Kakarakaya Masala Curry: చేదు లేకుండా కాకరకాయ మసాలా కూర ఆంధ్రాస్టైల్ లో తయారీ.. ఎలా అంటే..!
కాకరకాయ దివ్య ఔషధంగా పనిచేస్తుంది. కాకరకాయలు ప్రధానంగా మధుమేహగ్రస్తులకు ఓ వరం అని చెప్పాలి. దీనిలో నీరు తక్కువ పౌష్టిక శక్తి ఎక్కువ. కనీసం పదిహేనురోజులకోసారైనా...
Kakarakaya Masala Curry: కాకరకాయ దివ్య ఔషధంగా పనిచేస్తుంది. కాకరకాయలు ప్రధానంగా మధుమేహగ్రస్తులకు ఓ వరం అని చెప్పాలి. దీనిలో నీరు తక్కువ పౌష్టిక శక్తి ఎక్కువ. కనీసం పదిహేనురోజులకోసారైనా కాకరకాయ తినాలని పెద్దలు అంటారు.. అయితే కాకరకాయతో పులుసు, వేపుడు, కూర చేస్తారు.. ఈరోజు హాట్ అండ్ స్పైసీగా ఆంధ్ర స్టైల్.. ప్రత్యేమైన మసాలా దినుసులతో.. కాకాయకాయ మసాలా కూర తయారీ విధానం తెలుసుకుందాం..!
కరకాయ మసాలా కూరకి కావలసిన పదార్ధాలు :
సన్నని కాకరకాయలు మజ్జిగ నూనె వేయించడానికి సరిపడా.. ఆవకాయలోని పిండి (ఆవాలు, మెంతులు, కారం కలిపిన పొడి) నువ్వుల పొడి జీలకర్ర పొడి వెల్లుల్లి రెబ్బలు పసుపు – పావుచెంచా ఉప్పు రుచికి తగినంత
తయారీ:
ముందుగా కాకరకాయల్ని నిలువుగా గాట్లు పెట్టి వాటిలోని గింజల్ని తీసేయాలి. ఈ కాయల్ని కుక్కర్‌లో తీసుకుని మజ్జిగా, కొద్దిగా ఉప్పూ వేసి సగం ఉడికించి తీసుకోవాలి. తరవాత కాసేపు ఎండలో ఆరబెడితే.. వాటిలోని తడి పూర్తిగా పోతుంది. ఇంతలో ఆవకాయ పిండిలో నువ్వుల పొడి, జీలకర్ర పొడి , వెల్లుల్లి రెబ్బలు కలుపుకుని స్టఫింగ్ కు రెడీ చేసుకోవాలీ. తర్వాత కాకరకాయల్లో స్టఫింగ్ పిండిని కురాలి.
ఇప్పుడు బాణలిలో నూనె వేడిచేసి కాకరకాయ ముక్కల్ని అందులో జాగ్రత్తగా ఉంచి, పసుపు వేసి వేయించాలి. మంట తగ్గించి మధ్యమధ్య కలుపుతూ ఉంటే కాసేపటికి ఎర్రగా వేగుతాయి. అంతే ఎంతో టేస్టీగా ఉండే మసాలా కాకరకాయ కూర రెడీ.. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది. వారం రోజుల పాటు నిల్వకూడా ఉంటుంది.
Also Read: కమెడియన్ సుధాకర్ తనయుడు బెన్ని టాలీవుడ్ లో ఎంట్రీ.. చిరంజీవిని కలిశా… అయితే..!