Baby Turtles released into Sea : పరిమళించిన మానవత్వం, సాగరతీరంలో తాబేలు పిల్లల్ని వదిలిన మధురక్షణం
Baby Turtles released into Sea : విశాఖ జిల్లా అటవీ, పర్యావరణ శాఖ అధికారులు ఇవాళ ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించారు. 350 తాబేలు పిల్లల్ని..
Baby Turtles released into Sea : విశాఖ జిల్లా అటవీ, పర్యావరణ శాఖ అధికారులు ఇవాళ ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించారు. 350 తాబేలు పిల్లల్ని సముద్రంలోకి విడిచిపెట్టారు. అంతరించిపోతోన్న సముద్ర తాబేళ్ల సంపదను పరిరక్షించడంలో భాగంగా దేశవ్యాప్తంగా అటవీశాఖ కొన్నేళ్లుగా సముద్ర తాబేళ్ల పిల్లల్ని పరిరక్షించే బాధ్యతను భుజాన వేసుకుంది. ఈ క్రమంలో విశాఖపట్నం తీరంలో 50 వేలకు పైగా తాబేళ్ల గుడ్లు సేకరించారు. వాటిని సురక్షిత ప్రాంతంలో సంరక్షిస్తున్నారు. వీటిలో ఇప్పటివరకూ 5000 వేల గుడ్లు పొదగగా, వాటిని అంచెలంచలుగా సముద్రంలోకి వదులుతున్నారు.
సాధారణంగా సముద్రపు తాబేళ్లు డిసెంబరు నుంచి ఏప్రిల్ వరకు తీరానికి వచ్చి ఇసుకలో గుంత తవ్వి గుడ్లు పెట్టి కప్పి వెళుతుంటాయి. సుమారుగా ఒక్కొక్క తాబేలు 140 నుంచి 170 వరకు గుడ్లు పెడుతుంది. మనుష్యులు, కుక్కలు, పక్షుల నుంచి గుడ్లను పరిరక్షించే పనులను అటవీ శాఖ చేపట్టి, ఆ గుడ్లను సేకరించి కేంద్రంలో ఉంచి, అవి పొదిగిన అనంతరం పిల్లలను సముద్రంలోకి వదిలిపెడుతూ వస్తున్నారు. భారత దేశ వ్యాప్తంగా సముద్ర తీర రాష్ట్రాల్లో ఈ బృహత్తర కార్యక్రమం జరుగుతోంది. గతేడాది బీసెంట్ నగర్, పళవేర్కాడు, కోవలం సముద్రతీరాల్లో ఉన్న తాబేలు గుడ్ల పొదిగింపు కేంద్రాల నుంచి పొదిగిన 19 వేల తాబేలు పిల్లలను సముద్రంలో వదలిపెట్టారు.
#WATCH Andhra Pradesh’s Forest & Environment Department released over 350 baby turtles into the sea yesterday, in Visakhapatnam pic.twitter.com/rzWAc44GWL
— ANI (@ANI) March 25, 2021
Read also : Crime Complaint Centers : సైబర్ నేరాల ఫిర్యాదులు ఇప్పుడు మీ దగ్గర్లోని పోలీస్ స్టేషన్లలో చేసేయొచ్చిలా..!