Old Treasure: ఆ ప్రాచీన మఠంలో రహస్య గదులు..అమూల్యమైన సొత్తు..పదేళ్ల తరువాత మళ్ళీ వెలుగులోకి.. ఎక్కడంటే..

ఓడిశాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం పూరీలో ఉన్న ఎమ్మార్ మఠంలో ప్రాచీన సొత్తు బయటపడింది.

Old Treasure: ఆ ప్రాచీన మఠంలో రహస్య గదులు..అమూల్యమైన సొత్తు..పదేళ్ల తరువాత మళ్ళీ వెలుగులోకి.. ఎక్కడంటే..
Old Treasure
Follow us
KVD Varma

|

Updated on: Apr 11, 2021 | 7:14 PM

Old Treasure:  ఓడిశాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం పూరీలో ఉన్న ఎమ్మార్ మఠంలో ప్రాచీన సొత్తు బయటపడింది. సరిగ్గా పదేళ్ల క్రితం అంటే 2011లో ఇక్కడ 522 వెండి ఇటుకలు బయట పడ్డాయి. ఆ సమయంలో ఈ మతంలో ప్రాచీన సొత్తు ఉంటుందనే ఊహాగానాలు వెల్లువెత్తాయి. ఈ మఠానికి సంబంధించి గతంలో ఉన్న మహంత ఆధిపత్యం రద్దు చేసి ట్రస్టు బోర్డు ఏర్పాటు చేశారు. ఈ బోర్డు బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా మఠంలోని గదులు పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం మఠం 4వ నంబరు గది తెరవడంతో ప్రాచీన కాంస్య ఆవు, దూడ విగ్రహం.. దీంతో పాటు 16 పురాతన కత్తులు, వెండి ఇటుకలు, ఆభరణాలు, వంటపాత్రలు బయటపడ్డాయి. ఈ ఆవుదూడల కాంస్య విగ్రహాన్ని అప్పట్లో ఝులన్ జాతర లో వినియోగించి ఉంటారని భావిస్తున్నారు. శ్రీ మందిరం దగ్గరలోని ఈ ఎమ్మార్ మఠం చాలా పురాతనమైనదిగా చెబుతారు. 12వ శతాబ్దంలో సంత్ రామానుజాచార్య వచ్చిన సందర్భంగా ఈ మఠాన్ని నిర్మించినట్లు భావిస్తున్నారు. 1866లో సంభవించిన కరువు కాటకాల సమయంలో ఈ మఠం ప్రజలకు ఎంతో సేవ చేసినట్టు చెప్పుకుంటారు.

శ్రీ మందిరం నలు వైపుల ఆధునికీకరణ పురస్కరించుకుని ఈ మఠం తొలగించేందుకు పూరీ జిల్లా యంత్రాంగం పనులు మొదలు పెట్టింది. 2019వ సంవత్సరంలో ఈ పనులకు ప్రారంభించారు. ప్రాథమిక తొలగింపు పనుల్లో రహస్య గదుల ఆనవాళ్లు బయటపడ్డాయి. ఈ గదుల్లో గుప్తనిధి ఉండవచ్చన్న అనుమానాలు బలపడ్డాయి.

అప్పట్లో మఠంలోని రెండు గదుల మరమ్మతు కోసం పనులు చేస్తుండగా చెక్కపెట్టెల్లో 522 వెండి ఇటుకలు లభించాయి. ఈ ఇటుకలను కాంట్రాక్టర్‌ ఈ ఇటుకలను దొంగతనంగా కటక్‌ నగరంలో విక్రయించడంతో అవి ఢెంకనాల్‌కు తరలిపోయాయి. దీంతో పోలీసులు ఈ కేసులో మఠం నిర్వాహకుడు మహంత రాజగోపాల్, అయన అనుచరులను అరెస్టు చేశారు. ఇటీవల ఈ మఠానికి బోర్డును ఏర్పాటు చేశారు. ఆ బోర్డు బాధ్యతలు స్వీకరించే తరుణంలో ఇప్పుడు సొత్తు లభించడం విశేషం.

Also Read: Power Cut to Police Station: మాస్క్ ధరించలేదని ఫైన్ వేసిన పోలీస్.. గంటలోపే ఊహించని షాక్ ఇచ్చిన విద్యుత్ ఉద్యోగులు..

Politics: వారసత్వ రాజకీయాలు లేకుండా యువత రాణిస్తుందా? ప్రస్తుతం ఇండియాలో రాజకీయాల్లో రాణిస్తున్న యువత పూర్తి వివరాలు ఇవిగో..