- Telugu News Telangana Megha city gas station launched in nalgonda domestic and vehicle gas price now in cheap in telangana photo story
Megha Gas : తెలంగాణలో తొలిసారి మేఘా గ్యాస్ సేవలు, ఇక చౌక ధరలకే ఇంటి.. వాహన గ్యాస్.!
MEGHA city gas station : మధ్యతరగతి ప్రజలకు మేఘా సంస్థ ఊరటనిస్తోంది. తెలంగాణలోని నల్గొండ జిల్లాలో తొలిసారిగా 'మేఘా గ్యాస్' పేరుతో తన సేవలను ప్రారంభిస్తోంది.
Updated on: Apr 11, 2021 | 11:33 PM

మేఘా ఇంజనీరింగ్ తెలంగాణాలోని నల్గొండ జిల్లాలో గ్యాస్ పైప్ లైన్, సిటీ గేట్ స్టేషన్ పనులను గడువులోగా పూర్తి చేసింది. ఇక, నల్గొండ ప్రజలకు ' మేఘా గ్యాస్' కింద గ్యాస్ సరఫరా సేవలను ప్రారంభించి చౌక ధరలకు అందించడం వినియోగదారులకు ఒక తీపివార్త.


మేఘా ఇంజినీరింగ్, నల్గొండ ప్రజల అవసరాల దృష్ట్యా గ్యాస్‌ని దేశంలోని వివిధ ప్రాంతాల నుండి తీసుకొని నల్గొండ జిల్లాలోని సిటీ గేట్ స్టేషన్ ద్వారా పీఎన్జీ PNG(పైప్డ్ నేచురల్ గ్యాస్) గృహ, పారిశ్రామిక అవసరాలకు, అలాగే మదర్ స్టేషన్ ద్వారా సీఎన్జీ CNG(కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్) ని వాహన అవసరాల కోసం అందుబాటులోకి తీసుకువస్తోంది.

ఈ ప్రాజెక్ట్ లో భాగంగా ఇప్పటికే 32 కిలో మీటర్లు స్టీల్ పైప్ లైన్ వేయగా, మరో 80 కిలోమీటర్ల పైప్ లైన్ పనులు కొనసాగుతున్నాయి. 40 వేల కుటుంబాలకు, పరిశ్రమలకు గ్యాస్ సరఫరా చేసే ఉద్దేశ్యంతో ఇంకా 500 కిలో మీటర్ల పొడవు గల ఎండీపీఈ (MPDE)పైప్ లైన్ నిర్మాణం చేపడుతోంది.

అంతే కాకుండా మేఘా సంస్థ నల్గొండ జిల్లాలో బిబినగర్, భువనగిరి, చౌటుప్పల్, చిట్యాల, నల్గొండ, నకిరేకల్, మిర్యాలగూడ, మల్లేపల్లి, సూర్యాపేట, ఇంకా.. కోదాడలలో 10 సీఎన్జీ (CNG)స్టేషన్లు నిర్మిస్తున్నారు. సీజీడీ (CGD)ప్రాజెక్టులో భాగంగా ఇంటింటికీ గ్యాస్ సరఫరా చేయడానికి నల్గొండతో పాటు రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో పైప్ లైన్ నిర్మాణం తోపాటు 20 సీఎన్జీ (CNG)స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు.



