ఉదయం 8.30 తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తే డయాబెటిస్ వస్తుందా ? అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే..
Type 2 diabetes: ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో సరైన సమయానికి ఆహారం తీసుకోకుండా.. అనారోగ్యాల పాలవుతుంటారు చాలామంది. ఇలా ఆహారాన్ని
Type 2 diabetes: ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో సరైన సమయానికి ఆహారం తీసుకోకుండా.. అనారోగ్యాల పాలవుతుంటారు చాలామంది. ఇలా ఆహారాన్ని అశ్రద్ద చేయడం.. అలాగే సరైన సమయంలో తీసుకోకపోవడం వలన అనారోగ్య సమస్యలే కాకుండా.. రక్తంలో చక్కెర స్థాయిలలో కూడా మార్పులు జరిగే అవకాశం ఉంది. తాజాగా ది ఎండోక్రైన్ సోసైటీ నుంచి వర్చువల్ కాన్ఫరెన్స్ అయిన ఎండో2021లోని ఓ అధ్యయనం ప్రకారం… ఉదయాన్నే తినడం వలన తక్కువ ఇన్సులిన్ రెసిస్టెంట్స్తోపాటు టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉన్నట్లు తేలింది.
ముఖ్యంగా ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ చేయడం వలన ఎన్నో ప్రయోజనాలున్నాయని నిపుణులు సూచిస్తున్నారు. ఎక్కువగా బ్రేక్ ఫాస్ట్ చేసే వారి రక్తంలో షూగర్ లెవల్స్, ఇన్సులిన్ రెసిస్టెంట్స్ సమానంగా ఉన్నాయని అధ్యయనంలో తేలింది. అలాగే వారు రోజులో 10 గంటలు ఏమి తినకుండా ఉన్నారా అనే దానిపై కూడా అధ్యయనం జరిపారు.
ఆరోగ్యం, పోషణపై జరిపిన జాతీయ స్థాయి సర్వేలో 10,575 వయోజన అమెరికన్లు .. రోజులో ఎక్కువగా భోజనం చేయకపోయినా.. వారి షూగర్ లెవల్స్, ఇన్సులిన్ లెవల్స్ పరీక్షించారు. అందులో వారు 10 గంటలు లేదా అంతకంటే తక్కువ సమయం ఏమి తినకుండా ఉండడం వలన వారిలో ఎక్కువగా ఇన్సులిన్ రెసిస్టెంట్స్ పై ప్రభావం ఉంటుందని తేలింది. అలాగే బ్లడ్లో షూగర్ లెవల్స్ని నియంత్రించే హార్మోన్ అయిన ఇన్సులిన్ పై ఏమి తినకుండా ఉండడం వలన ప్రభావం తక్కువగా ఉంటుంది. దీంతో వారికి టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఉదయం 8.30 గంటలకు ముందు భోజనం చేసిన వ్యక్తులు.. రోజులో సరిగా భోజనం చేయకపోయినా.. వారి ఇన్సులిన్ లెవల్స్ తక్కువగా ఉన్నట్లు తేలింద్. అంతేకాకుండా.. షూగర్ లెవల్స్ వలన భోజనంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఉదయం 8.30 గంటలకు బ్రేక్ ఫాస్ట్ చేసే వారిలో షూగర్ లెవల్స్ తక్కువగా ఉంటాయి. అలాగే ఉదయం అల్పాహారం చేయడం వలన వారు రోజంతా ఉత్సహంగా ఉంటారు. అందుకే ఉదయం అల్పాహారం చేయడం ఉత్తమం అని.. దీని వలన బరువు పెరగకుండా ఉంటారని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే అల్పాహరంలోకి వ్యర్థమైన ఆహార పదార్థాలు కాకుండా.. ప్రోటీన్స్, కొవ్వులు, ఫైబర్, ఐరన్ ఉండే ఆహారాలను సమాంగా తీసుకోవాలి. అలాగే పండ్లు, గింజలు, పెరుగు, కూరగాయలు, పిండి పదార్థాలు, గుడ్లు తీసుకోవచ్చు.
Also Read:
హోలీ వచ్చేస్తుంది.. ఎలాంటి డ్రెస్సులు ధరించాలని ఆలోచిస్తున్నారా ? అయితే మీకోసమే ఈ ఐడియాస్..