జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ శివార్లలో ఉగ్రదాడి , ఇద్దరు జవాన్ల మృతి, మరో ఇద్దరికి గాయాలు
జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్ శివార్లలో గురువారం మధ్యాహ్నం జరిగిన ఉగ్రదాడిలో సి ఆర్ పీ ఎఫ్ కు చెందిన ఇద్దరు జవాన్లు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు...
జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్ శివార్లలో గురువారం మధ్యాహ్నం జరిగిన ఉగ్రదాడిలో సి ఆర్ పీ ఎఫ్ కు చెందిన ఇద్దరు జవాన్లు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. శ్రీనగర్-బారాముల్లా హైవేలోని లవాయ్పుర లో గస్తీ తిరుగుతున్న జవాన్లపై టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. వారిపై భద్రతా దళాలు కూడా తిరిగి కాల్పులు జరిపినప్పటికీ వారు పారిపోయారు. పైగా ఓ జవాన్ నుంచి రైఫిల్ లాక్కుని ఉగ్రవాదులు పరారయ్యారని ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఈ దాడికి లష్కరే-తోయిబా కారణమని ఆయన చెప్పారు. మృతుల్లో ఒకరిని త్రిపురకు చెందిన మంగారామ్ బర్మన్ గా గుర్తించినట్టు ఆయన తెలిపారు. క్షత గాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించామన్నారు. పారిపోయిన టెర్రరిస్టుల కోసం గాలిస్తున్నామని, వారిని పట్టుకోవడమో, హతమార్చడమో చేస్తామని విజయ్ కుమార్ పేర్కొన్నారు.. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
మరిన్ని ఇక్కడ చదవండి: రేపు బంగ్లాదేశ్ వెళ్తున్నా .. కరోనా పాండమిక్ మొదలైనప్పటి నుంచి ఇదే నా తొలి విదేశీ పర్యటన . ప్రధాని మోదీ
తమిళనాడులో ఆ బైకర్ ను పోలీసు ఎందుకు ఆపాడంటే ? ట్రాఫిక్ ఉల్లంఘనకైతే కాదు, మరి ?