Snakes In Dreams: నిద్రలో పాములు కలలోకి వస్తున్నాయా..? వాటి ఫలితాలు ఏమిటో తెలుసా…?
పాములు అన్న ఆలోచనకూడా కొంతమంది వెన్నె వణికిస్తుంది. ముఖ్యంగా మహిళలు పాములను చూడడనికి కూడా ఇష్టపడరు.. అయితే తరచుగా పాములు కలలోకి వస్తే.. దానికి ఒక కారణం ఉందని...
Snakes in Dreams: పాములంటే భయపడనివారు ఎవరూ ఉండరు. పాములను నేరుగా చూస్తేనే కాదు..పాములకు సంబంధించిన ఆలోచన కూడా కొంతమంది వెన్నులో వణుకు పుట్టిస్తుంది. మరీ ముఖ్యంగా చిన్నారులు, మహిళలు పాములను చూడడనికి కూడా ఇష్టపడరు.. అయితే తరచుగా పాములు కలలోకి వస్తే.. దానికి ఒక కారణం ఉంటుందని చెబుతారు. పాములు కలలో కనిపించే విధానంతో మీ జీవితానికి ప్రాతినిధ్యం వహిస్తాయని ఫ్రాయిడియన్ విశ్లేషణ ద్వారా తెలుస్తోంది. సిగ్మండ్ ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ సిద్ధాంతం ప్రకారం… కలలో పాము కనిపించడం అనేది అణచివేసుకున్న ఆలోచనలు, లైంగిక శక్తి, శృంగారదాహాన్ని ప్రతిబింబిస్తుంది.
పాముల కలలోకి వస్తే.. దీనిపై ఒక్కొక్క రకమైన కలకు ఒక్కోలా వివరణ ఇచ్చింది. కొంతమంది అసలు కలలు ఆశలు నెరవేరక పోవడంతోనే వస్తాయని విశ్లేషకులు అంటారు. ఆయితే స్వప్నంలో పాములు కనిపిస్తే.. మంచిదని.. వారికీ అధిక సృజనాత్మక శక్తి ఉన్నట్లు గుర్తు అంటూ సర్పశాస్త్రంద్వారా తెలుస్తోంది. అయితే పాములు కలలోకి వచ్చిన తీరుతో వ్యక్తి భవిష్యత్ కూడా చెప్పవచ్చని కొందమంది అంటారు. అందుకనే పాము కలలో కనిపిస్తే ఏం జరుగుతుందో ఏమో చాలా మంది భయపడుతుంటారు.
నిజానికి మనకు కలలో పాము కనిపించి అది కాటు వేయడం.. రక్తం కనిపించడం జరిగితే ఏ సమస్యా ఉండదని సర్పశాస్త్రం చెబుతుంది. ఇక పాము కనుక కలలో కనిపించి మంచం మీద నుంచి మెల్లగా కిందకు జారుతుంటే.. ఆ వ్యక్తి కష్టాలు తీరి సుఖ సంతోషాలతో ఉంటారట.
అయితే పాములు కలలో కనిపించి అవి మిమ్మల్ని వెంటాడితే.. కష్టాలు, సమస్యలు తప్పవని .. అటువంటి కలకన్నవారు ఎటువంటి కష్టాలను ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నారు. పాములు కనుక మీ భుజం మీద ఉన్నట్లు కల వస్తే.. ఇది రెండు విషయాలను సూచిస్తుందట..మొదటి మీ జీవితంలో ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదని.. రెండోది మీకు తెల్సిన నిజాన్ని నమ్మకుండా.. మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటుంన్నారని అర్ధమట.
ఈస్ట్ కల్చర్ లో పాములను ఆధ్యాత్మికతకు ప్రతీకగా భావిస్తారు. దీంతో పాములు మీ కలలోకి వచ్చినట్లు అయితే.. మీ శరీరంలోని కుండలిని జాగృతం చేస్తుందట.. ముఖ్యంగా వెన్నెముక నుంచి శరీరంలోని తల వరకూ కుండలీ శక్తిని జాగృతం చేస్తుందని ఒక ఆధ్యాత్మిక నమ్మకం.
ఇవి కూడా చదవండి…గాలిలో వేలాడుతు భారీ పక్షిని పట్టుకున్న పాము.. ఒళ్ళు గగుర్లు పొడిచే వీడియో.. నెట్టింట వైరల్
దేశంలో అరుదైన హనుమాన్ ఆలయం.. ఆయన్ని పెళ్లికాని వారు పూజిస్తే.. వెంటనే పెళ్లి..!