Politics: వారసత్వ రాజకీయాలు లేకుండా యువత రాణిస్తుందా? ప్రస్తుతం ఇండియాలో రాజకీయాల్లో రాణిస్తున్న యువత పూర్తి వివరాలు ఇవిగో..

భారతదేశంలో వారసత్వం ఊసు లేకుండా ఏ రంగమూ ఉండదు. మరీ ముఖ్యంగా సినిమాలు.. రాజకీయాలు. ఇక్కడ వారసులకు ప్రధమ తాంబూలం దక్కుతుంది. ప్రజలు కూడా సాధారణంగా వారసులకు పట్టం కట్టేందుకే ఇష్టపడతారు.

Politics: వారసత్వ రాజకీయాలు లేకుండా యువత రాణిస్తుందా? ప్రస్తుతం ఇండియాలో రాజకీయాల్లో రాణిస్తున్న యువత పూర్తి వివరాలు ఇవిగో..
Politics
Follow us
KVD Varma

|

Updated on: Apr 11, 2021 | 4:30 PM

Politics:  భారతదేశంలో వారసత్వం ఊసు లేకుండా ఏ రంగమూ ఉండదు. మరీ ముఖ్యంగా సినిమాలు.. రాజకీయాలు. ఇక్కడ వారసులకు ప్రధమ తాంబూలం దక్కుతుంది. ప్రజలు కూడా సాధారణంగా వారసులకు పట్టం కట్టేందుకే ఇష్టపడతారు. అక్కడక్కడా వారసత్వం ఊసు లేకుండా పైకి వచ్చినవారూ ఉంటారు. అయితే, వేళ్ళతో లెక్కించదగ్గ స్థాయిలోనే. రాజకీయాల్లో సాధారణంగా తరాలకు తరాలు వారసులుగా పీఠం ఎక్కడం జరుగుతూనే ఉంటుంది. ఈ వారసత్వ రాజకీయాల మధ్యలో బతికి బట్టకట్టడమే మామూలు వ్యక్తులకు కష్టం. అటువంటిది వారసత్వం ఊసే లేకుండా..తమ సొంత ప్రతిభతో ఎదిగిన వారూ కొందరు ఉన్నారు. సీఎంల కుమారులు అదే సీటు కోసం ఎదురు చూస్తుండం ఇండియాలో మాములు విషయమే. అఖిలేష్ యాదవ్, నవీన్ పట్నాయక్, వైఎస్ జగన్, మెహబూబా ముప్తీ, కుమారస్వామి, కొనరాడ్ సంగ్మా, హేమంత్ సోరోన్ వంటి వారు అలా వచ్చిన వాళ్లే.

కానీ, భారత రాజకీయాల్లో మిరుగుడు దీపంలా ఎక్కడో ఒక చోట సొంతంగా ఎదిగి రాజకీయాల్లో రాణిస్తున్న వారు లేకపోలేదు. తమ తెలివి తేటలు, చొరవ, శక్తి సామర్థ్యాలు ఛరిష్మాతో రాణిస్తున్న హార్థిక్ పటేల్, కేజ్రీవాల్, ఆర్య రాజేంద్రన్, గోవా సిఎం ప్రమోద్ సావంత్ వంటి యువ కిశోరాలు తక్కువ మందే ఉన్నారనేది వాస్తవం. భారతదేశంలో యువతీయువకులు( 18 నుంచి 25 ఏళ్లు) 60 కోట్ల మంది ఉన్నారు. వీరిలో 2019 లోక్ సభ ఎన్నికల్లో తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి రిజిస్టర్ చేసుకున్న వారి సంఖ్య 1.50 కోట్లు. అయితే, దేశ రాజకీయాల్లో రాణించే శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ- ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఈ యువతకు దక్కడం లేదు. కేరళలోని తిరువనంతపురం మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌గా ఎన్నికైన 21 ఏళ్ల ఆర్య రాజేంద్రన్‌ ఎన్నికయ్యారు. దేశంలోనే అతి పిన్నవయసులో మేయర్‌గా ఎన్నికైన తొలి మహిళగా ఆర్య రాజేంద్రన్ రికార్డు సృష్టించారు. గతంలో 23 ఏళ్ల వయసులో కేరళలోని కొల్లాం మేయర్‌గా ఎన్నికైన సబితా బీగం రికార్డును తిరగరాశారు ఆర్య రాజేంద్రన్. అంతకు ముందు 1997లో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ 27 ఏళ్లకే నాగ్‌పుర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సందర్భంలో డేటా ఇంటెలిజన్స్‌ యూనిట్‌ 2019 నివేదిక ప్రకారం అసలు ఇండియాలో యువకులు వారసత్వం లేకుండా ఎక్కడెక్కడ పోటీ చేశారు? ఎంతమంది గెలిచారు అనేది పరిశీలిస్తే..

2019 లోక్ సభ ఎన్నికల్లో చిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలనుంచి పోటీచేసిన అభ్యర్థుల్లో చాలామంది 40 ఏళ్ల కంటే తక్కువ వయసువారేనని వెల్లడి. పోటీచేసిన వారిలో యువత శాతం..

దాద్రా నగర్‌ హవేలిలో 64శాతం సిక్కింలో 55 శాతం గోవా, లక్షద్వీప్‌, నాగాలాండ్‌లలో 50 శాతం చొప్పున పోటీ తెలంగాణలో 45శాతం ఝార్ఖండ్‌లో 39శాతం హరియాణాలో 36శాతం గుజరాత్‌, తమిళనాడులలో 38శాతం చొప్పున పోటీ 40ఏళ్ల లోపువారిలో ఎక్కువశాతం స్వతంత్ర అభ్యర్థులే కావడం గమనార్హం.

పార్టీల వారీగా చూస్తే..

యువతకు టికెట్ ఇచ్చిన శాతాలు ఇలా… 60 ఏళ్లు పైబడిన వారి శాతం టీడీపీ.. 52 శాతం జేడీ(యు).. 42 శాతం తృణమూల్ కాంగ్రెస్.. 39 శాతం కాంగ్రెస్… 38 శాతం బీజేపీ— 32 శాతం 2014 లోక్ సభ ఎన్నికలతో పోలిస్తే..

2019లో బీజేపీ, కాంగ్రెస్ పోటీల నుంచి పోటీచేసిన అభ్యర్థుల్లో యువ అభ్యర్థుల సంఖ్య మూడు రెట్లు పెరిగింది

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో..

25 నుంచి 40 ఏళ్ల మధ్య వారిని అభ్యర్థులుగా నిలిపిన పార్టీలు ఆంధ్రప్రదేశ్.. 19 శాతం ఒడిశా.. 16 శాతం మహారాష్ట్ర 15 శాతం బీహార్… 14 శాతం ఝార్ఖండ్ 13 శాతం హర్యానా 11 శాతం

2019( 17వలోక్ సభ) ఎన్నికల్లో గెలిచిన సభ్యులు వయసు వారీగా వర్గీకరణ..

25 నుంచి 30 వయస్సున్న లోక్ సభ సభ్యుల్లో 4 మంది 31 నుంచి 35 వయస్సున్న లోక్ సభ సభ్యులు 17 మంది 36 నుంచి 40 వయస్సున్న లోక్ సభ సభ్యులు 34 మంది 41 నుంచి 50 వయస్సున్న లోక్ సభ సభ్యులు 106 మంది 51 నుంచి 60 వయస్సున్న లోక్ సభ సభ్యులు 175 మంది 61 నుంచి 80 వయస్సున్న లోక్ సభ సభ్యులు 193 మంది 81 నుంచి 95 వయస్సున్న లోక్ సభ సభ్యులు 5 మంది మొత్తం 534 మంది సభ్యులు

పార్టీల వారీగా సభ్యులు

25 నుంచి 30 వయస్సున్న లోక్ సభ సభ్యులు 4 బీజేడీ 1 వైసీపీ 1 బీజేపీ 1 జేడీ(ఎస్) 1 31 నుంచి 35 వయస్సున్న లోక్ సభ సభ్యులు 17 బీజేపీ 8 కాంగ్రెస్ 1 తృణమూల్ కాంగ్రెస్ 3 టీడీపీ 1 ఎల్ జేఎస్ పీ 1 ఎస్ కేఎం 1 శివసేన 1 స్వతంత్రులు.. 1

36 నుంచి 40 వయస్సున్న లోక్ సభ సభ్యులు 34 బీజేపీ 10 కాంగ్రెస్ 5 వైసీపీ 3 ఎల్ జేఎస్పీ2 శివసేన2 జేడీ(యు) 2 బీఎస్పీ3 తృణమూల్ కాంగ్రెస్ 1 జేఎంఎం 1 అప్నాదళ్ 1 బీజేడీ 1 ఎన్ సీపీ 1 ఎన్ పీపీ 1 టీఆర్ఎస్ 1

41 నుంచి 50 వయస్సున్న లోక్ సభ సభ్యులు 106 బీజేపీ 62 కాంగ్రెస్ 11 వైసీపీ 5 శివసేన 4 జేడీ(యు) 2 బీఎస్పీ 2 తృణమూల్ కాంగ్రెస్ 2 ఏఐఏడీఎంకె 1 డీఎంకే 8 ఆమ్ ఆద్మీ పార్టీ 1 ఐయుఎంఎల్ 1 బీజేడీ 3 టీఆర్ఎస్ 1 ఎస్ పీ 1 ఎన్ సీపీ 1 ఆర్ ఎల్పీ 1

రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!