తాటి ముంజలు ఇష్టంగా తింటున్నారా? వీడియో
తాటి ముంజులు అంటే ఇష్టపడే వారు వాటిని చూడగానే వెంటనే బైక్ అక్కడ ఆపి తాటి ముంజులు తింటూ ఉంటారు. ఇందులో పెద్ద విషయం ఏముంది? మా టైం వేస్ట్ చేయడం కాకపోతే అనుకుంటున్నారా? ఈ సీన్ చూస్తే అసలు అలా అనుకోకపోగా ముంజులు తినడానికి ముందు ఒకటికి పది సార్లు ఆలోచిస్తారు. వేసవి వచ్చిందంటే ఎక్కువగా తినే ఆహార పదార్థాల్లో తాటి ముంజులు ముందు వరుసలో ఉంటాయి. వేడి నుంచి ఉపశమనం కలిగించడంతో పాటు అనేక పోషకాలను ఇది అందిస్తుంది.
అందుకే వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. రోడ్డు పక్కన తోపుడు బండి పెట్టిన ఒక వ్యాపారి తాటికాయలన్నింటిని బాగా కడిగి బండి పై పెడుతున్నాడు. ఏం మంచిరా వాటర్ తోనో కడుగుతున్నాడు అనుకుంటే పొరపాటు. రోడ్డు పక్కన ఉన్న డ్రైనేజీ నీటితో శుభ్రంగా కడిగి బండి మీద పెడుతున్నాడు. ఈ సీన్ మొత్తం చూసిన స్థానికులు కొందరు తమ మొబైల్స్ లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు.
Follow Us
వైరల్ వీడియోలు
లక్షలాదిమంది మనసు గెలిచిన అమ్మ.. బిడ్డను వీపుపై మోస్తూ..
భోజనం పెడితే లక్ష..భోజనం చేస్తే రూ.50 వేలు జరిమానా..ఎక్కడో తెలుసా
హైదరాబాద్ వాసులకు అలర్ట్..డిసెంబర్ నుంచి నీటి కష్టాలు తప్పవా?
చంద్రుడి పై నివాసాలు.. అణు విద్యుత్ కు ప్రయోగాలు..
రష్యాలో ప్లేగు వ్యాధి పై క్రెమ్లిన్ చెప్పిందిదే
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?

