AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GMR Hyderabad Air Cargo : రవాణాలో కొత్త శకం, వ్యాక్సిన్ సరఫరాలో బ్లాక్‌చెయిన్ బేస్డ్ రియల్ టైమ్ ట్రాకింగ్‌ను తీసుకొచ్చిన GMR హైదరాబాద్ ఎయిర్ కార్గో

GMR Hyderabad Air Cargo : కరోనా వ్యాక్సిన్ రవాణాలో బ్లాక్‌చెయిన్ ఆధారిత రియల్ టైమ్ ట్రాకింగ్‌ను ఉపయోగించుకోనుంది GMR హైదరాబాద్ ఎయిర్ కార్గో. ఇందుకోసం..

GMR Hyderabad Air Cargo : రవాణాలో కొత్త శకం, వ్యాక్సిన్ సరఫరాలో బ్లాక్‌చెయిన్ బేస్డ్ రియల్ టైమ్ ట్రాకింగ్‌ను తీసుకొచ్చిన GMR హైదరాబాద్ ఎయిర్ కార్గో
Pic: (left to right) Mr. Nrupul Ponugoti, Mr. Sid Chakravarthy, Mr. Saurabh Kumar
Venkata Narayana
|

Updated on: Mar 25, 2021 | 10:36 PM

Share

GMR Hyderabad Air Cargo : కరోనా వ్యాక్సిన్ రవాణాలో బ్లాక్‌చెయిన్ ఆధారిత రియల్ టైమ్ ట్రాకింగ్‌ను ఉపయోగించుకోనుంది GMR హైదరాబాద్ ఎయిర్ కార్గో. ఇందుకోసం స్టార్టప్ సంస్థ స్టాట్‌విగ్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఒప్పందంపై జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గో సీఈఓ సౌరభ్ కుమార్, సిడ్ చక్రవర్తి, నృపుల్ పొనుగోటి, స్టాట్‌విగ్ కో ఫౌండర్స్ సంతకాలు చేశారు. GHAC ద్వారా హ్యాండిల్ చేసే వ్యాక్సిన్లకు సంబంధించిన రియల్ టైమ్ ట్రాకింగ్, పర్యవేక్షణ వల్ల ‘వ్యాక్సిన్‌ లెడ్జర్’ ప్లాట్‌ఫామ్‌లో చేరిన తయారీదారులు, బయ్యర్లు వ్యాక్సిన్లు ప్రస్తుతం ఎక్కడున్నాయి? వాటి నాణ్యత, భద్రతను తెలుసుకోగలిగే అవకాశం కలుగుతుంది.

కాగా, జీఎంఆర్ ఎయిర్ కార్గో అండ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లిమిటెడ్.. భారతదేశ ఎయిర్ కార్గోలో ప్రధానమైన ఫార్మా హబ్‌గా ఉంటూ, దేశం నుండి వ్యాక్సిన్ ఎగుమతులలో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా అతిపెద్ద కరోనా టీకా తయారీదారులలో హైదరాబాద్ ది ప్రముఖ స్థానం. కోవిడ్ మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ప్రపంచ ప్రజలకు సహాయపడేందుకు రాబోయే రెండు సంవత్సరాల్లో ఇక్కడి నుంచి 3.5 బిలియన్ మోతాదుల COVID-19 వ్యాక్సిన్ ఉత్పత్తి కాబోతోంది.

భారతదేశ ఎయిర్ కార్గో పరిశ్రమలో మొట్టమొదటిసారిగా వ్యాక్సిన్‌ లెడ్జర్ విధానాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని హైదరాబాద్ ఎయిర్ కార్గో సీఈఓ శ్రీ సౌరభ్ కుమార్ ఈ సందర్బంగా చెప్పారు. ఈ కొత్త సాంకేతికత, వ్యాక్సిన్ రవాణాలో మా వినియోగదారులకు రియల్-టైమ్ సమాచారాన్ని అందించడానికి సహాయపడుతుందని సౌరభ్ తెలిపారు. వ్యాక్సిన్ నిర్వహణలో GMR హైదరాబాద్ ఎయిర్ కార్గో సామర్థ్యం, స్టాట్‌విగ్ యొక్క బ్లాక్‌చైన్ టెక్నాలజీ ఆధారిత వ్యాక్సిన్‌ లెడ్జర్ ప్లాట్‌ఫాం.. ఈ రెండూ కలిసి కోవిడ్ మహమ్మారికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పోరాటంలో వ్యాక్సిన్ సప్లై చెయిన్‌ను బలోపేతం చేస్తాయని విశ్వసిస్తున్నానమని సౌరభ్ కుమార్ వెల్లడించారు.

“స్టాట్‌విగ్ తో ఈ భాగస్వామ్యం ద్వారా హైదరాబాద్ ఎయిర్ కార్గో భారతదేశంలో వ్యాక్సిన్లను హ్యాండిల్ చేయడంలోని అత్యున్నతమైన గేట్ వేలలో ఒకటిగా తన స్థానాన్ని మరోసారి సుస్థిరం చేసుకోనుంది. మౌలిక సదుపాయాల పరంగా, సాంకేతిక పరిజ్ఞానం రూపేణా తన సామర్థ్యాలను పెంచుకుంటూ.. కోవిడ్ పై పోరాటంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తోంది’ అని జీహెచ్‌ఐఎఎల్ సీఈఓ శ్రీ ప్రదీప్ పణికర్ అన్నారు.

శ్రీ ఎస్.జి.కె కిషోర్, ఈడీ-సౌత్ అండ్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ – జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్, మాట్లాడుతూ.. “కోవిడ్‌కు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో టెక్నాలజీ, ఉష్ణోగ్రత నియంత్రిత సప్లై చెయిన్ కీలకమైనవి. కస్టమర్లకు, విమానాశ్రయ మౌలిక సదుపాయాల వినియోగదారులకు మెరుగైన అనుభవాన్ని, సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడానికి GMR ఎల్లప్పుడూ ముందుంటుంది. సాంకేతిక నాయకత్వం, కస్టమర్ – కేంద్రీకృత దృష్టి రీత్యా ఈ ‘వ్యాక్సిన్‌లెడ్జర్’ భాగస్వామ్యం చాలా ముఖ్యం. ప్రతి వ్యాక్సిన్‌ లెక్కలోకి వచ్చే ఈ కీలకమైన సమయాల్లో, ఈ వ్యాక్సిన్‌లెడ్జర్ వ్యాక్సిన్ల సురక్షిత రవాణాకు సహాయపడుతుందని ఆశిస్తున్నాము”. అన్నారు.

ఇలా ఉండగా, GMR హైదరాబాద్ ఎయిర్ కార్గో భారతదేశంలో WHO-GSDP (ప్రపంచ ఆరోగ్య సంస్థ – మెరుగైన నిల్వ, పంపిణీ పద్ధతులు) ద్వారా ధృవీకరించబడిన ప్రధాన విమానాశ్రయం. టెంపరేచర్ సెన్సిటివ్ కార్గో నిర్వహణకు ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ఆటంకాలు లేని పంపిణీ కోసం ఇది సంసిద్ధంగా ఉంటుంది. పెరిషబుల్స్, వ్యవసాయ ఉత్పత్తులు ఇంకా, టెంపరేచర్ సెన్సిటివ్ ఔషధాల ప్రత్యేకమైన అవసరాలను తీర్చడానికి GHAC ల్యాండ్‌సైడ్, ఇంకా ఎయిర్‌సైడ్‌లో తన సౌకర్యాలను విస్తరిస్తూ, ప్రక్రియలను క్రమబద్ధీకరిస్తోంది.

ఇక, GHAC ఎయిర్ సైడ్ రవాణా కోసం ఎయిర్ క్రాఫ్ట్ కోల్డ్-చైన్ నిర్వహణ కోసం ఒక మొబైల్ రిఫ్రిజిరేటెడ్ యూనిట్ కూల్ డాలీని ప్రారంభించింది. ఇక్కడి నుంచి ప్రధానంగా పెరిషబుల్స్ (వ్యవసాయ మరియు సముద్ర ఉత్పత్తులు), ఔషధాలు, ఇంజనీరింగ్ & ఏరోస్పేస్, వస్త్రాలు మరియు ఎలక్ట్రానిక్స్‌ల ఎగుమతి, దిగుమతులు జరుగుతాయి. ఇలా.. అత్యంత త్వరగా, నాణ్యంగా వస్తువుల సరఫారాలో హైదరాబాద్ ఎయిర్ కార్గొ ప్రపంచానికే తలమానికంగా ముందుకు సాగుతోంది.

Read also : Baby Turtles released into Sea : పరిమళించిన మానవత్వం, సాగరతీరంలో తాబేలు పిల్లల్ని వదిలిన మధురక్షణం