రేపు బంగ్లాదేశ్ వెళ్తున్నా .. కరోనా పాండమిక్ మొదలైనప్పటి నుంచి ఇదే నా తొలి విదేశీ పర్యటన . ప్రధాని మోదీ

రెండు రోజుల పర్యటనకు గాను తాను శుక్రవారం బంగ్లాదేశ్ వెళ్తున్నానని ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ కరోనా పాండమిక్ తరుణంలో ఇదే తన మొదటి విదేశీ పర్యటన అని ఆయన చెప్పారు...

రేపు బంగ్లాదేశ్ వెళ్తున్నా .. కరోనా పాండమిక్ మొదలైనప్పటి నుంచి  ఇదే నా తొలి విదేశీ పర్యటన . ప్రధాని మోదీ
Narendra Modi
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: Mar 25, 2021 | 8:40 PM

రెండు రోజుల పర్యటనకు గాను తాను శుక్రవారం బంగ్లాదేశ్ వెళ్తున్నానని ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ కరోనా పాండమిక్ తరుణంలో ఇదే తన మొదటి విదేశీ పర్యటన అని ఆయన చెప్పారు. ఆ దేశంలో ప్రధాని షేక్ హసీనాను కలుస్తానని, భారత, బంగ్లాదేశ్ మధ్య ద్వైపాక్షిక అంశాలపైనా, సంబంధాల మెరుగుదలపైనా తాము చర్చిస్తామని ఆయన చెప్పారు. ఇంతకాలం తరువాత తాను పొరుగునున్న దేశానికి వెళ్లడం ఓ విశేషమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ దేశంతో మన దేశానికి సాంస్కృతిక, భాషా పరమైన సుదీర్ఘ స్నేహ సంబంధాలు ఉన్నాయని అయన ట్వీట్ చేశారు. రేపు బంగ్లా జాతీయ దినోత్సవం కూడానని, ,పైగా బంగబంధు  షేక్ ముజిబుర్ రెహమాన్ జయంతిని కూడా పురస్కరించుకుని తాను ఈ దేశానికి వెళ్లడం ముదావహమని ఆయన అన్నారు. ఆ దేశ ప్రధాని స్వయంగా తమ దేశాన్ని సందర్శించాలని ఆహ్వానం పంపారని మోదీ తెలిపారు. బంగ్లాదేశ్  అభివృధ్డికి ఆ దేశ ప్రధాని చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు, తన పర్యటన వల్ల ఉభయ దేశాల మధ్య అన్ని రంగాల్లో సంబంధాలు మెరుగుపడతాయని ఆశిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.

కాగా ప్రధాని పర్యటనకు ఆ దేశంలో మన రాయబారి అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటివరకు చాలాకాలంగా భారత ప్రధాని బంగ్లాను విజిట్ చేయలేదు.

మరిన్ని ఇక్కడ చదవండి: తమిళనాడులో ఆ బైకర్ ను పోలీసు ఎందుకు ఆపాడంటే ? ట్రాఫిక్ ఉల్లంఘనకైతే కాదు, మరి ?

బెంగుళూరు వెళ్లాలనుకుంటే ఇక కోవిడ్ టెస్ట్ నెగెటివ్ రిపోర్ట్ తప్పనిసరి, ఏప్రిల్ 1 నుంచే