Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తమిళనాడులో ఆ బైకర్ ను పోలీసు ఎందుకు ఆపాడంటే ? ట్రాఫిక్ ఉల్లంఘనకైతే కాదు, మరి ?

తమిళనాడులో జరిగిన ఓ ఉదంతం పోలీసులంటే కేవలం లాఠీలు పట్టుకుని ట్రాఫిక్ ఉల్లంఘనదారులపై లాఠీలు ఎత్తేవారు కారని నిరూపిస్తోంది.   అలాగే తమ దారిన పోయే వారిని ఆపి  వారి లైసెన్సులు వగైరా సమాచారాన్ని తెలుసుకునేవారు కూడా కాదని ఇది రుజువు చేస్తోంది. 

తమిళనాడులో ఆ బైకర్ ను పోలీసు ఎందుకు ఆపాడంటే ? ట్రాఫిక్ ఉల్లంఘనకైతే కాదు, మరి ?
A Biker Was Stopped By Police In Tamilnadu
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: Mar 25, 2021 | 8:27 PM

తమిళనాడులో జరిగిన ఓ ఉదంతం పోలీసులంటే కేవలం లాఠీలు పట్టుకుని ట్రాఫిక్ ఉల్లంఘనదారులపై లాఠీలు ఎత్తేవారు కారని నిరూపిస్తోంది.   అలాగే తమ దారిన పోయే వారిని ఆపి  వారి లైసెన్సులు వగైరా సమాచారాన్ని తెలుసుకునేవారు కూడా కాదని ఇది రుజువు చేస్తోంది.  వివరాల్లోకి వెళ్తే.. టెంకాసి ప్రాంతం వైపు తన బైక్ పై వెళ్తున్న ఓ యువకుడిని ఓ పోలీసు ఆపాడు . దీంతో కంగారుగా ఆ వాహనదారుడు తన వాహనాన్ని ఆపక తప్పలేదు. ఆ వెంటనే ఆ పోలీసు అతడ్ని నువ్వు ఎటువైపు వెళ్తున్నావని అతడ్ని అడిగాడు. తాను కర్ణాటకలోని టెంకాసి వైపు వెళ్తున్నానని ఆ యువకుడు చెప్పగానే  ఆ పోలీసు  తన జేబులో నుంచి ఓ మందు బాటిల్ తీసి.. ఇది అక్కడ దూరంగా వెళ్తున్న బస్సు లోని ఓ మహిళ దని, ఆమె ఇక్కడ దీన్ని పోగొట్టుకుందని చెప్పాడు. తాను ఆ బస్సును ఆపే లోగా అది వెళ్లిపోయిందనన్నాడు. అందువల్ల ఆ బస్సును ఫాలో అయి అందులో ప్రయాణిస్తున్న మహిళకు అందజేయాలని కోరాడు. ఇందుకు ఆ వాహనదారుడు కూడా ఒకే చెప్పి ఆ మందుల సీసా  తీసుకుని రివ్వున ఆ బస్సును ఫాలో అవుతూ వచ్చాడు. ఒక చోట బస్సు కాస్త నెమ్మదిగా వెళ్తుండగా తాను మరింత వేగంగా ముందుకు వెళ్లి ఆ వాహనాన్ని ఆపమన్నట్టు డ్రైవర్ కి సైగ చేశాడు.

డైవర్ బస్సును ఆపగానే ఆ మెడిసిన్ బాటిల్ ని ఆమెకు అందేలా  చూశాడు.. ఇందుకు  ఆ బస్సులోని మహిళతో బాటు బస్సులోని వారంతా అతనికి కృతజ్ఞతలు చెప్పారు. అయితే ఆ వ్యక్తి తన పని ముగిసిందన్నట్టు తన బైక్ పై దూసుకుపోయాడు. ఇప్పుడు చెప్పండి.. ఈ ఘటనలో ఆ పోలీసు గొప్పవాడా ? లేక ఈ యువకుడా ?  ఎవరిది  ఉదార హృదయం ? కావాలంటే  ఆ పోలీసు బస్సు వెళ్ళిపోయింది గనుక తన దారిన తాను వెళ్లిపోవచ్చూ. అదేపనిగా ఆ బైకర్ ను అపడమెందుకు ? కానీ అలా అతను  చేయలేదు. ఇక ఆ వాహనదారుడు కూడా ఒక మంచి పౌరుడుగా తన బాధ్యతను నిర్వర్తించాడు .

మరిన్ని ఇక్కడ చదవండి: బెంగుళూరు వెళ్లాలనుకుంటే ఇక కోవిడ్ టెస్ట్ నెగెటివ్ రిపోర్ట్ తప్పనిసరి, ఏప్రిల్ 1 నుంచే

Corona Mask: కరోనా వైరస్‌ ఎఫెక్ట్‌… మాస్క్‌ లేకుండా బయట తిరుగుతున్నారా..? రూ. 250 జరిమానా కట్టాల్సిందే