కొబ్బరి కాయల వ్యాను బోల్తా.. అక్కడి స్థానికులు ఏం చేశారంటే? వీడియో
రోడ్డు మీద ఏదైనా వాహనానికి ప్రమాదం జరిగితే వాహనంలో ఉన్నవారికి ఏమైనా గాయాలయ్యాయా? వారు క్షేమంగా ఉన్నారా లేదా అని కంగారుగా చూస్తారు. వెంటనే సహాయక చర్యలు చేపడతారు. పోలీసులకు సమాచారం ఇస్తారు. కానీ ఇక్కడ కొందరు మాత్రం వాహనదారులకు ఏమైతే మనకేంటిలే మనకు కావలసింది మనం తీసుకొని పోదాం అనుకున్నారు. కొబ్బరికాయలు లోడుతో వెళుతున్న వాహనం బోల్తా కొట్టడంతో కాయలన్నీ చెల్లాచెదురుగా పడిపోయాయి. దాంతో స్థానికులు పండగ చేసుకున్నారు.
దొరికిన వారికి దొరికినన్ని అన్నట్టుగా సంచులనుండి కొబ్బరికాయలు నింపుకొని బస్తాలు బస్తాలు తీసుకెళ్ళిపోయారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట వద్ద కొబ్బరికాయలతో వెళుతున్న బోలేరో వాహనాన్ని లారీ ఢీకొట్టింది. దీంతో బోలేరో బోల్తా పడింది. అందులోని కొబ్బరికాయలన్నీ రోడ్డుపైన రోడ్డు పక్కన చెట్ల పొదల్లోకి పడిపోయాయి. విషయం తెలుసుకున్న స్థానిక తండావాసులు సంచులతో పరుగెత్తుకొచ్చి కొబ్బరికాయలు నింపుకెళ్ళిపోయారు. ఇతర వాహనదారులు సైతం తమ వద్ద ఉన్న సంచుల్లో పట్టినన్ని కొబ్బరికాయలు తీసుకెళ్ళిపోయారు. ఇంతకి ఆ వాహనం డ్రైవర్ గాని ఆ లోడు యజమానికి సంబంధించి గాని ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు.
మరిన్ని వీడియోల కోసం :
సైకిల్ పై గడ్డిమోపుతో ట్రంప్.. వీడియో వైరల్
ఈ ప్రభుత్వ టీచర్ ప్రయత్నం అద్భుతం వీడియో
వియ్యంకుడితో లేచిపోయిన వియ్యింపురాలు..కూతురి మామతో ఎఫైర్ వీడియో
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
