AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rahul Gandhi: ఈ నెల 28న చెన్నైకి రాహుల్‌ గాంధీ.. ఒకే రోజు మూడు ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన

Rahul Gandhi: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సెక్యూలర్‌ కూటమి తరపున ప్రచారం చేసేందుకు ఏఐసీసీ మాజీ ధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఈనెల 28న ఉదయం చెన్నైకి రానున్నారు..

Rahul Gandhi: ఈ నెల 28న చెన్నైకి రాహుల్‌ గాంధీ.. ఒకే రోజు మూడు ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన
Rahul Gandhi
Subhash Goud
|

Updated on: Mar 25, 2021 | 7:50 PM

Share

Rahul Gandhi: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సెక్యూలర్‌ కూటమి తరపున ప్రచారం చేసేందుకు ఏఐసీసీ మాజీ ధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఈనెల 28న ఉదయం చెన్నైకి రానున్నారు. అదే రోజు సాయంత్రం సేలంలో జరిగే బహిరంగ సభలో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌, మిత్రపక్షాలతో కలిసి ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు డీఎంకే అధిష్టానం ఓ ప్రకటన విడుదల చేసింది. రాహుల్‌ చెన్నైలోని వెళచ్చేరిలో కాంగ్రెస్‌ అభ్యర్థి హసన్‌ మౌలానా, డీఎంకే అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. ఆ తర్వాత చెన్నై నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి కళ్లకుర్చి చేరుకుంటారు. కళ్లకుర్చిలో కాంగ్రెస్‌ అభ్యర్థి మణిరత్తనం సహా డీఎంకే కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో సేలంకు చేరుకుంటారు. సాయంత్రం నాలుగు గంటలకు సేలం సీలనాయకన్‌పట్టి వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు.

ఈ సభకు డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ అధ్యక్షతన వహించనున్నారు. ఈ సభలో టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి, ఎండీఎంకే నేత వైగో, సీపీఎం రాష్ట్ర కమిటీ కార్యదర్శి కె. బాలకృష్ణన్‌, సీపీఐ రాష్ట్ర కమిటీ కార్యదర్శి ఆర్‌. ముత్తరసన్‌, ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ నాయకుడు కేఎం ఖాదర్‌ మొయుద్దీన్‌, డీపీఐ నేత నేత తొల్‌ తిరుమావళవన్‌, మనిదనేయ మక్కల్‌ కట్చి నాయకుడు ఎంహెచ్‌ జవహిరుల్లా, తదితరులు ప్రసంగించనున్నారు.

ఇవీ చదవండి: ఇండియాలోని 30 శాతం మంది ముస్లిములు ఏకమైతే…బెంగాల్ లో టీఎంసీ వివాదాస్పద వ్యాఖ్య

Banks Privatization: త్వరలో మరో నాలుగు బ్యాంకులు ప్రైవేటీకరణ.. వినియోగదారుల పరిస్థితి ఏమిటీ..?