భార్య కోసం సెల్ టవర్ ఎక్కాడు.. నాలుగు గంటలపాటు పోలీసులకు చుక్కలు చూపించాడు.. చివరికి ఏం చేశాడంటే..

Man Climbs Cell Tower: మంచిర్యాలలో తన భార్య కాపురానికి రావడం లేదని ఆరోపిస్తూ ఓ వ్యక్తి హల్‌చల్ చేశాడు. ఏకంగా సెల్ టవర్‌ ఎక్కి..

  • Shiva Prajapati
  • Publish Date - 7:23 pm, Sun, 11 April 21
భార్య కోసం సెల్ టవర్ ఎక్కాడు.. నాలుగు గంటలపాటు పోలీసులకు చుక్కలు చూపించాడు.. చివరికి ఏం చేశాడంటే..
Cell Tower

Man Climbs Cell Tower: మంచిర్యాలలో తన భార్య కాపురానికి రావడం లేదని ఆరోపిస్తూ ఓ వ్యక్తి హల్‌చల్ చేశాడు. ఏకంగా సెల్ టవర్‌ ఎక్కి.. అందరినీ హడలెత్తించాడు. వివరాల్లోకెళితే.. సురేషన్ అనే వ్యక్తి తన భార్య కాపురానికి రావడం లేదని మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయం ఆవరణంలో గల సెల్ టవర్‌పైకి ఎక్కాడు. భార్య వస్తేనే కిందకు దిగుతానని, లేదంటే కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో అలర్ట్ అయిన బీఎస్ఎన్‌ అధికారులు.. పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. సురేష్‌తో సంప్రదింపులు జరిపారు. అతనికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా వినకపోగా.. భార్య వస్తేనే టవర్ దిగుతానంటూ పైనే భీష్మించుకు కూర్చున్నాడు. దీంతో పోలీసులు సురేష్ భార్యను ఫోన్‌లో సంప్రదించారు. సురేష్ పరిస్థితిని ఆమెకు వివరించారు. సురేష్ భార్య నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. తాను రానని తెగేసి చెప్పింది. దాంతో పోలీసులకు ఏం చేయాలో అర్థం కాలేదు. చివరికి బాధితుడు సురేష్‌కు న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. ఇలా అతన్ని కిందకు దించేందుకు నాలుగు గంటల పాటు పోలీసులు, అధికారులు శ్రమించారు. చివరికి పోలీసుల హామీని విశ్వసించిన సురేష్ సెల్ టవర్ పైనుంచి కిందకు దిగాడు. దాంతో పోలీసులు, అధికారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

హైదరాబాద్‌లోని హయత్ నగర్‌కు చెందిన సురేష్‌కు కొంతకాలం క్రితం వివాహం అయ్యింది. వారికి పిల్లలు కూడా ఉన్నారు. అయితే, కుటుంబ ఘర్షణల నేపథ్యంలో కొన్ని రోజుల క్రితం సురేష్ భార్య.. తన పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి సురేష్ వద్దకు వచ్చేది లేదని తేల్చి చెబుతోంది. సురేష్ అత్తమామలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే సురేష్ ఇవాళ మంచిర్యాలలోని తన భార్య ఇంటికి వెళ్లాడు. ఇంటికి రావాల్సిందిగా కోరాడు. కానీ, సురేష్ ససెమిరా అని తేల్చి చెప్పింది. దాంతో సురేష్ సెల్‌టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు పాల్పడ్డాడు. చివరికి అతను సెల్‌టవర్ దిగి కిందకు రావడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అతనికి కౌన్సిలింగ్ ఇచ్చారు.

Also read:

బేలూరు చెన్న కేశవ దేవాలయనికి ఎన్ని ప్రత్యేకతలో.. ఆలయ కట్టడం అద్భుతమే.. చూడటానికి రెండు కళ్ళు సరిపోవు..

Old Treasure: ఆ ప్రాచీన మఠంలో రహస్య గదులు..అమూల్యమైన సొత్తు..పదేళ్ల తరువాత మళ్ళీ వెలుగులోకి.. ఎక్కడంటే..