5

KTR Warangal Tour : టీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ ఓరుగల్లు పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు, టూర్‌ వెనుక ఆంతర్యం?

KCR Warangal Tour Strategy : అధికార పార్టీ మున్సిపల్ ఎన్నికలపై అప్పుడే ఫోకస్‌ పెట్టిందా ? విపక్షాలకు

KTR Warangal Tour : టీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ ఓరుగల్లు పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు, టూర్‌ వెనుక  ఆంతర్యం?
Ktr
Follow us

|

Updated on: Apr 11, 2021 | 10:01 PM

KCR Warangal Tour Strategy : అధికార పార్టీ మున్సిపల్ ఎన్నికలపై అప్పుడే ఫోకస్‌ పెట్టిందా ? విపక్షాలకు ఛాన్సు లేకుండా ముందుగానే వ్యూహాత్మక ప్రణాళిక రచిస్తోందా ? వర్కింగ్‌ ప్రెసిడెంట్ ఓరుగల్లు పర్యటన వెనుక ఆంతర్యం ఏమిటి ? అనే అనుమానాలే ఇప్పుడు కలుగుతున్నాయి. అంతా సాగర్‌ ఉపఎన్నికపై ఫోకస్ పెడితే…టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం వరంగల్‌ పర్యటనకు సిద్ధమయ్యారు. ఒక్కరోజు టూర్‌లో భాగంగా ఆయన నగరంలోని 66డివిజన్లలో పర్యటించనున్నారు. GWMC పరిధిలో 1700 కోట్ల రూపాయల నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సంబంధించి శంకుస్థాపనలు , ప్రారంభోత్సవాలు చేయనున్నారు కేటీఆర్‌.

మిషన్ భగీరథ ద్వారా నగర ప్రజలకు రోజు తాగునీరు అందించే కార్యక్రమాన్ని రాంపూర్ దగ్గర కేటీఆర్‌ ప్రారంభిస్తారు కేటీఆర్. దీంతో పాటే వరంగల్ తూర్పు నియోజక వర్గంలో జర్నలిస్ట్ మోడల్ కాలనీకి శంకుస్థాపన ఆయన చేస్తారు. KTR పర్యటన నేపథ్యంలో వరంగల్ మహా నగరంలో జంక్షన్లను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఏర్పాట్లను జిల్లాకు చెందిన మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

ఇక, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలతో పాటు పలు మున్సిపాలిటీలకు కొద్దిరోజుల్లో నగారా మోగనుంది. ఇందులో భాగంగానే మంత్రి కేటీఆర్ వరంగల్‌ టూర్‌ నుంచి ఎన్నికల కార్యాచరణ మొదలు పెట్టినట్లుగా కనిపిస్తోంది. సిద్దిపేట్,అచ్చంపేటతో పాటు మరికొన్ని మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనుండటంతో 14న అచ్చంపేటలో పర్యటించనున్నారు. ఇక్కడ 20కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. గతంలో వచ్చిన ఫలితాలే మళ్లీ TRSకి దక్కాలన్న వ్యూహంలో భాగంగానే ఈ టూర్‌ లక్ష్యంగా కనిపిస్తోంది. మొత్తం మీద సాగర్ ఉప ఎన్నికల విజయానికి మంత్రులు, ఎమ్మెల్యేలు నిమగ్నమైతే.. కేటీఆర్ మాత్రం సేమ్ టైమ్ మున్సిపల్ ఎన్నికల్లో విజయం కోసం రంగంలోకి దిగినట్లుగా కనిపిస్తోంది.

Read also : కారులో కరెన్సీ కట్టలను కాల్చుకున్న చరిత్ర మాది కాదు : టీవీ9 కిచ్చిన ఇంటర్వూలో మంత్రి జగదీష్ రెడ్డి

ఆ విషయంలో నెంబర్ వన్‏గా సామ్ రికార్డ్.. నెట్టింట సమంత సంబరాలు..
ఆ విషయంలో నెంబర్ వన్‏గా సామ్ రికార్డ్.. నెట్టింట సమంత సంబరాలు..
రికార్టు సృష్టించిన అమెరికా ఎంబసీ.. ఈ ఏడాది 10 లక్షల వీసాలు జారీ
రికార్టు సృష్టించిన అమెరికా ఎంబసీ.. ఈ ఏడాది 10 లక్షల వీసాలు జారీ
మీరు డయాబెటిస్‌తో బాధపడుతున్నారా.?
మీరు డయాబెటిస్‌తో బాధపడుతున్నారా.?
ఐటెల్ నుంచి ఒకే రోజు రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ల విడుదల
ఐటెల్ నుంచి ఒకే రోజు రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ల విడుదల
ఈ ఫార్ములాతో ఎవరైనా కోటీశ్వరులు కావొచ్చు.. నమ్మలేకపోతున్నారా..
ఈ ఫార్ములాతో ఎవరైనా కోటీశ్వరులు కావొచ్చు.. నమ్మలేకపోతున్నారా..
నాలుగో పవరాస్త్ర కోసం సిత్ర విచిత్రాలు.. కంటెస్టెంట్స్ వేషాలు..
నాలుగో పవరాస్త్ర కోసం సిత్ర విచిత్రాలు.. కంటెస్టెంట్స్ వేషాలు..
భారత్‌ వృద్ధుల దేశంగా మారుతోందా? యువ జనాభా ఎందుకు తగ్గుతుంది?
భారత్‌ వృద్ధుల దేశంగా మారుతోందా? యువ జనాభా ఎందుకు తగ్గుతుంది?
ఈ బాలీవుడ్ చాక్లెట్‌ బాయ్‌కు ఎన్ని కోట్ల ఆస్తులున్నాయో తెలుసా?
ఈ బాలీవుడ్ చాక్లెట్‌ బాయ్‌కు ఎన్ని కోట్ల ఆస్తులున్నాయో తెలుసా?
నైరుతి దిశలో ఈ వస్తువులు పెడుతున్నారా.?
నైరుతి దిశలో ఈ వస్తువులు పెడుతున్నారా.?
NDA Alliance: మిత్రులను కోల్పోతున్న ఎన్డీఏ.. దేనికి సంకేతం?
NDA Alliance: మిత్రులను కోల్పోతున్న ఎన్డీఏ.. దేనికి సంకేతం?