AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Poisonous Mushroom: ప్రపంచంలో ఇది అత్యంత విషపూరితమైన పుట్టగొడుగు.. దీన్ని తాకినా కూడా ఔట్

పుట్టగొడుగు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. పుట్టగొడుగులో చాలా పోషకమైన పదార్థాలు ఉన్నాయి. పుట్టగొడుగులను తింటే మన శరీరానికి పోషణ లభిస్తుంది.

Poisonous Mushroom: ప్రపంచంలో ఇది అత్యంత విషపూరితమైన పుట్టగొడుగు.. దీన్ని తాకినా కూడా ఔట్
Poisonous Mushroom
Ram Naramaneni
|

Updated on: Apr 12, 2021 | 1:32 PM

Share

పుట్టగొడుగు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. పుట్టగొడుగులో చాలా పోషకమైన పదార్థాలు ఉన్నాయి. పుట్టగొడుగులను తింటే మన శరీరానికి పోషణ లభిస్తుంది. ఇందులో చాలా ముఖ్యమైన ఖనిజాలు,  విటమిన్లు ఉన్నాయి. అలాగే, దీనిలో ఫైబర్ కంటెంట్ కూడా పుష్కలంగా ఉంటుంది. అయితే, అన్ని రకాల పుట్టగొడుగులు తినదగినవి కావు. కొన్ని విషపూరితమైనవి ఉన్నాయి. వాటిని తాకినా కూడా అనారోగ్యానికి గురవుతారు.

పాయిజన్ ఫైర్ కోరల్ అనే విషపూరిత పుట్టగొడుగులను గతంలో శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్, జపాన్, కొరియాలో కనుగొనబడిన ఈ పుట్టగొడుగులు చాలా ప్రమాదకరమైనవి, విషపూరితమైనవి. ఈ ఎరుపు రంగు పుట్టగొడుగు తినడం విషయం పక్కనబెట్టండి… దాన్ని తాకినా కూడా మీరు అనారోగ్యానికి గురవుతారు. ఈ విష పుట్టగొడుగును చైనాలో 1895 లో మొదటిసారి కనుగొన్నారు. దీని శాస్త్రీయ నామం పోడోస్ట్రోమా కార్ను-డామా. నివేదికల ప్రకారం, ఇండోనేషియా, పాపువా న్యూ గినియాలో కూడా ఈ రకం పుట్టగొడుగు కనిపించింది.

శాస్త్రవేత్తల పలు అధ్యయనాలు చేసి.. ఈ పుట్టగొడుగు చాలా విషపూరితమైనదిగా గుర్తించారు. దీనిని తినడం వల్ల అవయవ పనితీరు ఆగిపోతుందని, మెదడును కూడా దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. ఈ పుట్టగొడుగును తాకడం వల్ల శరీరంలో వాపు వస్తుందని గుర్తించారు. దీని విషం చర్మం ద్వారా శరీరమంతా వ్యాపిస్తుందని వెల్లడించారు. పుట్టగొడుగు అనేది ఒక రకమైన ఫంగస్. ఇది వర్షపు రోజులలో కుళ్ళిన సేంద్రియ నేలపై పెరుగుతుంది. ఇదండి విషయం.. కాబట్టి పుట్టుగొడుగు కనిపించగానే.. ఈ రోజు కూరకు ఢోకా లేదని అనుకోకండి. కాస్త తెలుసుకుని మసలుకోండి.

Also Read: కాబోయే వాడ్ని కలవడానికి రాత్రి పూట వెళ్లింది… గడ్డి కుప్పలో శవమై తేలింది.. అసలు ఏం జరిగిందంటే..

66 ఏళ్ల వయసులో కూడా ఏంటీ ఎనర్జీ. ఏంటీ గ్రేస్.. నెట్టింట వైరల్‌గా మారిన రేఖ డ్యాన్స్ వీడియో