#AskKTR : ట్విట్టర్లో కేటీఆర్ ఇప్పుడు రెడీ, మీ సమస్యలు, ప్రశ్నలు ఏమైనా ఉంటే అడిగేయొచ్చు.. కమాన్..!
Alright, I am here guys. Let’s start Ask KTR : తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో లైన్లో ఉన్నారు...
Alright, I am here guys. Let’s start Ask KTR : తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో లైన్లో ఉన్నారు. తెలంగాణ, హైదరాబాద్ ప్రజల సమస్యలు వింటున్నారు. పరిష్కార మార్గాలు చూపిస్తున్నారు. నేను ఇక్కడే ఉన్నా గైస్.. అడగడం మొదలుపెట్టండి అంటూ కేటీఆర్ ఇచ్చిన పిలుపుకు నెట్టింట్లో నెటిజన్లు ప్రశ్నల పరంపర కొనసాగిస్తున్నారు. సమస్యలేమైనా ఉంటే మీరూ అడిగేయొచ్చు..
Alright, I am here guys. Let’s start #AskKTR
— KTR (@KTRTRS) April 11, 2021
సార్ నమస్కారం మేము TS SSA లో కళా వృత్తి వ్యాయామ ఉపాధ్యాయులo గత సంవత్సర కాలం నుండి మాకు జీతాలు లేవు రీ ఎంగేజ్ లేదు .చాలా మంది ఉపాధ్యాయులు కులీ పనులుచేకుంటు హత్మ హత్యలకు పాల్పడుతున్నారు . కళల తెలంగాణలో కళలకు ప్రోత్సాహం లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మా 2500మంది బ్రతుకులు ఎలా?
— Chinna Narasimhulu (@ChinnaN23203553) April 11, 2021
సర్. నేను రోజూ డ్యూటీ కి వెళ్తున్నపుడు చూస్తున్న హరితహారం చెట్లు విద్యుత్ లైన్ కింద పెడుతున్నారు. విద్యుత్ శాఖ వాళ్ళు ఆ చెట్లు కొడుతున్నారు. కొన్ని చోట్ల సరిగ్గా హరిత హారం చెట్ల పైన కొత్త విద్యుత్ లైన్ వేస్తున్నారు దాని కోసం విద్యుత్ శాఖ చెట్లను తొలగిస్తుంది. Plz slv this prblm
— Shyam Sunder (@ShyamSu82084607) April 11, 2021
మా విలేజ్ కి రోడ్ సౌకర్యం లేదు, రాత్రి టైమ్ లో పరిస్థితి చాలా ఘోరం, దయచేసి మా విలేజ్ కి రోడ్ సౌకర్యం కల్పించండి. అంబులెన్స్ కూడా రాని పరిస్థితి. యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల్, ఉత్తటుర్ విలేజ్. pic.twitter.com/Sp2bn1NuhF
— Krishna Ponugoti (@PonugotiKrishna) April 11, 2021