెండు నెలలు ఈ నగరవాసులు చాలా జాగ్రత్తగా ఉండాలని సుధాకర్ కోరారు. ప్రతి వారూ విధిగా మాస్కులు ధరించాలని, శానిటైజ్ తప్పనిసరి అని అన్నారు.  ఇళ్ళు, ఇంకా  భవనాల్లో  జరిగే సామాజిక కార్యక్రమాలకు 200 మందికి మించి అనుమతించరాదని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అయితే ఓపెన్ లాన్స్ లో 500 మంది  గెస్టులను అనుమతిస్తామన్నారు. హాస్పిటల్స్ లో బెడ్స్, ఐసీయుల లభ్యతకు సంబంధించి సమాచారాన్ని ఆన్ లైన్ ద్వారా తెలుసుకోవచ్చునని ఆయన చెప్పారు.

కోవిడ్ రోగులకు  ప్రత్యేకంగా 400  బెడ్స్ అందుబాటులో ఉంటాయని, ఇందుకు ప్రభుత్వం అప్పుడే చర్యలు  తీసుకుందని సుధాకర్ చెప్పారు. అవసరమైతే వీటి సంఖ్యను ఇంకా పెంచుతామన్నారు.ప్రయివేట్ ఆసుపత్రులు కూడా తగిన ముందు జాగ్రత్త చర్యలతో సిద్డంగా ఉండాలని సుధాకర్ కోరారు. ఇలా ఉండగా ఏప్రిల్ రెండో వారంలో కోవిడ్ కేసులు చాలావరకు పెరగవచ్చునని ఎస్ బీ ఐ తన నివేదికలో తెలిపింది. ఫిబ్రవరి 15 నుంచి లెక్క వేసుకుంటే సెకండ్ వేవ్ వంద రోజులవరకు ఉండవచ్చు అని ఈ రిపోర్టులో అభిప్రాయపడ్డారు. మార్చి 23 వరకు అందిన ట్రెండ్ ను బట్టి దేశంలో సెకండ్ వేవ్ కేసులు చాలా పెరిగే సూచనలున్నాయని ఇందులో పేర్కొన్నారు. లాక్ డౌన్లు, లేదా ఆంక్షల వల్ల పెద్దగా ఫలితం ఉండదని, కేవలం భారీ ఎత్తున మాస్ వ్యాక్సినేషన్ చేపట్టడమే ఉత్తమమని ఈ నివేదిక స్పష్టం చేసింది. దేశంలో 18 రాష్టాల్లో డబుల్ మ్యుటెంట్ వేరియంట్ కేసులను కనుగొన్నట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది.

మరిన్ని ఇక్కడ చదవండి: Corona Mask: కరోనా వైరస్‌ ఎఫెక్ట్‌… మాస్క్‌ లేకుండా బయట తిరుగుతున్నారా..? రూ. 250 జరిమానా కట్టాల్సిందే

Jagananna Vidya Deevena: తల్లుల ఖాతాల్లో జగనన్న విద్యా దీవెన డబ్బులు ఎప్పుడు జమవుతాయంటే.. సమీక్షించిన సీఎం జగన్

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu