ఇండియాలోని 30 శాతం మంది ముస్లిములు ఏకమైతే…బెంగాల్ లో టీఎంసీ వివాదాస్పద వ్యాఖ్య
బెంగాల్ ఎన్నికల్లో ఆయా పార్టీల తరఫున ప్రచారం చేస్తున్న అభ్యర్థుల్లో కొందరు, వారి నేతలు చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు శృతి మించుతున్నాయి.
బెంగాల్ ఎన్నికల్లో ఆయా పార్టీల తరఫున ప్రచారం చేస్తున్న అభ్యర్థుల్లో కొందరు, వారి నేతలు చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు శృతి మించుతున్నాయి. ఉదాహరణకు కోల్ కతా లోని బీర్ భమ్ ఏరియాలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన తృణమూల్ కాంగ్రెస్ నేత షేక్ ఆలం.. దేశంలోని 30 శాతం ముస్లిం జనాభా అంతా ఏకమైతే మనం నాలుగు పాకిస్తాన్ దేశాలను సృష్టించవచ్చునన్నారు. ‘మనం (ముస్లిములు) 30 శాతం ఉన్నాం…వాళ్ళు (హిందువులు, ఇతరులు) 70 శాతం ఉన్నారు. మన ముస్లిం జనాభా అంతా ఒక్కటైతే కొత్తగా 4 పాకిస్తాన్ దేశాలను ఏర్పాటు చేయవచ్చు..అప్పుడు 70 శాతం జనాభా ఎక్కడికి వెళ్తారు’ అని షేక్ ఆలం వ్యాఖ్యానించాడు. ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి భిదన్ చంద్ర మాఙహీ తరఫున ఈయన ప్రచారం చేస్తున్నాడు. నన్నూర్ భీమ్ నుంచి భిదన్ పోటీ చేస్తున్నారు.
షేక్ ఆలం వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. సీఎం మమతా బెనర్జీ అనుసరిస్తున్న బుజ్జగింపు రాజకీయాల ఫలితంగానే తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఈ విధమైన చెత్త వ్యాఖ్యలు చేస్తున్నారని ఈ పార్టీ నేత అమిత్ మాలవీయ అన్నారు. మైనారిటీలను బుజ్జగించి వారి ఓట్లను దక్కించుకునేందుకు ఆమె ఇలాంటివారిని ప్రోత్సహిస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో మెజారిటీ వర్గాలను ఈ ప్రభుత్వం సెకండ్ క్లాస్ పౌరులుగా చూస్తోందని ఆయన పేర్కొన్నారు. వీరిని ఈ సర్కార్ రెండో స్థాయికి తగ్గించేసిందన్నారు.
అటు- ఈ ఎన్నికల్లో లబ్ది పొందేందుకు బీజేపీ మరో కొత్త పార్టీని రంగంలోకి దింపుతోందని మమతా బెనర్జీ ఆరోపించారు. దాన్ని బీజేపీ ‘బీ’ పార్టీగా ఆమె అభివర్ణించారు. ఆ పార్టీ ద్వారా మైనారిటీల ఓట్లను పొందేందుకు, అదే సమయంలో తమ (బీజేపీ) వర్గ ఓట్లను చేజిక్కించుకునేందుకు అది యత్నిస్తోందని ఆమె అన్నారు. అయితే ఇక్కడి బెంగాలీలకు అన్నీ తెలుసునని ఆమె వ్యాఖ్యానించారు. బహుశా ఆమె ఎంఐఎం ను ఉద్దేశించే ఈ వ్యాఖ్య చేసి ఉండవచ్చునని భావిస్తున్నారు.
Y’day, TMC leader Sheikh Alam, giving a speech in Basa para, Nanoor, in Birbhum AC said, if 30% Muslims in India come together, then 4 Pakistan can be formed…
He obviously owes his allegiance to Mamata Banerjee… Does she endorse this position?
Do we want a Bengal like that? pic.twitter.com/YjAeSzhH5P
— Amit Malviya (@amitmalviya) March 25, 2021
మరిన్ని ఇక్కడ చదవండి: Suez Canal: కెనాల్‌లో ఓ నౌకే కదా చిక్కుకుందనుకుంటున్నారా? దాని వెనుక పెద్ద కథే వుంది..!