Telangana Politics: మాజీ మంత్రిపై సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ సోయం బాపూరావు..
Telangana Politics: తెలంగాణ మాజీ మంత్రి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నపై బీజేపీ ఎంపీ సోయం బాపూరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
Telangana Politics: తెలంగాణ మాజీ మంత్రి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నపై బీజేపీ ఎంపీ సోయం బాపూరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే జోగు రామన్న పెద్ద అవినీతి పరుడు అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. గతంలో రాష్ట్ర అటవీశాఖ మంత్రిగా పని చేసిన సమయంలో ప్రజల సోమ్మును అడ్డగోలుగా దోచుకున్నారని ఆరోపించారు. అభివృద్ధి పేరిట కోట్లాది రూపాయలు దోచుకోవడమే కాకుండా జిల్లా ప్రజలను దారుణంగా మోసం చేశారని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. నిజాలు మాట్లాడితే తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఎంపీ సోయం బాపూరావు ఆరోపించారు. ‘సోయం బాపూరావును అది చేస్తాం.. ఇది చేస్తాం.. అని చూస్తే అడ్రస్ లేకుండా పోతారు’ అంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ‘నేను మావోయిస్టులకే భయపడలేదు.. నీకు భయపడతుతానా?’ అంటూ ఎమ్మెల్యే జోగు రామన్నకు ఎంపీ సోయం బాపూరావు వార్నింగ్ ఇచ్చారు. సోయం బాపురావు దండు కదిలితే ఎమ్మెల్యే జోగు రామన్న అడ్రస్ లేకుండా పోతారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికైనా ఆదివాసీల అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. లేదంటే జోగు రామన్న కథ కంచికే చేరుతుందంటూ తీవ్ర హచ్చరికలు చేశారు ఎంపీ సోయం బాపురావు.
ఇదిలాఉంటే.. ఎంపీ సోయం బాపురావు వ్యాఖ్యలు ఆదిలాబాద్‌లో పొలిటికల్ హీట్‌ను అమాంతం పెంచాయి. ఆయన చేసిన వ్యాఖ్యలపై జోగు రామన్న అనుచరులు భగ్గుమంటున్నారు. బాపురావు తన నోటిని అదుపులో పెట్టుకోవాలని హెచ్చరిస్తున్నారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. ఇక బాపురావు దూకుడు ఇప్పడే కొత్త కాదు. గతంలో కూడా ఆయన తన నోటికి పని చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆయన వ్యాఖ్యలతో పెను దుమారం రేగిన సందర్భాలు కోకొల్లలు అనే చెప్పాలి. ఎన్నోసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన జోగు రామన్న టార్గెట్‌గా విరుచుకుపడ్డారు.
Also read:
భార్య కోసం సెల్ టవర్ ఎక్కాడు.. నాలుగు గంటలపాటు పోలీసులకు చుక్కలు చూపించాడు.. చివరికి ఏం చేశాడంటే..