సైకిల్ పై గడ్డిమోపుతో ట్రంప్.. వీడియో వైరల్
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పేరు వినగానే సీరియస్ లుక్స్ ఎవరేమనుకుంటే నాకేంటి అనే డోంట్ కేర్ యాటిట్యూడ్, టారిఫ్ వార్, కఠిన వలస విధానాలు గుర్తొస్తాయి. స్వతహాగా వ్యాపారవేత్త అయిన ట్రంప్ రైతుగా మారితే చిరునవ్వులు చిందిస్తే ఇప్పుడు అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రంప్ ను రైతులా మార్చేసింది. భారత్ లోని పల్లెటూరిలో ఒక వృద్ధ రైతు ఎలా ఉంటాడో అచ్చం అలాగే అమెరికా అధ్యక్షుడు కనిపించారు.
సైకిల్ మీద గడ్డి మోపు మోసుకెళ్తూ ఆవును తోలుకెళ్తూ చెట్టెక్కి పూలు కోస్తూ మనవడు మనవరాళ్లకు కనుకలు కొనిస్తూ తన తోటి వారితో సరదాగా గడుపుతున్న ట్రంప్ వీడియోను ఏఐ తో సృష్టించారు. బ్యాక్ గ్రౌండ్ లో వినిపించిన బలగం సినిమా పాటపై వీడియోపై నెటిజెన్లు కామెంట్ల వర్షం కురిపించారు. క్యూట్ ఏఐ మ్యాజిక్ సూపర్ ఈ గెటప్ బాగా సెట్ అయింది. ట్రంప్ జీ ఎంత మంచిగా ఉన్నారో చూడండి. భారత్ కు టారిఫ్ లు వేయకండి అంటూ పోస్టులు పెడుతున్నారు. దీంతోపాటు ట్రంప్ కు సంబంధించిన మరికొన్ని ఏఐ వీడియోలు కూడా కొన్ని రోజులుగా వైరల్ అవుతున్నాయి. వాటిలో ఒక దానిలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అగ్రరాజ్య అధ్యక్షుడికి ఆతిథ్యం ఇచ్చినట్లుగా ఉంది. సీఎం తో కలిసి రాష్ట్రమంతటా పర్యటించడంతో పాటు స్థానిక ప్రజలతో మమేకమైనట్లు అందులో ఉంది. ఈ వీడియోలు చాలా సరదాగా ఉన్నాయని నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు.
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
