- Telugu News Photo Gallery Viral photos James bond fans unite website offers rs 72000 to binge watch all 24 movies of 007 agent
Photo Story: జస్ట్.. ఆ సినిమాలు చూస్తే చాలు.. మీకు రూ.73 వేలు ఇస్తారు.. పూర్తి వివరాలు ఇవే…
మీకు జేమ్స్ బాండ్ సినిమాలంటే ఇష్టమా? అయితే ఈ అదిరిపోయే ఆఫర్ మీ కోసమే.......
Updated on: Mar 26, 2021 | 9:44 PM

జేమ్స్ బాండ్ సినిమాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సిరీస్ నుంచి నెక్ట్స్ వెర్షన్ ఎప్పుడు వస్తుందా అని ఎంతో ఆత్రంగా చూస్తూ ఉంటారు జనాలు. అయితే ‘జేమ్స్ బాండ్’ సినిమా మొదటి పార్టు నుంచి ఇప్పటివరకు విడుదలైన 24 సినిమాలు చూస్తే.. మీకు వేలల్లో డబ్బు లభిస్తుంది. ఇది పూర్తిగా నిజం.

NerdBear.com అనే వెబ్‌సైట్ ఈ క్రేజీ ఆఫర్ ప్రకటించింది. 1962 నాటి Dr.No నుంచి 2015లో రిలీజైన Spectre సినిమా వరకు 24 సినిమాలను చూడాలి. ఈ ఏడాది సెప్టెంబరు 30న జేమ్స్ బాండ్ సీరిస్‌లో 25వ మూవీ.. ‘No Time to Die’ రిలీజ్ కానుంది. నిజానికి ‘నో టైమ్ టు డై’ సినిమా ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదల కావాలి. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.

జేమ్స్ బాండ్ సీరిస్‌లను చూసేందుకు ఎంపికయ్యేవారు 25వ వెర్షన్ విడుదలకు ముందే ఆ 24 చిత్రాలు చూసేయాలి. ఇలా చేసినవారికి నిర్వాహకులు1000 డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.73 వేలు), మూవీస్ చూసేందుకు 100 డాలర్ల అమెజాన్ గిఫ్ట్ కార్డు, త్వరలో విడుదలయ్యే తాజా జేమ్స్ బాండ్ సినిమా చూసేందుకు 50 డాలర్ల AMC గిఫ్ట్ కార్డు ఇస్తారు.

జేమ్స్ బాండ్ సినిమాలు ఇష్టపడేవారికి ఇది పెద్ద టాస్క్ కాదు. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే దరఖాస్తు చేసుకోండి.

దీనికి ఎంపికయ్యే అభ్యర్థి 30 రోజుల్లోనే 24 సినిమాలను చూసేయాలి. ఈ సినిమాలన్నీ కలిపితే మొత్తం నిడివి 51 గంటలు.
