గాలిలో వేలాడుతూ భారీ పక్షిని పట్టుకున్న పాము.. ఒళ్ళు గగుర్లు పొడిచే వీడియో.. నెట్టింట వైరల్

సోషల్ మీడియాలో నిత్యం జంతువులకు సంబంధించిన వీడియోలు చక్కర్లు కొడుతూనే ఉంటాయి. ఆకలి కోసం జంతువులు చేసే పోరాటం నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తుంది. దాంతో ఏదైనా జంతువు వేటాడితే వెంటనే ఆ వీడియో తీయడం

  • Rajeev Rayala
  • Publish Date - 6:44 pm, Mon, 12 April 21
గాలిలో వేలాడుతూ భారీ పక్షిని పట్టుకున్న పాము.. ఒళ్ళు గగుర్లు పొడిచే వీడియో.. నెట్టింట వైరల్
Snake Attack

Snake Attack: సోషల్ మీడియాలో నిత్యం జంతువులకు సంబంధించిన వీడియోలు చక్కర్లు కొడుతూనే ఉంటాయి. ఆకలి కోసం జంతువులు చేసే పోరాటం నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తుంది. దాంతో ఏదైనా జంతువు వేటాడితే వెంటనే ఆ వీడియో తీయడం సోషల్ మీడియాలో షేర్ చేయడం వంటివి చేస్తుంటారు. తాజాగా అలంటి వీడియోనే సోషల్ మీడియాలో ఇప్పుడు తారసపడింది. ఓ పాము గాలిలో వేలాడుతూ ఓ పక్షిని పట్టుకుంది. భూమిపైనున్న ప్రతిజీవి ఆహారం కోసం ఇతర ప్రాణుల పైనే ఆధారపడుతుంది. అందులో చిన్ని చీమలు మొదలు..అన్నింటిదీ ఒక్కటే జీవన్మరణ పోరాటం. ఇక్కడ ఓ భారీ విష సర్పం తనకు కనిపించిన ఆహారం దక్కించుకునేందుకు చేసిన సాహాసం ఇది..

ఎక్కడో ఆకాశంలో ఉన్నట్టుగా కిందకు వేలాడుతున్న ఈ భారీ విషసర్పం..తన కొరలతో ఓ కాకిని పట్టేసింది. పాము తోకను పైనున్న యాంటీనాకు చుట్టింది. గాల్లో వేలాడుతూ కాకిని పట్టుకుంది. కిందకు వేలాడుతూనే.. చాకచక్యంగా ఆ పక్షిని మొత్తం చుట్టేస్తూ…పైకి లాగేసుకుంది. ఇది గమనించిన స్థానికులు కొందరు ఇదంతా తమ సెల్‌ఫోన్లలో వీడియో తీశారు. సోషల్‌ మీడియాలో ఈ వీడియో పోస్ట్‌ చేయటంతో అది కాస్తా వైరల్‌గా మారింది. గాల్లో జరిగిన ఆకలి పోరాటం చూసిన నెటిజన్లు తమ దైన స్టైల్లో కామెంట్లు పెడుతున్నారు. ఒళ్ళు గగుర్లు పొడిచే ఈ వీడియో పై మీరు ఓ లుక్కేయండి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Poisonous Mushroom: ప్రపంచంలో ఇది అత్యంత విషపూరితమైన పుట్టగొడుగు.. దీన్ని తాకినా కూడా ఔట్

Owl Sneezing Video: గుడ్లగూబ ఎలా తుమ్ముతుందో ఎప్పుడైనా చూశారా? ఈ వైరల్ వీడియోలో జంతు ప్రపంచం గురించి తెలియని సంగతులు మీ కోసం

Megha Gas : తెలంగాణలో తొలిసారి మేఘా గ్యాస్‌ సేవలు, ఇక చౌక ధరలకే ఇంటి.. వాహన గ్యాస్‌.!